April 17, 2013

దళితుల అభివృద్ధికి..కాంగ్రెస్ చేసింది శూన్యం

గద్వాలఅర్బన్ : కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగానే పరిగణించిందే తప్పా వారి అభివృద్ధికి ఏ కోశా న పాటుపడలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని జిల్లా మంత్రి డీకే అరుణ బస్సు యాత్ర సందర్భంగా పేర్కొన డం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీ రా మారావు హయాంలోనే ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం జీవోను జారీ చేసిన వి షయాన్ని దాచి కాంగ్రెస్ తమ ఘనత గా చెప్పుకుంటుందన్నారు.  పీజేపీ అతిథి గృహం లో బక్కని నర్సింహులు స్థానిక నేతల తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అమలు కో సం అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో నే చట్టరూపం దాల్చిందని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సాధించిందన్న ఘనత కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని, మరి ఏబీసీడీ వర్గీకరణ ను సాధించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు.

రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది తెలుగుదేశం పా ర్టీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధ్దిని గురించి మం త్రి డీకే అరుణ ప్రజలకు వివరించడంలో తప్పులేదు కాని ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధిని కూడా తమదే అని చెబుకోవడం విడ్డూరంగా ఉందన్నా రు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తు న్న పాదయాత్రను ప్రజలు నమ్మరని చెప్పడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు రా ములు, ఇస్మాయిల్, చిత్తారికిరణ్, ప్రభాకర్, రాం బాబు తదితరులు ఉన్నారు.