November 27, 2013


 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులపంట రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంతో పాటు వివిధ చోట్ల హెలెన్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపాన్‌ వస్తే ప్రభుత్వం కనీసం సహాయ చర్యలు కూడా చేపట్ట లేదని ఆవేదన వ్యక్తం చేవారు. డెల్టా ఆధునీకరణ పనుల్లో రూ. కోట్ల దోపడీ జరిగిందని, అందుకే రైతులు పంటలను నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టదని విమర్శించారు. ఏ పనిచేసినా రాజకీయ కోణంలో చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తుపాన్‌ను కూడా పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ నేతలు అంతఃకలహాలతోనే మునిగి తేలు తున్నారని ఆరోపించారు.

రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జిలు ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ విధానాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అం దించాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చె ందిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కడగండ్లు తీరుస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అంతర్వేదిలో లక్ష్మిననసింహ స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు చిక్కాల రామచంద్రరావు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చినరాజప్ప, యర్రా నారాయణ స్వామితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీల ఇం చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అధికారంలోి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తాం

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేమని భావించి, ఆ భయంతోనే విభజన పేరుతో ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ కొత్త వాదం ప్రవేశపెట్టారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.ఆమె అతి తెలివి ఫలించదని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో సోనియాకు ముఖం చెల్లడంలేదు. అందుకే ఇక్కడకు రావడంలేదు. జగన్ ముసుగులో వస్తున్నది. ఈ ముసుగు తీసి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లే...........