March 26, 2013

హైదరాబాద్ : సభను నడపడం చేతకాకపోతే దిగిపోవాలంటూ ప్రభుత్వంపై టీడీపీ మండిపడింది. రాష్ట్ర బడ్జెట్ తొలిదఫా సమావేశాల చివరిరోజైన మంగళవారం శాసనసభ విపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ప్రారంభమైన వెంటనే గంటపాటు వాయిదా పడింది. ఉదయం 9.02 గంటలకు సభ ప్రారంభమవగానే ప్రతిపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మనోహర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ, టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో.. సభ 10గంటలకు వాయిదాపడింది.

మరో 55 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడేందుకు మంత్రి రఘువీరాకు స్పీకర్ అనుమతిచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రఘువీరా కలుగజేసుకొని తనకు అవకాశమివ్వాలని, త్వరగా ముగిస్తానని కోరడంతో టీడీపీ సభ్యులు శాంతించారు. "శాసనసభ సమావేశాల తీరు బాధ కలిగిస్తోంది. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌ల వైఖరి వల్లే ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయాయి'' అని టీడీపీ సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు

చేతకాకుంటే దిగిపొండి: టీడీపీ

'ఉద్యమ' విద్యుత్!
అంటుకున్న కరెంటు మంటలు
అసెంబ్లీ వాయిదా.. ఆందోళన ఉధృతం
ఉద్యమ బాటలో తెలుగుదేశం
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శిబిరం
చికిత్సకు నిరాకరణ, ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగింపు



అదే స్థలం... ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్! అదే అంశం... విద్యుత్ సమస్య! పుష్కర కాలం తర్వాత చరిత్ర పునరావృతమైంది! అప్పుడు... తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఎమ్మెల్యేల దీక్ష! ఇప్పుడు... కాంగ్రెస్ సర్కారుపై లెఫ్ట్ దీక్షకు కొనసాగింపుగానా అన్నట్లు తెలుగుదేశం దీక్ష! రాష్ట్రంలో మరోమారు విద్యుత్ వేడి రగిలింది. దీక్షా భేరి మోగింది.

హైదరాబాద్ : కరెంటు చార్జీలు, కోతలపై వామపక్ష నేతలు చేస్తున్న దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేసిన కొద్ది సేపటికే... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు మెరుపు దీక్షకు దిగారు. తొలివిడత బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడగానే... ప్రధాన ప్రతిపక్ష సభ్యుల 'నిరవధిక దీక్ష' మొదలైంది. అసెంబ్లీ నుంచి నేరుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పాదయాత్రగా వెళ్లి దీక్ష ప్రారంభించారు.

చార్జీల భారం తగ్గింపు, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్తు డిమాండ్లతో 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నిరవధిక నిరశనకు కూర్చున్నారు. దీంతో కొన్నాళ్లుగా రగులుతున్న 'విద్యుత్తు వేడి' మరింత రాజుకున్నట్లయింది. ఇది ఇప్పట్లో చల్లారే పరిస్థితి లేదని తేలిపోయింది. విద్యుత్తుపై శాసనసభలో సోమవారం మొదలైన చర్చకు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ దీటుగా బదులిచ్చినప్పటికీ... విద్యుత్తు ఇబ్బందులు నిజమే అని అంగీకరించక తప్పలేదు. ఈ సంవత్సరం ఇంత కష్టాలు ఉంటాయని తాము ఊహించలేదన్నారు.

సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చార్జీల భారం వాటిని భరించగలిగే వారిపైనే ఉంటుందని... సామాన్యులపై మాత్రం ఉండదని తెలిపారు. కిరణ్ నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదంటూ విపక్షాలు మండిపడ్డాయి. సీఎం సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతకు ముందు మాట్లాడిన విపక్ష నేతలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న చార్జీలను ఉపసంహరించుకోవాలని, సర్‌చార్జీలను తొలగించాలని పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. కిరణ్ దీనిపై స్పందించాలని వామపక్ష నేతలు కోరినప్పటికీ ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటానికి ఇష్టపడలేదు.చివరికి... సభ నిరవధికంగా వాయిదా పడింది. సభలో పుట్టిన వేడి... బయటకు విస్తరించింది.

ఒక భగ్నం... ఒక ప్రారంభం: విద్యుత్ కోతలు, చార్జీలపై నిరశనకు దిగిన 'ఎరుపు' శిబిరంపై పోలీసులు మంగళవారం రాత్రి 7.35 గంటలకు మెరుపు దాడికి దిగారు. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న రాఘవులు, నారాయణ సహా ఇతర వామపక్ష నేతలను అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ నేతలు ఆస్పత్రిలోనే తమ దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.

ఇలా ఇందిరా పార్కు వద్ద లెఫ్ట్ శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించిన కాసేపటికే... ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ శిబిరం మొదలైంది. ఈ సమస్యపై సర్కారు దిగి వచ్చేదాకా పోరాడతామని దీక్ష వేదికపై నుంచి టీడీపీ నేతలు ప్రకటించారు. ఇక... విద్యుత్ సమస్యపై ప్రభుత్వం సభలో సమాధానం చెప్పకుండా వాయిదా వేసుకొని పారిపోయిందంటూ వైసీపీ అసెంబ్లీ రెండో గేటు ముందు ధర్నాకు దిగారు. కాసేపటి తర్వాత వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

లెఫ్ట్ శిబిరంపై పోలీస్ 'పవర్'.. నేతల అరెస్టు

అనపర్తి : పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయమని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' కోసం పాదయాత్ర మంగళవారం అనపర్తి మండలంలో కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పెడపర్తి రేవులో బస చేసిన ప్రదేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెడపర్తి రేవు నుంచి చంద్రబాబు పాద యాత్ర మొదలుపెట్టారు. పెడపర్తి, కుతుకులూరు, రామవరం గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని, విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తోందనానరు.

