April 17, 2013

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్‌కు సంబంధించి చంచల్‌గూడ జైల్లో ములాఖత్‌లపై విచారణ జరిపించాలని సీఎం కిరణ్‌ను టీడీపీ ఎమ్మెల్సీ

జైలు సూపరింటెండెంట్‌తో పాటు ఇతర సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆరోపించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిందితులకు ములాఖత్‌లు ఇవ్వడంలో చంచల్‌గూడ జైలు సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో విచారణ జరిపించాలని సూచించారు.
యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

జగన్ ములాఖత్‌లపై విచారణ: యనమల

కేసీఆర్ రాజకీయ వ్యభిచారి
ఉద్యమకారులను వదిలి ఊసరవెల్లులు టిక్కెట్లా?
తెలంగాణ టీడీపీ నేతల ధ్వజం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని గాలికి వదిలి ఇతర పార్టీల నాయకుల కోసం పాకులాడుతున్న కేసీఆర్.. రాజకీయ వ్యభిచారి అని టీ-టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. 'తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాల సభ్యులు కేసీఆర్ కంటికి ఆనడం లేదు. ఉద్యమకారులను వదిలి ఊసరవెల్లులకు టిక్కెట్లు ఇవ్వడానికి వెంపర్లాడుతున్నాడు. కేసీఆర్‌కు వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే' అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు, శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

'లాబీయింగ్‌తోనే తెలంగాణ వస్తుందని కొంతకాలం.. ఉద్యమం చేస్తేనే వస్తుందని మరికొంత కాలం కేసీఆర్ ప్రచారం చేశాడు. ఇప్పుడు సీట్లు వస్తేనే తెలంగాణ వస్తుందని కొత్త ప్రచారం మొదలుపెట్టాడు. కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమం కోసం లాఠీదెబ్బలు తిని పనిచేసిన వారితో ఆయనకు పనిలేదు. ఇప్పుడు పక్క పార్టీల వారి కోసం పాకులాడుతున్నాడు. జేఏసీకి ఇవి కనిపించవా? ఉద్యమాన్ని గాలికి వదిలి ఫాంహౌస్‌లో పడుకొంటే ఎందుకిలా చేస్తున్నావని ఎందుకు నిలదీయట్లేదు? టీడీపీ తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది. రాజీనామాలు చేసింది. ఉద్యమాల్లో పాల్గొంది.

అయినా కేసీఆర్ టీడీపీని శత్రువుగా చేసి.. కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అమ్ముడుపోయాడు' అని ఎర్రబెల్లి విమర్శించారు. ఒకప్పుడు ఇతర పార్టీల నాయకులంటే లెక్క లేనట్లు మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు వారినే తన పార్టీలోకి రమ్మని గడపగడపకూ తిరుగుతున్నాడని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. 'చేతగాని దద్దమ్మలు, చవటలే కేసీఆర్ పంచన చేరుతున్నారు. అచ్చమైన టీడీపీ వాడెవడూ చేరట్లేదు. కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను దొరలపాలన కిందకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటాడు. అదే నిజమైతే గద్దర్ పేరు ప్రకటించు. విమలక్క పేరు ప్రకటించు. దానికి నోరు రాదు. నీ బైరూపు వేషాలు ప్రజలు నమ్మేరోజులు పోయాయి' అని ఆయన అన్నారు. సోనియాగాంధీకి భయపడి పార్లమెంటులో నోరు తెరవడం లేదని, ఆమెను ఒక్క మాటంటే బొక్కలో తోయిస్తుందని భయమని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో వైఎస్, కేసీఆర్ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, ఒక కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే మరో కుటుంబం వేల కోట్లు సంపాదించిందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్‌కు వేసిన ప్రతి ఓటూ మురిగిపోయినట్లే

హైదరాబాద్: రాష్ట్రంలో సీట్లన్నీ తమవేనని జబ్బలు చరిచిన పార్టీల పతనం మొదలైందని, తాజా సర్వేలు అవే సూచిస్తున్నాయని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని, సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీలే నిలదొక్కుకోగలవని తాజాగా వెల్లడైన 'సీ ఓటర్' సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. శవాల మీద.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసేవారి కాలం చెల్లుతోంది. అక్కడ వైసీపీ తమకు 40 సీట్లు వస్తాయని, ఇక్కడ టీఆర్ఎస్ 15 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకొన్నాయి.

