April 17, 2013

సబ్‌ప్లాన్‌కు టీడీపీ వ్యతిరేకం కాదు

సత్తుపల్లి టౌన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని దామాషా ప్రకారం నిధులను ఖర్చుచేయాలనే టీడీపీ పట్టుపట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి టీడీపీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు వ్యతిరేకమని చేస్తున్న ప్రచారం అసత్యమన్నారు. సబ్‌ప్లాన్ నిధులు రూ.21 కోట్లు ప్రక్కదారి పట్టిన విషయాన్ని ఆ« దారాతో సహా అసెంబ్లీలో నిరూపించా మని, కానీ ముఖ్యమంత్రి పదేపదే ప్రతిపక్షాలు సబ్‌ప్లాన్‌ను వ ్యతిరేకమని ఊదరగొట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి రాజకీయ పార్టీలే చైతన్యం తెచ్చాని అటువంటిది వ్యతిరేకించడం ఎలా సా« ద్యమన్నారు. విద్యుత్ కోతలను నిరసి స్తూ టీడీపీ ఆధ్వర్యంలో కోటికిపైగా సం తకాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుని సంతకాల సేకరణ జరుగుతోందని ఏప్రిల్ 25న రాష్ట్ర గవర్నర్‌కు సంతకాల సేకరణ ప్రతులను అంది స్తామన్నారు. సత్తుపల్లి నియోజర్గంలో 80వేలకు పైగా సంతకాలను సేకరిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు, ప్రజల డిమాండ్‌ను దృ ష్టిలో ఉంచుకుని విద్యుత్ చార్జీలపై ప్ర భుత్వంత సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ ్యక్తం చేశారు.

జిల్లాలో ఐదు లక్షల సంతకాలను సేకరించడం జరుగుతోందని దీనిని బట్టి చూస్తే ప్రజల్లో విద్యుత్ చార్జీలపట్ల నిరసను అర్థంచేసుకోవాలన్నారు. టీడీపీ పేదలు, రైతాంగం కోసమే శ్రమిస్తోందని పెట్టుబడిదారుల కోసం కాదన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇందుకు సంబంధించి అధికారులతో సమావేశాలు నిర్వహించడం మినహా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో ఇంత వరకు సమావేశం నిర్వహించింది లేదన్నారు. ఈసమావేశంలో టీడీపీ నాయకులు హరికృష్ణారెడ్డి, వడ్లపూడి వెంకటేశ్వరరావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, కంభంపాటి మల్లిఖార్జున్, మోరంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.