ఈ ఛార్జీలు సర్‌ఛార్జీలు కాదని, వైఎస్ పాలనలో దోచుకున్న దోపిడీకి ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ములని బాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల దోపిడీలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. పన్నుల రూపంలో ఎంత సొమ్ము వసూలు చేసినప్పటికీ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, ప్రతి నిరుపేదకు ఇంటి స్థలాన్ని ఇచ్చి రూ.1.50 లక్షలతో గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఒక్కసారి తమ పార్టీకి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు.

పాదయాత్ర ప్రారంభం నుంచి అశేష జనవాహిని వెంట రావడంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.

పెడపర్తి వద్ద పొలాల్లో కూలిపని చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి కష్టసుఖాలను అడిగి తెలుసుకు
న్నారు. ఇటుక బట్టీలలో కార్మికులు తయారు చేస్తున్న ఇటుకలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుతుకులూరులోని బజ్జీల దుకాణం వద్దకు వెళ్ళిన బాబు బజ్జీలను వేయించి అందరినీ అశ్చర్యపరిచారు. కుతుకులూరు గ్రామంలోని ప్రశాంత్ విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాబు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పాదయాత్రలో బాబు వెంట టీడీపీ నేతలు నల్లమిల్లి మూలారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధి,రైతుల సంక్షేమమే ధ్యేయం

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.

దీక్ష చేస్తున్న నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

పెంచిన తల్లులు వాళ్లు.. పంటను పెంచే కౌలుదార్లు వీళ్లు.. బిడ్డలపై ఆ తల్లులకు ఎంత హక్కు ఉంటుందో; చదును చేసి, సాలు పోసి, సాగు చేసిన కౌలుదార్లకు కూడా.. ఆ పంటపై అంతే అధికారం! ఛీకొట్టినా, చీదరించినా ఆ తల్లికి బిడ్డ ప్రేమ ఎలాంటిదో.. తుఫాన్లు ముంచినా, ప్రభుత్వం శీతకన్ను వేసినా కౌలుదార్లకు నేలపై మమకారం అలాంటిది. కాబట్టే.. నిండా అప్పుల్లో మునిగి కూడా పుడమితల్లినే నమ్ముకున్నారు. ముంచినా తేల్చినా మాగాణే దిక్కు అని మొండిగా బతుకుతున్నారు. పెడపర్తి-కుతుకులూరు గ్రామాల్లో రైతు సమస్యలపై నేను ఆరా తీస్తున్నప్పుడు కొందరు కౌలు రైతులు ముందుకొచ్చారు.

"మమ్మల్నీ పట్టించుకోండి సార్!'' అంటూ గోడు వెళ్లబోసుకున్నారు. సాగంటే సర్కారుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతుకు అందించే సాయమే అంతంతమాత్రం. ఇక కౌలుదార్లను పట్టించుకునేది ఎవరు? కరువుకో, తుఫానుకో పంట పోతే రైతుకైనా, కరువు సాయం, తుఫాను నష్టం.. మంచి ప్రభుత్వమయితే పంటపై చేసిన అప్పులకు వడ్డీ మాఫీ..ఒక్కోసారి రుణ మాఫీ కూడా జరగొచ్చు. కౌలుదారుకు ఆ భాగ్యమూ లేదు "ఎక్కడ సార్! 'నీలం'తో నిండా మునిగాం. అయినా వినేదెవరు? అప్పులకూ వడ్డీలు కట్టుకోవాలి. కౌలూ చెల్లించుకోవాలి'' అని వాపోయారు. ఇక సర్కారు చెప్పే 'గుర్తింపు' (కార్డు) ఎక్కడ?

మట్టిలోంచి తీసినట్టు ఉన్నాడు. దగ్గరకెళ్లి పలకరిస్తే మాత్రం.. మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. కుతుకులూరులో ఓ ఇటుకలబట్టీలో అతడు కలిశాడు.. అతడి కష్టం నన్ను కదిలించింది 'చదువుకుంటే ఈ కష్టం ఉండదు కదా బాబూ!'' అని అనునయించాను. "లేదుసార్! ఇంటర్ దాకా చదువుకున్నా.స్తోమత లేక ఆపేశాను'' అని చెబుతుంటే.. ఈ సర్కారు కాష్టంలో పడితేగానీ ఈ యువకులకు కష్టం తప్పదనిపించింది!

చంద్రయాన్.. 'కౌలు' కష్టం తీరేదెప్పుడో!