ఏడాది ముందే వాటి పతనం మొదలైంది. ఈ ఏడాదిలో ఇంకా పడిపోవడం ఖాయం. కొద్ది రోజుల్లో ఈ పార్టీలు కనుమరుగు అవుతాయి. పతనం మొదలైందన్నది ఈ సర్వేలు ఒక సంకేతంగా బహిర్గతం చేశాయి. ఆ సర్వేలో వచ్చినంత కూడా ఆ పార్టీల పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది' అన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయి టీడీపీ వైపు చూస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.

ఆ పార్టీల పతనం మొదలైంది! సర్వేలు అదే సూచిస్తున్నాయి: రేవంత్‌రెడ్డి

అనంతపురం అర్బన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నా యుడు మరో యాత్రకు శ్రీకారం చు ట్టనున్నారు. జూన్‌లో బస్సు యాత్ర నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. అది కూడా అనంతపురం జిల్లా నుం చే చేపట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ మొదటి వా రంలో ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కూడా జిల్లా నుంచే మొ దలుపెట్టారు. హిందూపురం నుంచి మొదలెట్టి దిగ్విజయంగా కొనసాగించారు. దీనికి విశేష స్పందన రావడం తో బస్సు యాత్ర కూడా జిల్లా నుంచే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు.

జిల్లాలో ఐదు రోజుల పా టు ఈ యాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు సమా
చారం. పవిత్ర స్థలమైన పుట్టపర్తి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో రెండేసి రోజులు, కదిరిలో ఒక రోజు బస్సు యాత్ర కొనసాగించనున్నట్లు తెలిసింది. ఈ యా త్ర ఐదు రోజులు కాకపోయినా.. కనీ సం నాలుగు రోజులైనా కొనసాగించే అవకాశాలున్నాయని సమాచారం. జి ల్లాలో యాత్ర ముగించుకొని చి త్తూరు వెళ్ళనున్నట్లు తెలిసింది. మే 27 నుంచి 29 వరకు మహానాడు వేడుకలు కొనసాగనున్నాయి. ఆ వెంటనే చంద్రబాబు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టునున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో టీడీపీ శ్రేణులను ఉత్తేజ పరచడానికి బాబు యాత్ర కొనసాగించనున్నారు.

జూన్‌లో బాబు బస్సుయాత్ర..!

ఎవరి ఉపాధికి హామీ ఈ పథకం? చేతులకు పని ఇచ్చి పట్టెడన్నం పెడతామని పథకం ప్రారంభం నాడు గొప్పగా ప్రకటించారు. కూలీలకు అన్నం పెడుతుందో లేదోగానీ, మన పెద్దలకు మాత్రం రోజూ పరమాన్నాన్నే వడ్డిస్తోంది ఈ పథకం. ఒకరకంగా పెరటిదొడ్డి పథకంగా మారిపోయింది. పొలాల దగ్గర నుంచి ఇంటి లోగిళ్ల వరకూ పక్కా రోడ్లు వేసుకోవడానికి మన నేతలకు ఉపాధి పథకం.. మంచి ఉపాయమే. ఓ పెద్దమనిషి అయితే తన ఎస్టేట్‌దాకా తారురోడ్డు వేయించుకున్నాడు.

ఒకవైపు మనం పన్నుల రూపంలో అందించిన డబ్బులనూ, మరోవైపు ప్రజల శ్రమనూ ఇలాంటి పెద్దలు గద్దలై కొల్లగొట్టేందుకు తప్ప మరెందుకీ పథకం? బలిఘట్టంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పడిపోయిన ఆ రోడ్డు గురించి విన్నప్పుడు మెదిలిన భావమిది. నిజానికి.. నేతల లీలలు విననివి కావు. తనకు, ప్రజలకు మ«ధ్య బంధం ఓటుకు..నోటుకు ఉన్న బంధం లాంటిదని చెప్పుకొనే 'రూ.500 ఎమ్మెల్యే' నుంచి 'నాకేంటి' అంటూ వాటాలను వాటంగా పట్టే 'పర్సంటేజీల' ప్రజాప్రతినిధి వరకు ఎందరిని చూడలేదు? కానీ, బలిఘట్టం-ధర్మసాగరం రోడ్డు వ్యవహారం మరో వింత పోకడ. తిప్పితిప్పి కొడితే నాలుగు కిలోమీటర్లు కూడా లేదు ఆ రోడ్డు. కానీ, ఆ ఊరివాళ్లకు అదే పెద్ద సమస్యగా మారిపోయింది. దారి పడితే ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని స్థాని

