September 15, 2013

'చిరంజీవి, కావూరి, లగడపాటి తదితర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులందరూ చేతకాని దద్దమ్మలు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఉద్యమం ఎగసిపడుతున్నా సోనియా భజనే చేస్తున్నారు.' అని కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. 47 రోజులుగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు.


సోనియాను తిడితే ఉద్యమకారుల గొంతులు పిసుకుతాం, నాలుకలు కోస్తామని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారన్నారు. తెలుగువాడికి భరోసా కల్పించటానికి టీడీపీ అధినేత చంద్రబాబు యాత్ర చేపడితే, ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా ప్రజల వద్దకు వెళ్లారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తమిళనాడుకు, కర్ణాటకకు తరలిపోయాయన్నారు. అలాగే 70 వేల కోట్ల రియల్ ఎస్టేట్ కూడా ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లిపోయిందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకొని నాలుకలు కోస్తాం, గొంతు పిసుకుతామని పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు

'చిరంజీవి, కావూరి, లగడపాటి తదితర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులందరూ చేతకాని దద్దమ్మలు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేది లేదని, కొన్ని పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని పది జిల్లాలతో కూడిన తెలంగాణను టీడీపీ కోరుకుంటుందన్నారు.


ఈ నెల 16న తెలంగాణ ప్రాంత పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ చేపడతామని అన్నారు. 4, 5 జిల్లాల్లో బహిరంగసభలు పెట్టే విషయమై ఆలోచిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టనున్నామన్నారు.

తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సెటిల్‌మెంట్ కాకపోవడం వల్లనే పార్లమెంట్‌లో
తెలంగాణ బిల్లు పెట్టడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్యాకేజా, మరేదైనా ఉందా అనే విషయం స్పష్టం కావడం లేదన్నారు. ఈ కారణంగానే కేబినెట్ నోట్‌కు కూడా వాయిదా వేసి ఉంటారని అన్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సెటిల్‌మెంట్ కాకపోవడం వల్లనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం లేదు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక నాయకుడిగా రెండు ప్రాంతాలలో పార్టీని రక్షించుకునే విదంగా ముందుకు వెళుతున్నారని టిడిపి ఎమ్.పి డాక్టర్ ఎన్.శివప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు బిజెపి,కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, నిజంగానే విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరుతున్నారని చంద్రబాబు వైఖరిని శివప్రసాద్ సమర్ధించారు.అయితే తాను సమైక్యవాదినని మాత్రం ఆయన స్పష్టం చేశారు.తమ పార్టీ ఏకపక్షంగా విబజన కోరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని,కాని తమ పార్టీ సమన్యాయం కోరుతోందని,పార్టీ తీర్మానం చూస్తే అర్దం అవుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు వైఖరి కరక్టే : డాక్టర్ ఎన్.శివప్రసాద్