March 26, 2013

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆందోళన

స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: విద్యుత్ కోతలు, చార్జీల పెంపు, వ్యవసాయానికి 9 గం టలు సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఘన్‌పూర్ 133/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మండుటెండలో రోడ్డుపై కార్యకర్తలు, నాయకులతో కలిసి కడియం శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ, గృహ, పారిశ్రామిక వర్గాలకు సక్రమంగా విద్యుత్ అందించలేక పోతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రహదారిపై బైఠాయించి నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టడంతో పోలీసులు నాయకులకు మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రాస్తారోకోతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

ఈ సమయంలో ట్రాన్స్‌కో డీఈఈ శ్రీకాంత్ అక్కడికి చేరుకోవడంతో కడియం శ్రీహరి విద్యుత్ సరఫరా పరిస్థితిపై నిలదీశారు. ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుదామని డీఈఈ నాయకులను విద్యుత్ ఏడీఈ ఆఫీసులోకి తీసుకుపోయారు. కడియం శ్రీహరి, బస్వారెడ్డి తదితర టీడీపీ నాయకులు డీఈఈకి రోజుకు 3 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. డీఈఈ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ అందించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గట్టు ప్రసాద్ బాబు, ఎం. ఎల్లయ్య, బూర్ల శంక ర్, వెంకటయ్య, కొంతం శ్రీను, రత్నాకర్ రెడ్డి, సు ధాకర్ రెడ్డి, శ్యాంకుమార్ రెడ్డి, ఎల్. రాజు, చింత భరత్, నీల గట్టయ్య, యా కూబ్ పాష, కోతి రాము లు, యాదగిరి, బాలస్వా మి, భిక్షపతి పాల్గొన్నారు.