April 17, 2013

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు!జన్నత్ వాంగ్మూలంతో అవినీతి గుట్టురట్టు

వైసీపీ ఇక కనుమరుగే
కేవీపీ రూపంలో వైఎస్ ఆత్మ
వైఎస్ ధృతరాష్ట్రుడు.. జగన్ దుర్యోధనుడు
కేసీఆర్‌ది ఫామ్‌హౌస్ పార్టీ
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం గ్రామంలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో ఆయన 'సీ ఓటర్' సంస్థ సర్వేపై స్పందించారు. "కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి కీలకపాత్ర పోషించనుంది. మమతాబెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, నవీన్‌పట్నాయక్, జయలలిత వంటి ప్రాంతీయ పార్టీల నేతల ప్రభావం అధికంగా ఉంది'' అని వివరించారు.

30 ఎంపీ సీట్లు గ్యారంటీగా గెలుస్తామని చెప్పిన వైసీపీ సీట్ల బలం పది లేక 12 సీట్లకు దిగజారిందని చెప్పారు. మరికొన్ని రోజులు ఆగితే నాలుగైదు సీట్లు కూడా కష్టమేనని, పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం పలికారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్‌పై గతంలో తాము విమర్శలు చేస్తే తిప్పికొట్టేందుకు ప్రయత్నించిన వారే ఇప్పుడు ఆయన అవినీతిపై పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారని గుర్తుచేశారు.

సీబీఐ విచారణ సందర్భంగా వైఎస్, కేవీపీ సన్నిహితులు వెల్లడిస్తున్న అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. "వైఎస్ ధృతర్రాష్టుడు. ఆయన పుత్రవాత్సల్యంతో జగన్ దుర్యోధనుడుగా మారారు. లక్ష కోట్లు సంపాదించి జైలుపాలయ్యారు. వైఎస్ అవినీతి గురించి అతని ముఖ్య కార్యదర్శి జన్నత్‌హస్సేన్, వ్యక్తిగత సహాయకుడు సూరీడు, ముఖ్య భద్రతా అధికారి రమేశ్ తదితరులు సీబీఐ ఎదుట వాంగ్మూలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

"కేవీపీ, జగన్ కలిసి రేటు నిర్ణయించిన తరువాతే పనులకు సంబంధించిన ఫైళ్లు కదిలేవని ఆ ముగ్గురి వాంగ్మూలం తేటతెల్లం చేసింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రెండు ఇళ్లు నిర్మించారని, జగన్ నివాసంలో అక్రమ లావాదేవీలు జరిగేవని రుజువైంది. వైఎస్ చనిపోయినా ఆయన ఆత్మ కేవీపీ రూపంలో మన చుట్టూ తిరుగుతోంద''ని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పక్కా బ్లాక్‌మెయిలర్ అని, ఆయనది ఫామ్‌హౌస్ పార్టీ అని ధ్వజమెత్తారు. వైఎస్ అవినీతికి సహకరించిన మంత్రులు వెళ్లాల్సింది సచివాలయానికి కాదు జైలుకన్నారు. అవినీతి మంత్రులను వెనకేసుకొస్తున్న కిరణ్.. ము ఠానాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాం గ్రెస్ ఓ ప్రమాదకర పార్టీ అని, ఎవరు ముట్టుకుంటే వారిని మసిచేస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతిని ప్రక్షాళన చేయాలంటే యువత వల్లనే సాధ్యమని నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు. అధికారంలోకి వస్తే బాగా చదువుకునే పిల్లలకు లాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తానని హామీ ఇ చ్చారు. వ్యవసాయ రుణాలు రద్దు చేసి బ్యాంకుల్లో వున్న బం గారు ఆభరణాలను తనఖా నుంచి విడిపించి ఆడపడుచులకు అందజేస్తానని ప్రకటించారు.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఫొటోను దొంగల ఫొటోల పక్కన పెట్టడంపై నిరసన తెలపాలని ప్రజలను కోరగా, వారి నుంచి అనూహ్య స్పందన లభించింది. అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలను పార్లమెంట్‌లో పెట్టే వరకూ పోరాడతామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఆటో, లారీ ్రడైవర్లకు రూ.5 లక్షల మేర ఉచిత ప్రమాద బీమా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే.. వడ్డీలేని రుణాలూ మంజూరు చేస్తామని తెలిపారు.
నర్సీపట్నం: వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలదే హవా అని, అనేక ర్రాష్టాల్లో అవే పాలనా పగ్గాలు చేపట్టనున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ పార్టీల ఊపు తగ్గిందని జాతీయ సర్వేలే చెబుతున్నాయని పేర్కొన్నారు.