శ్రమజీవుల శత్రువులు వాళ్లు!
వైఎస్ నుంచి కిరణ్ దాకా దోపిడీదార్లే
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం
ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కడతామని హామీ

కాకినాడ : నాటి వైఎస్ నుంచి నేటి కిరణ్‌కుమార్ రెడ్డి దాకా.. కాంగ్రెస్ సీఎంలంతా శ్రమజీవుల శత్రువులేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. అధికారంలోకి వస్తే, ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుచేయిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.600కు పెంచుతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు జంక్షన్ వద్ద మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. పెడపర్తి, కుతుకులూరు, రామవరం, మహేంద్రవాడ, రాయవరం వరకు 12.1 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో వైఎస్ కుటుంబం అక్రమాలపై విరుచుకుపడ్డారు.

"రాష్ట్రంలో ఆదాయం పెరిగింది. అది పేదలకు చేరితే రాష్ట్రం మరోలా ఉండేది. కానీ దాన్నంతా వైఎస్ కుటుంబం, కొంతమంది కాంగ్రెస్ నాయకులు దోచుకున్నా''రని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని చెప్పారు. టీడీపీ అందించిన పారదర్శక పాలనను, అవినీతిమయ, అసమర్థ కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తే..కాంగ్రెస్ దొంగలు విద్యుత్ లేకుండా చేశారని విమర్శించారు. వైఎస్ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా దోపిడీదార్లేనని, వారంతా శ్రమజీవుల శత్రువులని దుయ్యబట్టారు.

"నేను ఎవరి మీదో వ్యక్తిగత వైరంతో చెప్పడం లేదు. ఈ తొమ్మిదేళ్లలో జరిగిన దోపిడీ పాలనకు భవిష్యత్తులోనూ మనమంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. పెరిగిన ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరితే, ఈ ప్రభుత్వం మాత్రం పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసి దోమలను అభివృద్ధి చేస్తు''న్నదని ఎద్దేవా చేశారు. 7.50 లక్షల మంది బిఎడ్ నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన 'ఎస్.జి.టి' అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తనను కలిసిన కొందరు బీఎడ్ అభ్యర్థులకు ఆయన ధైర్యం చెప్పారు. అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామని, కాపులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు.. అనపర్తి మండలం పెడపర్తిలో ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. "ప్రభుత్వ వైఫల్యాలు, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) అక్రమాలను సమర్థంగా ప్రజల వద్దకు తీసుకెళితే మనదే అధికారం'' అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌లో కొంతమందికే పదవులు వస్తే టీడీపీలో అందరికీ న్యాయం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని కోరారు. ఆ ఎన్నికలలో విజయం సాధిస్తే యోగ క్షేమాలు సహా ప్రతి బాధ్యతా తీసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్యపై ఉద్యమిస్తున్న లెఫ్ట్ నేతల అరెస్టును ఆయన ఖండించారు.

పేదల సొమ్ము తిన్నారు పెరిగిన ఆదాయాన్ని దోచేశారు లేదంటే రాష్ట్రం దశ మారేది


స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: విద్యుత్ సమస్యపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని, ఇది దద్దమ్మ ప్రభుత్వమని మా జీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి దుయ్యబట్టారు. సోమవారం రంగచారి కాంప్లెక్స్‌లో ని ర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో వి ద్యుత్ చార్జీలు పెంచేది లేదని హామీ ఇ చ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 9 ఏ ళ్లలో 3 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. చార్జీలు, సర్ చార్జీలు పెంచి అదనంగా రూ. 31500 కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధమైందన్నారు. రైతులకు రోజుకు 3 గంటల పా టు కూడ విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయి నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. పంటలను కాపాడుకోవడానికి జనరేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మళ్లు తడుపుకుంటున్నారని పేర్కొన్నారు.

ఒక్క ఎకరా కూడ ఎండడం లేదని చెబుతున్న సీఎం గ్రామాలకు వస్తే రైతులు పడుతున్న బాధలను చూపుతానని సవాలు చేశారు. తెలంగాణ అంశంపై తాను ఢిల్లీలో పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పానని, ఎవరైనా పార్టీ వైఖరి సరిగా లేదనే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వా రెడ్డి మాట్లాడుతు విద్యుత్ కోతలు నివారించి రైతుల పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో మారబోయిన ఎల్లయ్య, బూర్ల శంకర్, గట్టు ప్రసాద్‌బాబు, సుధాకర్ రెడ్డి, కే. శ్రీను, శ్యాంకుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భరత్, ఇసాక్, ఎల్. రాజు, నీల గట్టయ్య, యాదగిరి పాల్గొన్నారు.

ఇది దద్దమ్మ ప్రభుత్వం :కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: విద్యుత్ కోతలు, చార్జీల పెంపు, వ్యవసాయానికి 9 గం టలు సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఘన్‌పూర్ 133/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మండుటెండలో రోడ్డుపై కార్యకర్తలు, నాయకులతో కలిసి కడియం శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ, గృహ, పారిశ్రామిక వర్గాలకు సక్రమంగా విద్యుత్ అందించలేక పోతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రహదారిపై బైఠాయించి నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టడంతో పోలీసులు నాయకులకు మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రాస్తారోకోతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

