March 26, 2013

టీడీపీతోనే యువతకు భవిష్యత్

మండపేట: వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా మండపేట మండలం ఏడిద, మండపేట పట్టణాల్లో బాబు పాదయాత్ర సాగింది. మండపేట పట్టణం కలువపువ్వు సెంటరులో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐటి రంగాన్ని నిర్వీర్యం చేయడం వలన రాష్ట్రానికి పరిశ్రమలు రావటంలేదని బాబు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో రాజమండ్రి, కాకినాడలను ఐటి సిటీలుగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ హాయాంలో చేసే అభివృద్ధి పనులను ఆయన వివరించారు. మండపేట నియోజకవర్గంలో తొలిరోజు పర్యటనకు ప్రజలు బ్రహ్మర«థం పట్టారు.

సోమవారం మండపేట మండలం ఏడిద నుంచి ప్రారంభమైన పాదయాత్ర మండపేట మీదుగా సాగింది. బాబుకు మహిళలు ప్రజలు, రైతులు తమ గోడును వెళ్ల బుచ్చుకున్నారు. ఏడిదలో పారిశ్రామికవేత్త బీఎస్ఆర్ చారిటబుల్ వ్యవస్థాపకులు బలుసు శ్రీనివాస్ ఏర్పాటుచేసిన మంచినీటిప«థకాన్ని బాబు ప్రారంభించారు. బాబు తన ప్రసంగం లో ప్రభుత్వం అవినీతిని ఎండగట్టడం, తమ పార్టీ అధికారంలోకివస్తే చేసే పథకాలు గురించి వివరించారు. ఏడిద నుంచి మండపేట చేరుకున్న బాబుకు ఘనస్వాగతం లభించింది. మండపేట చేరుకున్న బాబు కలువపువ్వు సెం టరులో పట్టణానికి చెందిన గ్రామ పెద్ద వల్లూ రి బొజ్జియ్య విగ్రహన్ని ఆవిష్కరించారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ వేగుళ్ల వీర్రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం జరిగిన సభలో బాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నం పెట్టే కోస్తా జిల్లాల్లో గతేడాది క్రాప్‌హాలిడే ప్రకటించడం సిగ్గుచేటని బాబు అన్నారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సేవలను అయన వివరించారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వటం తోపాటు నిరుద్యోగులకు చదువును బట్టి నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. బాబు పర్యటనకు వచ్చిన స్పందన బాబుతో పాటు పార్టీనేతలకు మంచి ఊపునిచ్చింది. అడుగడుగునా మహిళలు మంగళహారతులు తో బాబుకు స్వాగతం పలికారు. బాబు తన పాదయాత్రలో రైతులు మహిళలు వృద్దులు కర్షకులు కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

మండపేటలో బాబు కులసంఘాలతో భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి బాబు మాట్లాడు తూ తమ ప్రభుత్వంవస్తే అందరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. బట్టలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని వస్త్ర వ్యాపారులు చంద్రబాబుకు మండపేటలో వినతిపత్రాన్ని సమర్పించారు. వారిని ఉద్దేశించి బాబు మా ట్లాడుతూ వ్యాపారులకు టీడీపీ అండగా ఉం టుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వ్యాట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చా రు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్య, రుణ మాఫీ, పేదలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. మండపేటలో బాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. బాబు పాద యాత్ర 2500 కిలోమీటర్లు పూర్తయిన సం దర్భంగా మండపేటలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫైలాన్‌ను ఆవిష్కరించారు.

అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి 2500 కొవ్వొత్తులతో చేపట్టిన ప్రదర్శనను బాబు ప్రారంభించారు. 15 జిల్లాలు 2500 కి.మీ.,లు పూర్తి చేసుకోవడం తనకు మరపురాని అనుభూతినిచ్చిందని తన యాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. రాత్రి 10గంటలు దాటిన తర్వాత జనం భారీగా బాబు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. బాబు పాదయాత్రలో వివిధ కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.

బాబు వెంట స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఆర్‌టీసీ మాజీ ఛైర్మన్ నెక్కంటి బాలక ృష్ణ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, కుమార్‌బాబు, గోదావరి డీసీ ఛైర్మన్ రెడ్డి బాబూరావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, ఎర్రపోతిన వెంకటేశ్వరరావు, ఎరగతపు బాబ్జీ, గొడవర్తి పూర్ణప్రసాద్, దాట్ల బుచ్చిబాబు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్తిబాబు, సయ్యపు రాజు రామకృష్ణం రాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చుండ్రు వెంకట్రావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు, వల్లూరి నారా యణమూర్తి, భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.