February 5, 2013

టీడీపీకి పూర్వ వైభవానికి కృషి చేస్తా

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. భారతీనగర్లోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు పనితీరు, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడినై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తన రాకను జిల్లాలోని తెలుగుదేశం నాయకులంతా స్వాగతించారని, తాను పార్టీలోకి రావడానికి ఎవరి ప్రోద్బలం లేదన్నారు. ముందుగా నాయకులందరి సహకారంతో జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తేవడమే కాకుండా యువతను చైతన్య వంతులను చేయాలని నిశ్చయించుకున్నానన్నారు. పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా తిరిగి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధి నేడు పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏపని చేయడానకైనా సిదంగా ఉన్నానని చెప్పారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ప్రశ్న: మీ పెదనాన్న కాంగ్రెస్‌లో ఉండగా మీరు తెలుగుదేశంలోకి వస్తున్నారేంటి జవాబు: మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు చంద్రబాబు సిద్ధాంతాలకు ఇష్టపడి పార్టీలో చేరుతున్నాను. ఎవరి సిద్ధాంతాలు వారివి అంటూ నవ్వారు ప్రశ్న: మీ తండ్రి సమ్మతంతోనే పార్టీలోకి వచ్చారా జవాబు: మా నాన్నగారి సిద్ధాంతాలు వేరు, ఆయనకు నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదు. అయితే ఆయనను ఒప్పించుకోగలనన్న పూర్తి నమ్మకం ఉంది

ప్రశ్న: పెనమలూరు ఎమ్మెల్యే సీటు ఆశించి పార్టీలోకి వస్తున్నారా జవాబు: నేను ఏప్రాంతంలోనూ ఎమ్మెల్యే సీటు కోసం ఆశపడి పార్టీలోకి రావడంలేదు, సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి మాత్రమే వస్తున్నాను. అయితే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను

ప్రశ్న: దేవినేని అవినాష్ యూత్ కాంగ్రెస్‌లో పనిచేస్తుంటే నిన్నమొన్నటి వరకు ఆయన వెంట తిరిగి నేడు టీడీపీలోకి వస్తున్నారేంటి జవాబు: నేను ఎన్నడూ స్టేజీలు ఎక్కిఎక్కడా మాట్లాడలేదు. ఏపార్టీ జెండాను బుజాన వేసుకోలేదు.

నేటినుంచే తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకుని కష్టపడి పనిచేయాలనిర్ణయించుకున్నాను

ప్రశ్న: మీరాకను కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మీరేమంటారుజవాబు: అదేమీలేదు అందరూ ఆహ్వానిస్తున్నారు. అందరినీ కలుపుకుపోతా,అందరితోనూ కలిసి పనిచేస్తా