March 26, 2013

రైతులు రుణాలు కట్టొద్దు..విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు

బోధన్ : రైతులు పంటరుణాలు చెల్లించవద్దని కరెంట్ బిల్లులు కట్టవద్దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు అన్నారు. సో మవారం సాయంత్రం బోధన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంటే బోధన్ నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ స్వంత ఇలాఖాలో రైతులవద్ద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్బందపు వసూళ్లను సొసైటీ ల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీసీసీబీ చైర్మన్ స్పందించాలన్నారు. కరెంట్ ఇవ్వని పాలకులకు కరెంట్ బిల్లులు కట్టవద్దని అన్నారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని రైతులకు కనీసం 5 గంటల విద్యుత్ కూడా అందే పరిస్థితులు లేక పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు.

ప్రజలకు మద్దతుగా ని లిచేందుకు ప్రజా సమస్యల్లో భాగస్వాములు అయ్యేందుకు బోధన్ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీడీపీ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుద్దెరాజేశ్వర్, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, ఖలీల్, బండారుపొశెట్టి తదితరులు పాల్గొన్నారు.

29 నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం బోధన్ నియోజకవర్గంలో ఈనెల 29న పార్టీ ఆవిర్బావదినోత్సవం నుంచి పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు పేర్కొన్నారు.

నవీపేట మండలంలోని కమలాపూర్, లక్ష్మీకిసాన్ ఫారాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లుంటాయన్నారు. మార్చి 29,30వ తేదీల్లో నవీపేట మండలంలో మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన బోధన్ పట్టణంలో ఏప్రిల్ 7,8వ తేదీల్లో బోధన్ మండలంలో, ఏప్రిల్ 9,10 తేదీల్లో ఎడపల్లి మండలంలో.13,14వ తేదీల్లో రెంజల్ మండలాల్లో పల్లెపల్లెకు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.