May 31, 2013



అహ్లూవాలియా రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించడం వెనుక కిరణ్ తప్పుడు సమాచారం ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం అవినీతిలో కొట్టిమిట్టాడుతుంటే అభివృద్ధి పథంలో నడుస్తుందనడం హాస్యాస్పదమని యనమల అన్నారు. బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పథకాలకు కోత విధించి, కొత్త పథకాలు పెడతారా లేక ప్రజలపై మరోసారి పన్నుల భారం విధిస్తారా సిఎం స్పష్టం చేయాలని కోరారు. అహ్లూవాలియా మాటవరుసకు అన్న మాటలను ఏదో ప్రశంసించినట్లు సిఎం పేర్కోవడం గర్హనీయమని యనమల వ్యాఖ్యానించారు.

సిఎంపై యనమల విమర్శలు


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి శుక్రవారం విమర్శించారు. తెలంగాణపై తీర్మానం తెచ్చే శక్తి కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. కెసిఆర్ ఉద్యమాన్ని వదిలి పెట్టి నేతల ఇళ్ల చుట్టు తిరుగుతూ.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా టిక్కెట్ల పేరుతో గాలం వేస్తున్నారన్నరు.

ఒకప్పుడు తెలంగాణకు చెన్నారెడ్డి, వెంకట స్వామిలు మోసం చేస్తే, ఇప్పుడు కెసిఆర్, కాకా తనయులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేత కెసిఆర్ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ప్రాధాన్యం ఇస్తున్నార్ననారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టిక్కెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలా... ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నిజంగా తెలంగాణను కోరుకుంటే టిడిపితో కలిసి రావాలన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా విగ్రహాలు పెడతామని, జేబులో ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతామని పెద్దిరెడ్డి అన్నారు. తెరాసలోకి వెళ్లేవారంతా పదవుల కోసమే వెళ్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఏసి కింద స్వతంత్ర ఉద్యమానికి కెసిఆర్ సిద్ధం కావాలన్నారు.

వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు కెసిఆర్: పెద్దిరెడ్డి

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి యస్ అన్నాకే అవినీతి జరిగిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సిబిఐ క్షుణ్ణంగా విచారించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కోరారు. జగన్‌కు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన డైరెక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. జగన్ అవినీతిలో వైయస్ పాత్ర ఎంత వరకు ఉందో వెలికితీయాలన్నారు. ఆయన మృతి చెందాడన్న సానుభూతి అవినీతిని నిగ్గుతేల్చే విషయంలో పనికి రాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.