April 17, 2013

'సంతకాల సేకరణను ఉధృతం చేయండి'

నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్యులపై భారం మోపిందని దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణను ఈనెల 18వరకు ఉధృతం చే యాలని టీడీపీ జిల్లాధ్యక్షుడు బక్కని నర్సిములు కార్యకర్తలకు పిలుపునిచ్చా రు.  టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమీక్ష స మావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొ న్న ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి విద్యుత్ ఉత్పాదనను పెంచి నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచి కోతలతో సంక్షోభాన్ని సృష్టిస్తుందని విమర్శించారు.

టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజా స్పందన అపూర్వంగా లభిస్తుందన్నారు. దేవరకద్రలో సీతమ్మ అధ్యక్షతన ఆ పార్టీ మండల నాయకులతో సంతకాల సేకరణపై సమీక్షించడం జరిగిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రమే శ్ గౌడ్, మహేశ్ గౌడ్, నర్సింహరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఓం ప్రకాశ్, ఆలెనూర్ వినోద్ తదితరులు ఉన్నారు.