February 5, 2013

రెండో దశలోనూ టీడీపీ జోరు


సహకార సంఘాల ఎన్నికలు ముగియడంతో కేసీడీసీ బ్యాంకు అధ్యక్ష పదవిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు దృష్టి సారించాయి. మొదట్లో రా జకీయ పక్షాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోయినప్పటికీ చివరికి వచ్చేసరికి ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. ప్రస్తుతానికి సహకార సంఘాల స్థాయిలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే టీడీపీ మద్దతుదార్లు రెండు దశల్లోను మెజార్టీ సాధించారు. అయితే కాం గ్రెస్, వైసీపీల మధ్య విభజన కింది స్థాయిలో ఇంకా పూర్తిగా జరగలేదు. దాంతో జిల్లా స్థాయిలో చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికకు వచ్చే సరికి వైసీపీ అధ్యక్షులు కొందరిని కలుపుకొని కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేకపోలేదు.పార్టీ రహితంగా రెండు విడతలుగా జరిగిన ఈఎన్నికల్లో ప్రధాన పార్టీలు బహిరంగంగానే పాలు పంచుకున్నా యి.

ఇప్పటి వరకు సొసైటీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయా పార్టీల నాయకులు ఇకపై 18న జరగనున్న కేడీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్ష పదవులపై గురి పెట్టాయి. జిల్లాలో మొత్తం 425 సంఘాలుండగా పెనుగంచిప్రోలు సొ సైటీ మినహా మిగిలిన 424 సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అనంతరం 18 సొసైటీలకు స్టే రాగా 406 సొసైటీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వీటిలో తొలివిడతలో 89 సొ సైటీలకు ఎన్నికలు జరగ్గా, 105 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. రెం డో విడతలో భాగంగా 212 సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 119 ఏకగ్రీవం కాగా 93 సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి.

టీడీపీదే హవా సోమవారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు అధిక చోట్ల గెలుపొందారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో కలిపి 93 సంఘాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 47 చోట్ల విజయం సాధించారు. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ 17, వైసీపీ మద్దతుదార్లు 17 మంది గెలుపొందిన వారిలో ఉన్నారు. ఐదు చోట్ల స్వతంత్రులు గెలవగా, ఏడు సొసైటీల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.