ఈ సమయంలో ట్రాన్స్‌కో డీఈఈ శ్రీకాంత్ అక్కడికి చేరుకోవడంతో కడియం శ్రీహరి విద్యుత్ సరఫరా పరిస్థితిపై నిలదీశారు. ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుదామని డీఈఈ నాయకులను విద్యుత్ ఏడీఈ ఆఫీసులోకి తీసుకుపోయారు. కడియం శ్రీహరి, బస్వారెడ్డి తదితర టీడీపీ నాయకులు డీఈఈకి రోజుకు 3 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. డీఈఈ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గట్టు ప్రసాద్ బాబు, ఎం. ఎల్లయ్య, బూర్ల శంక ర్, వెంకటయ్య, కొంతం శ్రీను, రత్నాకర్ రెడ్డి, సు ధాకర్ రెడ్డి, శ్యాంకుమార్ రెడ్డి, ఎల్. రాజు, చింత భరత్, నీల గట్టయ్య, యా కూబ్ పాష, కోతి రాము లు, యాదగిరి, బాలస్వా మి, భిక్షపతి పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆందోళన


గాజువాక (విశాఖపట్నం): తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర నందమూరి అభిమాన సంఘాల గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీహరిరాజు (41) గుండెపోటుతో మృతిచెందారు.ఆయన గుల్లలపాలెం మార్కెట్‌కు ఎదురుగా వున్న తన కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటికి గుండెల్లో నొప్పి రావడంతో సన్నిహితులకు ఫోన్ చేసి కార్యాలయానికి త్వరగా రావాల్సిందిగా కోరారు. సన్నిహితులు వచ్చేసరికే కుర్చీలో కుప్పకూలిపోయి వున్నారు. ఆయన్ను హుటాహుటిన సమీపంలో వున్న సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు «ద్రువీకరించారు.

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోన్‌లో సంభాషణ... సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో శ్రీహరిరాజు ఫోన్‌లో సంభాషించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడూ బైక్‌పై వెళ్లేవారని, అటువంటిది సోమవారం కాలినడకన వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఎనిమిదిన్నర వరకు ఫోన్‌లో తమతో మాట్లాడిన ఆయన 8.45 సమయానికి మృతి చెందినట్టు సమాచారం రావడంతో సన్నిహితులంతా దిగ్భ్రాంతి చెందారు.

సినీ డ్రిస్టిబ్యూటర్‌గా... శ్రీలక్ష్మి నరసింహ ఫిల్మ్ డ్రిస్టిబ్యూటర్ యజమానిగా వున్న కొత్తపల్లి శ్రీహరిరాజుకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. విశాఖకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతిసారి శ్రీహరిరాజు వారి వెంటే వుండేవారు.

టీడీపీ నాయకులకు అండగా... పార్టీ ఆవిర్భావం సమయంలో శ్రీహరిరాజు తల్లి కొత్తపల్లి ప్రభావతి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తల్లితో పాటు శ్రీహరిరాజు కూడా పార్టీలో తిరుగుతూ క్రియాశీలక పాత్ర పోషించారు. టీడీపీని పారిశ్రామిక ప్రాంతంలో బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, టీడీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా వుంటూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

నిరుద్యోగ యువతకు అండగా... తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, సినిమా డ్రిస్టిబ్యూటర్‌గా కాకుండా కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తూ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుద్యోగ యువతకు శ్రీహరిరాజు అండగా నిలిచారు. ఆయన ముక్కుసూటిగా వ్యవహరించేవారని, ఆపదలో వున్న వ్యక్తులు సాయం కోరితే వెనుకాడకుండా వారికి అండగా నిలిచేవారని శ్రీహరిరాజు సన్నిహితులు స్పష్టం చేశారు.

తెలుగుయువత నేత శ్రీహరిరాజు హఠాన్మరం

(విశాఖపట్నం): మీ కోసం వస్తున్న పాదయాత్రకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉగాది రోజున విశాఖ జిల్లాకు రానున్నారు. ముందుగా ప్రకటించిన తేదీలల్లో స్వల్పమార్పులు చేశారు. వచ్చే నెల పదిన కొత్త అమావాస్య కావడంతో మరుసటి రోజు నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర ముగింపుమాత్రం వచ్చేనెల 27న వుంటుంది. అందువల్ల ఆదివారాలు కూడా అధినేత పాదయాత్ర వుంటుందని పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. తాజాగా సవరించిన షెడ్యూల్ మేరకు వచ్చే నెల తొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చేరుకుని అక్కడే బసచేస్తారు.

పదిన కొత్త అమావాస్య కావడంతో విశాఖ జిల్లాలో నూకాంబిక పండుగ జరుపుకుంటారు. దీంతో ఆ రోజు చంద్రబాబు కోటనందూరులోనే వుంటారు. పదకొండు ఉగాదిన ఉదయం పంచాంగం శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం అదే రోజు సాయంత్రం విశాఖ జిల్లా గన్నవరం మెట్టలోనికి అడుగిడతారు. అక్కడ నుంచి 27 వరకు ఇప్పటికే ఖరారుచేసిన రూటు మేరకు పాదయాత్ర వుంటుందని రత్నాకర్ తెలిపారు. రూటులో ఆదివారాలు కూడా నడుస్తారని తెలిపారు. వచ్చేనెల 27న కచ్చితంగా ముగింపుసభ వుంటుందని వివరించారు. ముగింపుసభ వేదిక ఖరారుపై ఒకటి రెండురోజుల్లో ఖరారుచేస్తామని తెలిపారు.