ఆ గ్రామం నుంచి ఈ పట్టణం దాకా తీరు ఒక్కటే..పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలూ ఒక్కటే. నీటి ఎద్దడి ముట్టడిలో చిక్కిన నర్సీపట్నానికి..ఈ సమయంలో చెరువులు, గుంటలు అందుబాటులోకి వస్తే ఎంత బాగుండు! కానీ, ఈ ప్రజా నిర్మాణాలను భూకబ్జా నుంచి విడిపించేది ఎవరు? పిల్లికి గంట కట్టడమే సమస్య! ఆ తరువాత అన్నీ చక్కబడతాయి!
కులు ఆశపడటమే గానీ, ఆలకించేది ఎవరు?

ఎవరి ఉపాధికి హామీ?

వైసీపీ ఇక కనుమరుగే
కేవీపీ రూపంలో వైఎస్ ఆత్మ
వైఎస్ ధృతరాష్ట్రుడు.. జగన్ దుర్యోధనుడు
కేసీఆర్‌ది ఫామ్‌హౌస్ పార్టీ
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం గ్రామంలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో ఆయన 'సీ ఓటర్' సంస్థ సర్వేపై స్పందించారు. "కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి కీలకపాత్ర పోషించనుంది. మమతాబెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, నవీన్‌పట్నాయక్, జయలలిత వంటి ప్రాంతీయ పార్టీల నేతల ప్రభావం అధికంగా ఉంది'' అని వివరించారు.

30 ఎంపీ సీట్లు గ్యారంటీగా గెలుస్తామని చెప్పిన వైసీపీ సీట్ల బలం పది లేక 12 సీట్లకు దిగజారిందని చెప్పారు. మరికొన్ని రోజులు ఆగితే నాలుగైదు సీట్లు కూడా కష్టమేనని, పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం పలికారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌పై గతంలో తాము విమర్శలు చేస్తే తిప్పికొట్టేందుకు ప్రయత్నించిన వారే ఇప్పుడు ఆయన అవినీతిపై పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారని గుర్తుచేశారు.

సీబీఐ విచారణ సందర్భంగా వైఎస్, కేవీపీ సన్నిహితులు వెల్లడిస్తున్న అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. "వైఎస్ ధృతర్రాష్టుడు. ఆయన పుత్రవాత్సల్యంతో జగన్ దుర్యోధనుడుగా మారారు. లక్ష కోట్లు సంపాదించి జైలుపాలయ్యారు. వైఎస్ అవినీతి గురించి అతని ముఖ్య కార్యదర్శి జన్నత్‌హస్సేన్, వ్యక్తిగత సహాయకుడు సూరీడు, ముఖ్య భద్రతా అధికారి రమేశ్ తదితరులు సీబీఐ ఎదుట వాంగ్మూలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

"కేవీపీ, జగన్ కలిసి రేటు నిర్ణయించిన తరువాతే పనులకు సంబంధించిన ఫైళ్లు కదిలేవని ఆ ముగ్గురి వాంగ్మూలం తేటతెల్లం చేసింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రెండు ఇళ్లు నిర్మించారని, జగన్ నివాసంలో అక్రమ లావాదేవీలు జరిగేవని రుజువైంది. వైఎస్ చనిపోయినా ఆయన ఆత్మ కేవీపీ రూపంలో మన చుట్టూ తిరుగుతోంద''ని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా బ్లాక్‌మెయిలర్ అని, ఆయనది ఫామ్‌హౌస్ పార్టీ అని ధ్వజమెత్తారు. వైఎస్ అవినీతికి సహకరించిన మంత్రులు వెళ్లాల్సింది సచివాలయానికి కాదు జైలుకన్నారు. అవినీతి మంత్రులను వెనకేసుకొస్తున్న కిరణ్.. ము ఠానాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాం గ్రెస్ ఓ ప్రమాదకర పార్టీ అని, ఎవరు ముట్టుకుంటే వారిని మసిచేస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతిని ప్రక్షాళన చేయాలంటే యువత వల్లనే సాధ్యమని నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు. అధికారంలోకి వస్తే బాగా చదువుకునే పిల్లలకు లాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తానని హామీ ఇ చ్చారు. వ్యవసాయ రుణాలు రద్దు చేసి బ్యాంకుల్లో వున్న బం గారు ఆభరణాలను తనఖా నుంచి విడిపించి ఆడపడుచులకు అందజేస్తానని ప్రకటించారు.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఫొటోను దొంగల ఫొటోల పక్కన పెట్టడంపై నిరసన తెలపాలని ప్రజలను కోరగా, వారి నుంచి అనూహ్య స్పందన లభించింది. అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలను పార్లమెంట్‌లో పెట్టే వరకూ పోరాడతామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఆటో, లారీ ్రడైవర్లకు రూ.5 లక్షల మేర ఉచిత ప్రమాద బీమా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే.. వడ్డీలేని రుణాలూ మంజూరు చేస్తామని తెలిపారు.
నర్సీపట్నం: వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలదే హవా అని, అనేక ర్రాష్టాల్లో అవే పాలనా పగ్గాలు చేపట్టనున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ పార్టీల ఊపు తగ్గిందని జాతీయ సర్వేలే చెబుతున్నాయని పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు!జన్నత్ వాంగ్మూలంతో అవినీతి గుట్టురట్టు

