February 5, 2013

నూజివీడు డివిజన్‌లో టీడీపీ ఘన విజయం

నూజివీడు డివిజన్‌లోని 14 మండలాల్లో సోమవారం నాడు జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిం చింది. ఎన్నికలు జరిగిన 64 సంఘాలకు 50 శాతం అనగా 32 సంఘాలను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుని, విజయం బావుట ఎగురవేసింది. కాంగ్రెస్ కు 10 సొసైటీలు, వైసీపీ 12 సొసైటీలు, స్వతంత్ర అభ్యర్థులకు 3 సొసైటీలు దక్కగా, 5 సొసైటీల ఎన్నికలు టై కాగా, రెండు సొసైటీలు ఎన్నికల ఫలితం పెండింగ్‌లో ఉన్నాయి.ఉయ్యూరు మండలంలో 4సొసైటీల ఎన్నికలు జరగ్గా, రెండు కాంగ్రెస్‌కు, ఒక స్వతంత్ర అభర్థికి దక్కాయి. వీరవల్లి మొఖాసాగ్రామంలో కాంగ్రెస్, టీడీపీ, చెరిసగం స్థానాలు చేజిక్కించుకుని టై సాధించాయి. ముసునూరు మండలంలో 4 సొసైటీల్లో , రెండు తెలుగుదేశం, రెండు వైసీపీ, ఆగిరిపల్లిలోని 4 సొసైటీలకు 3 వైసీపీ, ఒకటి టీడీపీ దక్కించుకున్నాయి.

గన్నవరం మండలంలో 6 సొసైటీ లకు ఎన్నికలు జరగ్గా, రెండు సొసైటీల ఎన్నికల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ ఖాతాలో 2, కాంగ్రెస్ 1, స్వతంత్ర ఒకటి పడ్డాయి. తిరువూరు మండలంలో 5 సొసైటీలకు మూడు టీడీపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి వైసీపీకి దక్కాయి. విస్సన్నపేట మండలంలో రెండు సొసైటిల్లో ఒకటి టీడీపీకి దక్కగా, కొర్లమండ సొసైటిలో టీడీపీకి 6, కాంగ్రెస్‌కు 3, వైసీపీకి 3 దక్కి టై అయ్యాయి. ఉంగుటూరు మండలంలో ఐదు సొసైటిలకు 3 టీడీపీ, 2 కాంగ్రెస్ కు దక్కాయి. నూజివీడు మండలంలో ఐదు సొసైటీల్లో టీడీపీకి 2, వైసీపీకి 2, కాంగ్రెస్ కు ఒకటి, చాట్రాయి మండలంలో2 సొసైటీల్లో ఒకటి టీడీపీకి దక్కగా ఒకటి టై అయ్యింది.

బాపులపాడు మండలంలో 7 సొసైటిల్లో టీడీపీకి 4, వైసీపీకి 3, ఏ.కొండూరు మండలంలోనాలుగు సొసైటీల్లో 3 టీడీపీకి, ఒకటి కాంగ్రెస్ కు దక్కాయి. రెడ్డిగూడెం మండలంలో రెండు సొసైటీ ఒకటి కాంగ్రెస్ కు దక్కగా, శ్రీరాంపురం టై అయ్యింది. పమిడిముక్కల మండలంలో 7 సొసైటీల ఎన్నికల్లో 3 టీడీపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి వైసీపీ ఒకటి స్వతంత్రులకు దక్కగా, ఒక సొసైటీ టై అయ్యింది. గంపలగూడెం మండలంలో 7 సొసైటీలు టీడీపీకే దక్కటం విశేషం.పెండింగ్, టై అయిన వాటిలో కూడా ఎక్కువశాతం టీడీపీ ఖాతాలో జమ అయ్యేఅవకాశం కనిపిస్తోంది.ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీల్లో తెలుగుదేశం 26, కాంగ్రెస్ 20, వైసీపీ 11, స్వతంత్ర అభ్యర్థులకు 5 దక్కాయి.