ఉగాది నుంచి బాబు యాత్ర

బోధన్ : రైతులు పంటరుణాలు చెల్లించవద్దని కరెంట్ బిల్లులు కట్టవద్దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు అన్నారు. సో మవారం సాయంత్రం బోధన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంటే బోధన్ నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ స్వంత ఇలాఖాలో రైతులవద్ద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్బందపు వసూళ్లను సొసైటీ ల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీసీసీబీ చైర్మన్ స్పందించాలన్నారు. కరెంట్ ఇవ్వని పాలకులకు కరెంట్ బిల్లులు కట్టవద్దని అన్నారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని రైతులకు కనీసం 5 గంటల విద్యుత్ కూడా అందే పరిస్థితులు లేక పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు.

ప్రజలకు మద్దతుగా ని లిచేందుకు ప్రజా సమస్యల్లో భాగస్వాములు అయ్యేందుకు బోధన్ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీడీపీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుద్దెరాజేశ్వర్, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, ఖలీల్, బండారుపొశెట్టి తదితరులు పాల్గొన్నారు.

29 నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం బోధన్ నియోజకవర్గంలో ఈనెల 29న పార్టీ ఆవిర్బావదినోత్సవం నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు పేర్కొన్నారు.

నవీపేట మండలంలోని కమలాపూర్, లక్ష్మీకిసాన్ ఫారాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లుంటాయన్నారు. మార్చి 29,30వ తేదీల్లో నవీపేట మండలంలో మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన బోధన్ పట్టణంలో ఏప్రిల్ 7,8వ తేదీల్లో బోధన్ మండలంలో, ఏప్రిల్ 9,10 తేదీల్లో ఎడపల్లి మండలంలో.13,14వ తేదీల్లో రెంజల్ మండలాల్లో పల్లెపల్లెకు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

రైతులు రుణాలు కట్టొద్దు..విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు

రేపల్లె : పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ధర్నా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తీరుస్తామంటూ గద్దెనెక్కిన నాయకులు ఒకరు జైల్లో వుంటే.. ఎంపీ నేమో ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.

రేపల్లె, మృత్యుంజయపాలెం, నిజాంపట్నం, అల్లపర్రు, అడవులదీవిలలో ఏ వాటర్ స్కీమ్ కూడా ఒక్క పూట నీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రేపల్లెలో పైలెట్ వాటర్ స్కీమ్‌కు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసినా ప్రజలకు సమృద్ధిగా నీరు అందించటంలో విఫలం చెందారన్నారు. ఓ పక్క విద్యుత్ కోతతతో సతమత మవుతుంటే, డ్రెయినేజ్‌లో మురుగు పేరుకుపోయి నీరు పారక దోమలతో సతమతమవుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

మురికివాడల్లో ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ చల్లటం లేదని, దీనివల్ల ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పాలకులు, అధికారులు గొప్పలు చెప్పటమే తప్ప పట్టణంలో సమృద్ధిగా నీరు అందించటంలో విఫలం చెందారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘంలోని అధికారులు ప్రజలకు నీరు అందించి మురుగునీరు, విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. తొలుత పట్టణంలో వార్డుల్లోని సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించారు. అనంతరం కమిషనర్‌కు వినతిప్రతం అందజేశారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీపీ రామారావు, దాసరి నాగరాజు, జీవీ నాగేశ్వరరావు, కె.రమాశాంతాదేవి, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు,ఎన్‌వీకే ప్రసాద్, లోకం మోషే, డొక్కు వీరయ్య, పంతాని మురళీధరరావు, మెండు సుబ్బారావు, మేకా రామకృష్ణ, గుర్రం మురహరిరావు, ఆలూరి డానియేల్, శ్యామ్, మోర్ల అంజయ్య, కారుమూరు బసవరావు, షేక్ ఖాదర్ బాషా, బి.రాజకిషోర్, షేక్ మొబిన్, అంకాలు, మోర్ల అరుణ, దున్నా జయప్రద తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని టీడీపీ ధర్నా

కాకినాడ: కాంగ్రెస్ దొంగలపాలనలో గ్రామా ల్లో మంచినీళ్లు దొరకవు. మందు ఫు ల్లు.. మంచినీళ్లు నిల్.. అని చంద్రబా బు విమర్శించారు. 174వ రోజు పాదయాత్రలో భాగంగా సోమవారం మం డపేట, అనపర్తి నియోజకవర్గాలలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో బానిసపాలన కొనసాగిందని కొడుకు జగన్‌కి లక్షల కోట్లు దోచిపెట్టి ప్రజలకు పప్పు బెల్లాలు పంచాడన్నారు.

గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టించి పేదల రక్తం పీల్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా రుణ మాఫీపై తొలి సంతకం, బెల్టుషాపుల ఎత్తివేతపై రెండో సంత కం, గ్రామాలకు సురక్షిత తాగునీటి కోసం మూడో సంతకం చేస్తానని బాబు చెప్పుకొచ్చారు.

నీళ్లులేక జనం అల్లాడిపోతున్నారని, పొలాలకు సైతం సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు కొట్టుమిట్టాడుతుందని చంద్రబాబు విమర్శించారు.

జగన్ దోచుకున్న సొమ్ము రూ.43 వేల కోట్లు ఇప్పటివరకు సీబీఐ విచారణలో బయటపడిందని.. వైఎస్ఆత్మ కేవీపీని విచారిస్తే మరిన్ని వేల కోట్ల అవినీతి బయటకు వస్తుందన్నారు.

వైఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్, గాలి జనార్ధనరెడ్డి దోచుకున్న సొమ్ముతో టన్నులకొద్దీ బంగారం కొన్నారన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి సైతం లేని బంగారు ఊయ ల, సింహాసనం వంటివి గాలికి ఉన్నాయన్నారు. మహిళల మెడలో పుస్తెల తాడు కోసం బంగారం కొనుక్కునేందుకు స్తోమత లేకుండా పోయిందన్నారు. వైఎస్ కుటుంబం చేసిన అక్రమాలు,అరాచకాలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పేదరికంలో కూ రుకుపోయిందని చంద్రబాబు విమర్శించారు.

సొంత ఇంటికి వచ్చేయండి.. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం వారు ఒకాయన మా టలు నమ్మి మోసపోయారు. ఇపుడు మీరంతా టీడీపీని ఆదరిస్తున్నారు. ఇంకా ఎవరైనా కాంగ్రెస్ మాయలో ఉంటే వెనక్కి వచ్చేయండి. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు మిమ్మల్ని మోసగించేందుకే మాయమాటలు చెప్తున్నారు. అనిచంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్, వైసీపీ దున్నపోతు పార్టీలు ఓ దున్నపోతు రెండుగా విడిపోయింది. కాంగ్రెస్ ముసలి దున్న పోతు. వైసీపీ కుర్ర దున్నపోతు. వాళ్లకి ఓట్లేస్తే మిమ్మల్ని కుమ్మేస్తారు. కుర్ర దున్నపోతుకి ఓటేస్తే మరీ దారుణంగా కుమ్మేస్తుంది.. అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాపులపై గురి.. అగ్రవర్ణాలలోనూ పేదరికం ఉంద ని., కాపులలో ఎక్కువగా పేదలు ఉన్నారని చంద్రబాబు అన్నారు. కాపులలో పేదల కోసం ఆ నేతలతో మా ట్లాడి రెండ్రోజుల్లో ప్రత్యేక పథకం ప్రవేశపెడ తామన్నారు.

అవినీతిపై బెబ్బులి పులులై తిరగబడండి: వైఎస్, కాంగ్రెస్ అవినీతి, అరాచకాలపై కార్యకర్తలు, యువత కొండవీటి సింహాలై, బెబ్బులి పులులై తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువత నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఊరుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. కాంగ్రెస్ అవినీతిపై పోరాటానికి అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఏడిదలో ఒక మహిళ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతివల్ల తమకు అన్యాయం జరుగుతుందని, కరెంటులేక తాగునీరు ఉండ టం లేదని తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చాకా విద్యుత్ కోతల సమ స్య, అధికబిల్లుల సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పాలనలో మందు పుల్లు.. మంచినీళ్లు నిల్

మండపేట: వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా మండపేట మండలం ఏడిద, మండపేట పట్టణాల్లో బాబు పాదయాత్ర సాగింది. మండపేట పట్టణం కలువపువ్వు సెంటరులో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐటి రంగాన్ని నిర్వీర్యం చేయడం వలన రాష్ట్రానికి పరిశ్రమలు రావటంలేదని బాబు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో రాజమండ్రి, కాకినాడలను ఐటి సిటీలుగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ హాయాంలో చేసే అభివృద్ధి పనులను ఆయన వివరించారు. మండపేట నియోజకవర్గంలో తొలిరోజు పర్యటనకు ప్రజలు బ్రహ్మర«థం పట్టారు.

సోమవారం మండపేట మండలం ఏడిద నుంచి ప్రారంభమైన పాదయాత్ర మండపేట మీదుగా సాగింది. బాబుకు మహిళలు ప్రజలు, రైతులు తమ గోడును వెళ్ల బుచ్చుకున్నారు. ఏడిదలో పారిశ్రామికవేత్త బీఎస్ఆర్ చారిటబుల్ వ్యవస్థాపకులు బలుసు శ్రీనివాస్ ఏర్పాటుచేసిన మంచినీటిప«థకాన్ని బాబు ప్రారంభించారు. బాబు తన ప్రసంగం లో ప్రభుత్వం అవినీతిని ఎండగట్టడం, తమ పార్టీ అధికారంలోకివస్తే చేసే పథకాలు గురించి వివరించారు. ఏడిద నుంచి మండపేట చేరుకున్న బాబుకు ఘనస్వాగతం లభించింది. మండపేట చేరుకున్న బాబు కలువపువ్వు సెం టరులో పట్టణానికి చెందిన గ్రామ పెద్ద వల్లూ రి బొజ్జియ్య విగ్రహన్ని ఆవిష్కరించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ వేగుళ్ల వీర్రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం జరిగిన సభలో బాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నం పెట్టే కోస్తా జిల్లాల్లో గతేడాది క్రాప్‌హాలిడే ప్రకటించడం సిగ్గుచేటని బాబు అన్నారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సేవలను అయన వివరించారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వటం తోపాటు నిరుద్యోగులకు చదువును బట్టి నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. బాబు పర్యటనకు వచ్చిన స్పందన బాబుతో పాటు పార్టీనేతలకు మంచి ఊపునిచ్చింది. అడుగడుగునా మహిళలు మంగళహారతులు తో బాబుకు స్వాగతం పలికారు. బాబు తన పాదయాత్రలో రైతులు మహిళలు వృద్దులు కర్షకులు కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