రొద్దం : నిధులున్నా ఖర్చు పెట్టకుండా నిద్రపోతున్న పాలకులకు బుద్ధి చెప్పాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పార్థసారథి ప్రజలకు పిలుపు నిచ్చారు. మండల పర్యటనలో భాగం గా రెండో రోజు నల్లూరులో గ్రామాలయ కమిటీకి ప్రహారీగోడ ప్రారంభానికి వారు వచ్చారు. వీరితో పాటు ఎ మ్మెల్సీ శమంతకమణి భూమి పూజ లో పాల్గొన్నారు. కందుకూరిపల్లి రామాలయం, ఆంజనేయస్వామి ఆలయానికి,కమ్యూనిటిభవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రొద్దంలో ఎల్లమ్మ గుడికి అనుబంధంగా కమ్యూనిటి భవనం, బస్టాండు ఆవరణంలో ఎనిమిది లక్షలతో పంచాయతీ చావిడికి భూమిపూజ జరిపించారు.

పదిలక్షలతో రొద్దంలో షాదీమహల్, వాల్మీకి సంఘాల నిర్మాణాలకు భూమిపూజలు చేశారు.పెద్దపల్లిలో మారెమ్మ గుడికి భూమిపూజ చేశారు. పలు గ్రామాలలో జరిగిన సభలలో ఎంపీ మాట్లాడుతూ రైతులను అదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధిచెప్పే సమయం దగ్గర పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా రొద్దం మండలానికి ఏకంగా రూ.75లక్షలతో అభివృద్ధి పనులు చేప ట్టామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి టీడీపీకే బ్రహ్మరథం పట్టాలని అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు సబ్‌ప్లాన్ కమిటీ అమలు పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో పథకాల అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ,ఎమ్మెల్యేల తో పాటు మండల నాయకులు వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, అక్కులప్ప, చిన్నప్పయ్య, రామకిష్టప్ప, మాధవనాయుడుతో పాటు అంజినేయులు, మహ్మాద్, చెన్నకేశవులు, గోవిందురాజులు తదితరులు పాల్గొన్నారు.

నిద్రపోతున్న పాలకులకు బుద్ధి చెప్పండి

బైరెడ్డిపల్లె: తెలుగు దేశం ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య పేర్కొన్నారు. చిత్తూరు ఎంపిీ శివప్రసాద్ బైరెడ్డిపల్లె మండలానికి మంజూరు చేసిన 189వీధి దీపాలను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ వీధి దీపాలను ఆయా గ్రామ కార్యదర్శులు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చంద్రబాబు సిీఎం అయిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపిీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులురాజన్న, వెంకట్రమణగౌడు, అమరనాధరెడ్డి, షౌకత్, వెంకటప్పగౌడు, సుబ్బు, సుబ్రమణ్యంరెడ్డి, గౌరప్ప అబ్దుల్ రహీం, ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పలమనేరులో.. పలమనేరు మండలంలోని పదిపంచాయతీల్లో మెర్క్యురి వీధిదీపాలు వేసేందుకు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ నిధులు మంజూరు చేశారు. ఒక్కపంచాయతీలో తొమ్మిది వీధి దీపాల చొప్పున ఏర్పాటు చేసిన మె ర్క్యురీ దీపాలను మంగళవారం ఎ మ్పీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, పంచాయతీ సెక్రటరీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్వీ బాలాజీ, ఆర్బీసి కుట్టి, అములు, మల్లీశ్వర రెడ్డి, బాలాజీ నాయుడు, జగదీష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గంగవరంలో...గంగవరం మండలంలోని పంచాయతీలకు చిత్తూరు ఎం పీ ప్రభుత్వ నిధుల నుంచి వీధి దీపాలను మంగళవారం పంపిణీ చేశారు. మండలంలోని ఒక్కొక్క పంచాయతీకి రూ 20వేలతో 9దీపాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ భాస్కర్, కార్యదర్శులు తెలుగు దేశం మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య సుభాష్ చంద్రబోస్, శ్రీనివాసులు నాయుడు, మురళీ, హరి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

