March 26, 2013

కాంగ్రెస్ పాలనలో మందు పుల్లు.. మంచినీళ్లు నిల్

కాకినాడ: కాంగ్రెస్ దొంగలపాలనలో గ్రామా ల్లో మంచినీళ్లు దొరకవు. మందు ఫు ల్లు.. మంచినీళ్లు నిల్.. అని చంద్రబా బు విమర్శించారు. 174వ రోజు పాదయాత్రలో భాగంగా సోమవారం మం డపేట, అనపర్తి నియోజకవర్గాలలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో బానిసపాలన కొనసాగిందని కొడుకు జగన్‌కి లక్షల కోట్లు దోచిపెట్టి ప్రజలకు పప్పు బెల్లాలు పంచాడన్నారు.

గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టించి పేదల రక్తం పీల్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా రుణ మాఫీపై తొలి సంతకం, బెల్టుషాపుల ఎత్తివేతపై రెండో సంత కం, గ్రామాలకు సురక్షిత తాగునీటి కోసం మూడో సంతకం చేస్తానని బాబు చెప్పుకొచ్చారు.

నీళ్లులేక జనం అల్లాడిపోతున్నారని, పొలాలకు సైతం సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు కొట్టుమిట్టాడుతుందని చంద్రబాబు విమర్శించారు.

జగన్ దోచుకున్న సొమ్ము రూ.43 వేల కోట్లు ఇప్పటివరకు సీబీఐ విచారణలో బయటపడిందని.. వైఎస్ఆత్మ కేవీపీని విచారిస్తే మరిన్ని వేల కోట్ల అవినీతి బయటకు వస్తుందన్నారు.

వైఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్, గాలి జనార్ధనరెడ్డి దోచుకున్న సొమ్ముతో టన్నులకొద్దీ బంగారం కొన్నారన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి సైతం లేని బంగారు ఊయ ల, సింహాసనం వంటివి గాలికి ఉన్నాయన్నారు. మహిళల మెడలో పుస్తెల తాడు కోసం బంగారం కొనుక్కునేందుకు స్తోమత లేకుండా పోయిందన్నారు. వైఎస్ కుటుంబం చేసిన అక్రమాలు,అరాచకాలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పేదరికంలో కూ రుకుపోయిందని చంద్రబాబు విమర్శించారు.

సొంత ఇంటికి వచ్చేయండి.. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం వారు ఒకాయన మా టలు నమ్మి మోసపోయారు. ఇపుడు మీరంతా టీడీపీని ఆదరిస్తున్నారు. ఇంకా ఎవరైనా కాంగ్రెస్ మాయలో ఉంటే వెనక్కి వచ్చేయండి. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు మిమ్మల్ని మోసగించేందుకే మాయమాటలు చెప్తున్నారు. అనిచంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్, వైసీపీ దున్నపోతు పార్టీలు ఓ దున్నపోతు రెండుగా విడిపోయింది. కాంగ్రెస్ ముసలి దున్న పోతు. వైసీపీ కుర్ర దున్నపోతు. వాళ్లకి ఓట్లేస్తే మిమ్మల్ని కుమ్మేస్తారు. కుర్ర దున్నపోతుకి ఓటేస్తే మరీ దారుణంగా కుమ్మేస్తుంది.. అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాపులపై గురి.. అగ్రవర్ణాలలోనూ పేదరికం ఉంద ని., కాపులలో ఎక్కువగా పేదలు ఉన్నారని చంద్రబాబు అన్నారు. కాపులలో పేదల కోసం ఆ నేతలతో మా ట్లాడి రెండ్రోజుల్లో ప్రత్యేక పథకం ప్రవేశపెడ తామన్నారు.

అవినీతిపై బెబ్బులి పులులై తిరగబడండి: వైఎస్, కాంగ్రెస్ అవినీతి, అరాచకాలపై కార్యకర్తలు, యువత కొండవీటి సింహాలై, బెబ్బులి పులులై తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువత నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఊరుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. కాంగ్రెస్ అవినీతిపై పోరాటానికి అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఏడిదలో ఒక మహిళ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతివల్ల తమకు అన్యాయం జరుగుతుందని, కరెంటులేక తాగునీరు ఉండ టం లేదని తెలిపింది. టీడీపీ అధికారంలోకి వచ్చాకా విద్యుత్ కోతల సమ స్య, అధికబిల్లుల సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.