మండపేటలో బాబు కులసంఘాలతో భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి బాబు మాట్లాడు తూ తమ ప్రభుత్వంవస్తే అందరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. బట్టలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని వస్త్ర వ్యాపారులు చంద్రబాబుకు మండపేటలో వినతిపత్రాన్ని సమర్పించారు. వారిని ఉద్దేశించి బాబు మా ట్లాడుతూ వ్యాపారులకు టీడీపీ అండగా ఉం టుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వ్యాట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చా రు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్య, రుణ మాఫీ, పేదలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. మండపేటలో బాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. బాబు పాద యాత్ర 2500 కిలోమీటర్లు పూర్తయిన సం దర్భంగా మండపేటలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫైలాన్‌ను ఆవిష్కరించారు.

అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి 2500 కొవ్వొత్తులతో చేపట్టిన ప్రదర్శనను బాబు ప్రారంభించారు. 15 జిల్లాలు 2500 కి.మీ.,లు పూర్తి చేసుకోవడం తనకు మరపురాని అనుభూతినిచ్చిందని తన యాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. రాత్రి 10గంటలు దాటిన తర్వాత జనం భారీగా బాబు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. బాబు పాదయాత్రలో వివిధ కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.

బాబు వెంట స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఆర్‌టీసీ మాజీ ఛైర్మన్ నెక్కంటి బాలక ృష్ణ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, కుమార్‌బాబు, గోదావరి డీసీ ఛైర్మన్ రెడ్డి బాబూరావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, ఎర్రపోతిన వెంకటేశ్వరరావు, ఎరగతపు బాబ్జీ, గొడవర్తి పూర్ణప్రసాద్, దాట్ల బుచ్చిబాబు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్తిబాబు, సయ్యపు రాజు రామకృష్ణం రాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చుండ్రు వెంకట్రావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు, వల్లూరి నారా యణమూర్తి, భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీతోనే యువతకు భవిష్యత్

మండపేట: జిల్లాలో తాను చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను ఆదరించిన రాజమండ్రి సిటీ, రూరల్ ని యోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మీకోసం వస్తు న్నా పాదయాత్రలో భాగంగా ఏడిద లో బస చేసిన చంద్రబాబు రాజమం డ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఒక కుటుంబమని, ఇక్కడ కష్టపడేవారికి గుర్తింపు తప్పనిసరిగా వస్తుందని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణమని అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అవినీతిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.

పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరిచి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కో రారు. ప్రస్తుతం కరెంటు, విద్య, తాగునీరు లభించకపోగా, ధరలు విపరీతం గా పెరిగిపోయి నష్టపోతున్నామని ఓ గీత కార్మికుడు చెప్పడం తనకు ఆవేదనను కలిగించిందన్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఆ భాధ్యత మనందరిపై ఉందని కొంతమంది చేసిన సూచనను బాబు అంగీకరించారు.

తమ హయాంలో రౌడీయిజం, కుల,మత ఘర్షణలకు తావులేకుండా పాల న అందించామని చెప్పారు. అభ్యర్థుల ఎన్నికలో రహస్య ఎస్ఎంఎస్‌ల పద్దది పాటించాలని ఓ యువకుడు బాబుకు సూచించారు. దీనిపై బాబు మాట్లాడుతూ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని యువతకు, మంచివారికి అవకాశం ఇస్తామన్నారు. టీడీపీ జిల్లా సమావేశాలు నియోజకవర్గ స మావేశాలు మండలాలోను, మండల సమావేశాలు గ్రామాల్లోను నిర్వహిస్తే పార్టీని పటిష్ట పరిచేందుకు వీలు కలుగుతుందని పలువురు సూచించారు. ఎస్సీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యతను బాబు గుర్తు చేశారు. మాలలకు వర్గీకరణ ద్వారా అన్యాయం జరగదని చె ప్పారు.

ముస్లింలకు సీటుల శాతం పెంచాలని యువతకు పెద్దపీట వేయాలని, విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని పలువురు సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసే పరి శ్రమల్లో ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించాలని పలువురు కోరగా, వాటిని పరిశీలిస్తున్నామని బాబు హామీ ఇచ్చారు. సమావేశంలో రెండు నియోజకవర్గాల కార్యకర్తలు విక్టరీ చిహ్నం చూపాలంటూ చేసిన విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు. సమావేశంలో రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబా బు, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, నాయకులు గన్ని కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం

175రోజులు మండపేట కలువ పువ్వు సెంటర్‌కు చేరుకునేటప్పటికీ 2500 కిలోమీటర్లు. ఇది రాష్ట్ర చరిత్ర లో సరికొత్త రికార్డు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. చిరంజీవి మోజులోపడి టీడీపీని వీడి వెళ్లిన కాపు సోదరులు సొంతింటి కి సగర్వంగా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాపు నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

2500 కిలోమీటర్ల సరికొత్త రికార్డు


పుత్తూరు: అవినీతిమయమైపోయిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ పుత్తూరులో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రూ.లక్షల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టిన కాంగ్రెస్ నాయకులు చివరకు జైలుశిక్ష అనుభవిస్తున్నారని విమర్శిం చారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రోజుకో కుంభకోణంలో కూరుకుపోతుండగా వైఎస్ హయాంలో లక్ష కోట్లు భోంచేసిన ఆయన కుమారుడు జగన్ జైలు పాలయ్యాడని గుర్తు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా 30 ఏళ్లుగా తనను ఆదరిస్తూ వచ్చిన పుత్తూరు, నగరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మె ల్యే ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు.