సత్తుపల్లి టౌన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని దామాషా ప్రకారం నిధులను ఖర్చుచేయాలనే టీడీపీ పట్టుపట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి టీడీపీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు వ్యతిరేకమని చేస్తున్న ప్రచారం అసత్యమన్నారు. సబ్‌ప్లాన్ నిధులు రూ.21 కోట్లు ప్రక్కదారి పట్టిన విషయాన్ని ఆ« దారాతో సహా అసెంబ్లీలో నిరూపించా మని, కానీ ముఖ్యమంత్రి పదేపదే ప్రతిపక్షాలు సబ్‌ప్లాన్‌ను వ ్యతిరేకమని ఊదరగొట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి రాజకీయ పార్టీలే చైతన్యం తెచ్చాని అటువంటిది వ్యతిరేకించడం ఎలా సా« ద్యమన్నారు. విద్యుత్ కోతలను నిరసి స్తూ టీడీపీ ఆధ్వర్యంలో కోటికిపైగా సం తకాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుని సంతకాల సేకరణ జరుగుతోందని ఏప్రిల్ 25న రాష్ట్ర గవర్నర్‌కు సంతకాల సేకరణ ప్రతులను అంది స్తామన్నారు. సత్తుపల్లి నియోజర్గంలో 80వేలకు పైగా సంతకాలను సేకరిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు, ప్రజల డిమాండ్‌ను దృ ష్టిలో ఉంచుకుని విద్యుత్ చార్జీలపై ప్ర భుత్వంత సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ ్యక్తం చేశారు.

జిల్లాలో ఐదు లక్షల సంతకాలను సేకరించడం జరుగుతోందని దీనిని బట్టి చూస్తే ప్రజల్లో విద్యుత్ చార్జీలపట్ల నిరసను అర్థంచేసుకోవాలన్నారు. టీడీపీ పేదలు, రైతాంగం కోసమే శ్రమిస్తోందని పెట్టుబడిదారుల కోసం కాదన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇందుకు సంబంధించి అధికారులతో సమావేశాలు నిర్వహించడం మినహా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో ఇంత వరకు సమావేశం నిర్వహించింది లేదన్నారు. ఈసమావేశంలో టీడీపీ నాయకులు హరికృష్ణారెడ్డి, వడ్లపూడి వెంకటేశ్వరరావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, కంభంపాటి మల్లిఖార్జున్, మోరంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.

సబ్‌ప్లాన్‌కు టీడీపీ వ్యతిరేకం కాదు

నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్యులపై భారం మోపిందని దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణను ఈనెల 18వరకు ఉధృతం చే యాలని టీడీపీ జిల్లాధ్యక్షుడు బక్కని నర్సిములు కార్యకర్తలకు పిలుపునిచ్చా రు.  టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమీక్ష స మావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొ న్న ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి విద్యుత్ ఉత్పాదనను పెంచి నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచి కోతలతో సంక్షోభాన్ని సృష్టిస్తుందని విమర్శించారు.

టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజా స్పందన అపూర్వంగా లభిస్తుందన్నారు. దేవరకద్రలో సీతమ్మ అధ్యక్షతన ఆ పార్టీ మండల నాయకులతో సంతకాల సేకరణపై సమీక్షించడం జరిగిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రమే శ్ గౌడ్, మహేశ్ గౌడ్, నర్సింహరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఓం ప్రకాశ్, ఆలెనూర్ వినోద్ తదితరులు ఉన్నారు.

