March 26, 2013

ఇది దద్దమ్మ ప్రభుత్వం :కడియం శ్రీహరి


స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: విద్యుత్ సమస్యపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని, ఇది దద్దమ్మ ప్రభుత్వమని మా జీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి దుయ్యబట్టారు. సోమవారం రంగచారి కాంప్లెక్స్‌లో ని ర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. 2004, 2009 ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో వి ద్యుత్ చార్జీలు పెంచేది లేదని హామీ ఇ చ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 9 ఏ ళ్లలో 3 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. చార్జీలు, సర్ చార్జీలు పెంచి అదనంగా రూ. 31500 కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధమైందన్నారు. రైతులకు రోజుకు 3 గంటల పా టు కూడ విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయి నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. పంటలను కాపాడుకోవడానికి జనరేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మళ్లు తడుపుకుంటున్నారని పేర్కొన్నారు.

ఒక్క ఎకరా కూడ ఎండడం లేదని చెబుతున్న సీఎం గ్రామాలకు వస్తే రైతులు పడుతున్న బాధలను చూపుతానని సవాలు చేశారు. తెలంగాణ అంశంపై తాను ఢిల్లీలో పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పానని, ఎవరైనా పార్టీ వైఖరి సరిగా లేదనే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వా రెడ్డి మాట్లాడుతు విద్యుత్ కోతలు నివారించి రైతుల పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో మారబోయిన ఎల్లయ్య, బూర్ల శంకర్, గట్టు ప్రసాద్‌బాబు, సుధాకర్ రెడ్డి, కే. శ్రీను, శ్యాంకుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భరత్, ఇసాక్, ఎల్. రాజు, నీల గట్టయ్య, యాదగిరి పాల్గొన్నారు.