అందుకోసమే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నగరి, పుత్తూరులను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని తెలిపారు.అనంతరం కాంగ్రెస్ నాయకుడు గాలి జీవరత్నం నాయుడు సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు.అంతకుముందు ఆరేటమ్మ ఆలయం నుంచి కార్వేటినగరం రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలో చేరిన వారిలో మధు, కె.శివ, ఐఎన్‌టీయూసీ ఆర్టీసీ యూనియన్ నాయకుడు టి.సత్యనారాయణ తదితరులున్నారు.

టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, ఉపాధ్యక్షుడు మదనపల్లి మధుబాబు, ఎమ్మెల్యే తనయుడు గాలి జగదీష్, పాకారాజ, ఎస్.ఎన్.మాధవ, బి.జీవాశేఖర్,తంగరాజ్,సి.ఎస్.బాబు, డి.ఎస్.గణేష్, ఎ.డి.కిష్టప్ప,జానా వెంకటయ్య, దేవానందమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తల్లి,పిల్ల కాంగ్రెస్‌లను తరిమికొట్టండి

బైరెడ్డిపల్లె,: రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లె మండలంలో గత రెండు రోజులుగా జరుగుతున్న టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సోమవారం దేవదొడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఒక వైపు విద్యుత్ సమస్యతో రైతులు, పెరిగిన ధరలతో సామన్య ప్రజలు తల్లడిల్లుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా వుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా వుండాలంటే టీడీపీ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు. కాగా గగినేపల్లె, దేవదొడ్డి, తీర్థం, గడ్డూరు, ఎం.కొత్తూరు, దాసార్లపల్లె మూగనపల్లె, గొల్లచీమనపల్లె, లక్కనపల్లె, పెద్దచెల్లారగుంటలో గ్రామ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు సుభాష్ చంద్రబోస్, రామచంద్ర నాయుడు, రాజన్న, అమరనాధరెడ్డి, వెంకట్రమణగౌడు, వెంకటప్పగౌడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి ఫూర్వ వైభవం తేవాలి

అనంతపురం అర్బన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నా యుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తు న్నా మీకోసం పాదయాత్ర 2500 కి.మీ చేరుకోవడంతో తెలుగుతమ్ముళ్ళ లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అది కూడా ఈ యాత్ర అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమై విజయవంతంగా కొనసాగడం పట్ల ఇక్కడి తమ్ముళ్ళ ఆనందానికి హ ద్దు లేకుండా పోయింది. 2500 కి.మీ దాటిన సందర్భంగా సోమవారం జి ల్లా వ్యాప్తంగా తమ్ముళ్ళు సంబరాలు జరుపుకున్నారు. అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో కేక్‌లు కట్ చేసి, స్వీట్‌లు పంచడం, దేవాలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహించి అధినేతకు ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ఇం దులో భాగంగా జిల్లా కేంద్రంలో సో మవారం రాత్రి ప్రత్యేక సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకు డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్ర హం వద్ద 2500 కి.మీ పేరుతో విద్యు త్ వెలుగులు ఏర్పాటు చేశారు. అక్క డే కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. దేవుడా మాకు రక్ష ఎవరంటూ బతుకులీడుస్తున్నారన్నా రు. ఈ పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకొని అండగా నేనున్నానని చెప్పి వారిలో ఆత్మస్థైర్యం పెంచాలని 63 ఏళ్ళ వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ పాదయాత్రకు లక్షలాది మంది ప్రజలు అండగా నిలిచి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలోనే చంద్రబాబు పాదయాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. 9 ఏళ్ళ పాటు సీఎంగా ఉంటూ మరో 9 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న మహానాయకుడు బాబు అని కొనియాడారు. ఇంతటి మహాయజ్ఞం ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల తలరాతలు మారనున్నాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుగ్గయ్య చౌదరి, నెట్టెం వెంకటేష్, నదీం అహ్మద్, నగర అధ్యక్షుడు క్రిష్ణకుమార్, సరిపూటి రమణ, కూచే హరిప్రసాద్, నజీర్, సుబ్బారెడ్డి, మణికంఠ బాబు, సాయిరామయ్య చౌదరి, గుడిపూటీ శీనా, కాకర్ల ఆదినారాయ ణ, అశోక్ నగర్ శీనా, మణికంఠి జయ ప్ప, చెర్లోపల్లి రామక్రిష్ణ, అంకె చంద్ర, నంబూరీ రమణ, రామచంద్ర, పరమేష్, రియాజ్, బాలు, సైఫుద్దీన్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణస్వామి, భాస్కర్‌యాదవ్, వెంకటప్ప, లాల్ బాషా, మహిళా నాయకురాలు, రమాదేవి, లక్ష్మిదేవమ్మ పాల్గొన్నారు.

తెలుగు తమ్ముళ్ల సంబరాలు