'సంతకాల సేకరణను ఉధృతం చేయండి'

గద్వాలఅర్బన్ : కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగానే పరిగణించిందే తప్పా వారి అభివృద్ధికి ఏ కోశా న పాటుపడలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని జిల్లా మంత్రి డీకే అరుణ బస్సు యాత్ర సందర్భంగా పేర్కొన డం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీ రా మారావు హయాంలోనే ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం జీవోను జారీ చేసిన వి షయాన్ని దాచి కాంగ్రెస్ తమ ఘనత గా చెప్పుకుంటుందన్నారు.  పీజేపీ అతిథి గృహం లో బక్కని నర్సింహులు స్థానిక నేతల తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అమలు కో సం అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో నే చట్టరూపం దాల్చిందని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సాధించిందన్న ఘనత కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని, మరి ఏబీసీడీ వర్గీకరణ ను సాధించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు.

రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది తెలుగుదేశం పా ర్టీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధ్దిని గురించి మం త్రి డీకే అరుణ ప్రజలకు వివరించడంలో తప్పులేదు కాని ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధిని కూడా తమదే అని చెబుకోవడం విడ్డూరంగా ఉందన్నా రు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తు న్న పాదయాత్రను ప్రజలు నమ్మరని చెప్పడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు రా ములు, ఇస్మాయిల్, చిత్తారికిరణ్, ప్రభాకర్, రాం బాబు తదితరులు ఉన్నారు.

దళితుల అభివృద్ధికి..కాంగ్రెస్ చేసింది శూన్యం


అర్వపల్లి : పాలేరు, శ్రీరాం సాగర్ జలాలతో తుంగతుర్తి నియోజకవర్గా న్ని సశ్య శ్యామలం చేయడమే తన ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే
మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మంగళవారం ఢీ కొత్తపల్లి, పర్సాయిపల్లి గ్రా మాల్లో ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తి గత మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు కేటాయించాలన్నారు. శ్రీరాం సాగర్ 69,71 డీబీఎంలకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే చెరువులు, కుంటలు నిండుతాయన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గానికి 22 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరినట్లు మోత్కుపల్లి తెలిపారు.

నియోజకవర్గంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేవతమ్మ, తహసీల్దార్ రాజేశ్వరి, హౌసింగ్ డీఈ నందీష్ కుమార్, ఎంఈవో పాపయ్య, ఏఈలు కొండయ్య, నర్సింహ్మా, వీ ఆర్వో పొన్నం శ్రీనివాస్, సంపెట కృష్ణమూర్తి, ఎర్ర నర్సయ్య పాల్గొన్నారు.

తిమ్మాపురంలో..

కరెంటు కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం తిమ్మాపురం గ్రామంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఎమ్మెల్యే మోత్కుపల్లి మా ట్లాడారు. బడుగు, బలహీన వర్గా ల కోసం ప్రభుత్వ ఎలాంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయలేదన్నారు. కార్యక్రమంలోటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మీలా కృష్ణయ్య, పీఏపీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, తిరుమల్ రావు, తుక్కాని మన్మధరెడ్డి, వీరారెడ్డి, చిప్పలపల్లి యాదగిరి, సంపెట కాశ య్య, ఆశోక్, సైదులు, బూర్గుల వెంక న్న, భూమయ్య, రామలింగయ్య, షాబూద్దీన్, కర్ణాకర్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

తిరుమలగిరిలో..

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ దళితుల కోసం చట్టాలు చేశారన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు దళితులు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని, కిరణ్ ప్రభుత్వంలో అంతా అవినీతి మంత్రులే ఉన్నారని ఆయన విమర్శించారు. శ్రీరాంసాగర్ కాల్వకు నీటి విడుదలకు తాను ఎంతో కృషి చేశానన్నారు. గుండెపురి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి రూ.30 లక్షలు, భూక్యాతండాకు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, సబ్‌స్టేషన్, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు రూ.23లక్షలు మంజూరు చేరు ంచానన్నారు.

మంచినీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలపగా, వెంటనే బోరు, మోటార్ మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శోభారాణి, టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్ సురేందర్‌రావు, మన్మథరెడ్డి, కొ మ్ము భిక్షం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సోమయ్య, రమేష్, ఎల్లయ్య, సైదులు, యాకన్న, లక్ష్మీనారాయణ, సత్తయ్య, లాలయ్య, సోమ్లానాయక్, కే నాగార్జున, బత్తుల శ్రీనివా స్, వేముల రమేష్, విద్యాసాగర్, జయన్న, సైదు లు, సోమయ్య, బీ సోమయ్య,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాన్ని సస్యశామలం చేయడమే ధ్యేయం

విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర మూడో రోజు ఆహ్లాదకరం గా సాగింది. మంగళవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎ క్కువగా ఉన్నా పాదయాత్ర ప్రారంభించే సమయానికి చిరుజల్లులు కురవడంతో బాబు కాస్త హుషారుగానే యాత్రను కొనసాగించారు. సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించిన ఆయన నాతవరం మండలం ములగపూడి, ఎం.బెన్నవరంలలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి వైఖరితోపాటు స్థానిక సంస్థలపై కూడా చంద్రబాబు ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. మెట్టపాలెం, కృష్ణాపురం, బైయపురెడ్డిపాలెం జంక్షన్ మీదుగా బలిఘట్టం చేరుకుని రాత్రిబస చేశారు. దారిపొడవునా మహిళలు హారతులివ్వగా, పెద్దసంఖ్యలో ప్రజలు తమ సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లారు.

'నారా'జనం

(టెక్కలి/కోటబొమ్మాళి) పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసేందుకు ప్రయత్నించిన విపక్ష నా యకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీఎమ్మెల్యే, టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయు డు, బోయిన రమేష్, పినకాన అజయ్‌కుమార్ తదితరులను నిమ్మాడలో గృహ నిర్బంధం చేశారు. జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ నేతలు నిమ్మాడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఈలోగానే పోలీసులు అచ్చెన్నాయుడు ఇంటిని చుట్టుముట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వేణుగోపాలనాయుడు, ఎస్ఐ అవతా రం నేతృత్వంలో 25 మంది పోలీసులు నిమ్మాడలో పహారా కాశారు.

నిమ్మాడ జంక్షన్‌లో మరో 20 మంది కాపలాగా ఉన్నారు. వినతిపత్రం అందజేసి వస్తామని, తమ వలన ఇబ్బందులేమీ ఉండవని చెప్పి బయలుదేరిన అచ్చెన్నాయు డు, బాబ్జి, అప్పలనాయుడులను పోలీసులు ఇంటిగేటు వద్దనే అడ్డగించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. టెక్కలిలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విపక్షాల నాయకులకు వాగ్వివాదం జరిగింది.

ఈ దశలో పోలీసులు సీపీఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, పినకాన కృష్ణమూర్తి, పోలాకి ప్రసాద్, కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, సీపీఐ నాయకులు శెటికం వెంకట్రావు, టీడీపీ నాయకులు మామిడి రాము, పోలాకి షణ్ముఖరావుతో కలిపి 15 మందిని అరెస్టు చేశారు. సీఎం పర్యటన తర్వాత వీరిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా విపక్షాల నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరితే అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.

అరెస్టులు..అడ్డంకులు

నర్సీపట్నం: చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్‌లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. కాళ్లనొప్పి కారణంగా నడవడానికి ఆయన తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో నడిచే దూరాన్ని తగ్గించారు. మంగళవారం నాతవరం మండలం డి.ఎర్రవరం నుంచి సుమారు ఆరున్నర కిలోమీటర్లు దూరంలో వున్న నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం వరకు నడవడానికి దాదాపు ఏడు గంటలు పట్టింది. పలుమార్లు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. వ్యాన్‌పై నిలబడలేక కుర్చీలో కూర్చుని ప్రసంగించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం బలిఘట్టం నుంచి మాకవరపాలెం మండలం గంగవరం వరకే పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బలిఘట్టం నుంచి మాకవరపాలెం మండలంలో కొండలఅగ్రహారం వరకు 14.5 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి. కానీ దీనిని ఎనిమిది కిలోమీటర్లకు తగ్గించి గంగవరంలో రాత్రిబసకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం గంగవరం నుంచి తామ
రం వరకు పాదయాత్ర జరుగుతుందని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. కాగా బుధవారం బలిఘట్టంలో చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు వుంటాయని ఆయన తెలిపారు.

బాబువెంట నడిచిన నేతలు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో చంద్రబాబు వెంట మంగళవారం జిల్లాకు చెందిన పలువురు నాయకులు నడిచారు. పొలిట్‌బ్యూరోసభ్యుడు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్, ఎమ్మెల్యేలు రామానాయుడు, కేఎస్ఎన్ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యేలు కాకర నూకరాజు, మణికుమారి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

బాబు పాదయాత్రల్లో మళ్లీ మార్పులు

కొయ్యూరు: పాడేరు నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నాతవరం మండలం డి.ఎర్రవరం శిబిరం వద్ద జరిగిన పాడేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందన్నారు.

