April 17, 2013

ఎవరి ఉపాధికి హామీ?

ఎవరి ఉపాధికి హామీ ఈ పథకం? చేతులకు పని ఇచ్చి పట్టెడన్నం పెడతామని పథకం ప్రారంభం నాడు గొప్పగా ప్రకటించారు. కూలీలకు అన్నం పెడుతుందో లేదోగానీ, మన పెద్దలకు మాత్రం రోజూ పరమాన్నాన్నే వడ్డిస్తోంది ఈ పథకం. ఒకరకంగా పెరటిదొడ్డి పథకంగా మారిపోయింది. పొలాల దగ్గర నుంచి ఇంటి లోగిళ్ల వరకూ పక్కా రోడ్లు వేసుకోవడానికి మన నేతలకు ఉపాధి పథకం.. మంచి ఉపాయమే. ఓ పెద్దమనిషి అయితే తన ఎస్టేట్‌దాకా తారురోడ్డు వేయించుకున్నాడు.

ఒకవైపు మనం పన్నుల రూపంలో అందించిన డబ్బులనూ, మరోవైపు ప్రజల శ్రమనూ ఇలాంటి పెద్దలు గద్దలై కొల్లగొట్టేందుకు తప్ప మరెందుకీ పథకం? బలిఘట్టంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పడిపోయిన ఆ రోడ్డు గురించి విన్నప్పుడు మెదిలిన భావమిది. నిజానికి.. నేతల లీలలు విననివి కావు. తనకు, ప్రజలకు మ«ధ్య బంధం ఓటుకు..నోటుకు ఉన్న బంధం లాంటిదని చెప్పుకొనే 'రూ.500 ఎమ్మెల్యే' నుంచి 'నాకేంటి' అంటూ వాటాలను వాటంగా పట్టే 'పర్సంటేజీల' ప్రజాప్రతినిధి వరకు ఎందరిని చూడలేదు? కానీ, బలిఘట్టం-ధర్మసాగరం రోడ్డు వ్యవహారం మరో వింత పోకడ. తిప్పితిప్పి కొడితే నాలుగు కిలోమీటర్లు కూడా లేదు ఆ రోడ్డు. కానీ, ఆ ఊరివాళ్లకు అదే పెద్ద సమస్యగా మారిపోయింది. దారి పడితే ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని స్థాని

ఆ గ్రామం నుంచి ఈ పట్టణం దాకా తీరు ఒక్కటే..పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలూ ఒక్కటే. నీటి ఎద్దడి ముట్టడిలో చిక్కిన నర్సీపట్నానికి..ఈ సమయంలో చెరువులు, గుంటలు అందుబాటులోకి వస్తే ఎంత బాగుండు! కానీ, ఈ ప్రజా నిర్మాణాలను భూకబ్జా నుంచి విడిపించేది ఎవరు? పిల్లికి గంట కట్టడమే సమస్య! ఆ తరువాత అన్నీ చక్కబడతాయి!
కులు ఆశపడటమే గానీ, ఆలకించేది ఎవరు?