తన తొమ్మిదేళ్ల పాలనలో తప్పుచేయలేదని, ఎవ్వరి చేత వేలెత్తి చూపించుకోలేదని చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. గతంలో కొన్ని పార్టీలతో జరిగిన ఒప్పందాల కారణాలగా ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్‌లు పార్టీ నేతలకు కేటాయించలేకపోయామని, అందువల్ల కార్యకర్తల్లో నిరాశ చోటుచేసుకున్న మాట వాస్తవమేనన్నారు. రానున్న రోజుల్లో పొత్తులున్న చోట ఎమ్మెల్సీ పదవులను పార్టీ నేతలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పార్టీ పూర్వ వైభవానికి మండల అధ్యక్షులతో కోర్‌కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

కార్యకర్తలకు అండగా ఉండకుంటే ఎలా... కార్యకర్తల కష్టనష్టాల్లో నేతలు పాలుపంచుకోకుండా గ్రూపులు కడితే పార్టీకి నష్టమే అని చంద్రబాబు మాజీ మంత్రి మణికుమారిపై మండిపడ్డారు. కార్యకర్తల కష్టాలను తెలుసుకుంటూ వారితో మెలగాలని సూచించారు.

గిరిజనులకు కాంగ్రెస్ మొండి చేయి గిరిజనులకు న్యాయం జరగాలని కేంద్ర పాలకవర్గం అనుమతి లేకుండానే కాఫీ ప్లాంటేషన్ చేయించానని చంద్రబాబు అన్నారు. ఏజెన్సీలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు కేటాయించానని, అరకును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దానన్నారు. కాంగ్రెస్ పాలనలో వీటిని నిర్వీర్యం చేయడమే కాకుండా గిరిజనులకు పౌష్టికాహారాన్ని కూడా అందించలేని
దుస్థితిలో పాలన సాగిస్తున్నారన్నారు. నేటికీ మన్యంలో 80గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని, 240 గ్రామాలకు రహదారులు లేవని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

వారం రోజుల్లో ఇన్‌చార్జి నియమిస్తా..


ఈప్రాంతంలో ఇంకా వారం రోజులు ఉంటానని, ముఖ్యనేతలతో చర్చించి పాడేరుకు ఇన్‌చార్జిని నియమిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తల కోసం పనిచేసే నేతను నియమిస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. కార్యకర్తల అభివృద్ధికి తాను హామీ ఇస్తానని చంద్రబాబు తెలిపారు.

కార్యకర్తలకు కోర్టు ఖర్చుల కింద ఆర్థిక సహాయం అక్రమ కేసుల బనాయింపుతో అరెస్టు అయి బెయిల్ కోసం ఆస్తులు పోగొట్టుకున్న జెర్రెల గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ అనే గిరిజనుడికి పార్టీఫండ్ నుంచి రూ.60వేలు అందిస్తున్నట్టు చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించారు. అలాగే జీకేవీధి మండల పార్టీ అధ్యక్షుడు కొక్కుల పూర్ణనారాయణ పక్షవాతంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నట్టు ఆయన దృష్టికి కార్యకర్తలు తీసుకురావడంతో ఆయన వైద్యసేవలకు రూ.25వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పాడేరులో టీడీపీకి పూర్వవైభవం

నాతవరం: సమాజసేవలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం డి.ఎర్రవరంలో ఆయన ఎన్టీఆర్ ట్రస్టు, విశాఖ డెయిరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదవారికి అందుబాటులో ఉండేవిధంగా ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబునాయుడు రోగులకు మందు లు అందజేశారు. అనంతరం చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో చంద్రబా బు బస్సులో సమీక్ష నిర్వహించారు.

తాండవ నీరు మర్రిపాలెంకు ఇవ్వాలని వినతి తాండవ రిజర్వాయర్ నీరు మర్రిపాలెం ఆయకట్టు రైతులకు ఇవ్వాలంటూ తెలుగు యువత కార్యదర్శి గవిరెడ్డి శివ ఆధ్వర్యంలో గ్రామస్థులు మంగళవారం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న వల్సంపేట గ్రామం నుంచి పైపులు ద్వారా తమ పొలాలకు సాగునీరు అందించాలని వీరు కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈసమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబునాయుడు మర్రిపాలెం గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ఈసందర్భంగా గుమ్మిడిగొండ గ్రామానికి చెందిన బయలపూడి చంటిబాబు మాటాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. గుమ్మిడిగొండకు చెందిన వర్రే అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ, నేడు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సమాజ సేవలో టీడీపీ ముందంజ