April 17, 2013

నియోజకవర్గాన్ని సస్యశామలం చేయడమే ధ్యేయం


అర్వపల్లి : పాలేరు, శ్రీరాం సాగర్ జలాలతో తుంగతుర్తి నియోజకవర్గా న్ని సశ్య శ్యామలం చేయడమే తన ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే
మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మంగళవారం ఢీ కొత్తపల్లి, పర్సాయిపల్లి గ్రా మాల్లో ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తి గత మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు కేటాయించాలన్నారు. శ్రీరాం సాగర్ 69,71 డీబీఎంలకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే చెరువులు, కుంటలు నిండుతాయన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గానికి 22 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరినట్లు మోత్కుపల్లి తెలిపారు.

నియోజకవర్గంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేవతమ్మ, తహసీల్దార్ రాజేశ్వరి, హౌసింగ్ డీఈ నందీష్ కుమార్, ఎంఈవో పాపయ్య, ఏఈలు కొండయ్య, నర్సింహ్మా, వీ ఆర్వో పొన్నం శ్రీనివాస్, సంపెట కృష్ణమూర్తి, ఎర్ర నర్సయ్య పాల్గొన్నారు.

తిమ్మాపురంలో..

కరెంటు కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం తిమ్మాపురం గ్రామంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఎమ్మెల్యే మోత్కుపల్లి మా ట్లాడారు. బడుగు, బలహీన వర్గా ల కోసం ప్రభుత్వ ఎలాంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయలేదన్నారు. కార్యక్రమంలోటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మీలా కృష్ణయ్య, పీఏపీఎస్ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, తిరుమల్ రావు, తుక్కాని మన్మధరెడ్డి, వీరారెడ్డి, చిప్పలపల్లి యాదగిరి, సంపెట కాశ య్య, ఆశోక్, సైదులు, బూర్గుల వెంక న్న, భూమయ్య, రామలింగయ్య, షాబూద్దీన్, కర్ణాకర్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

తిరుమలగిరిలో..

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ దళితుల కోసం చట్టాలు చేశారన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు దళితులు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని, కిరణ్ ప్రభుత్వంలో అంతా అవినీతి మంత్రులే ఉన్నారని ఆయన విమర్శించారు. శ్రీరాంసాగర్ కాల్వకు నీటి విడుదలకు తాను ఎంతో కృషి చేశానన్నారు. గుండెపురి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి రూ.30 లక్షలు, భూక్యాతండాకు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, సబ్‌స్టేషన్, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు రూ.23లక్షలు మంజూరు చేరు ంచానన్నారు.

మంచినీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలపగా, వెంటనే బోరు, మోటార్ మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శోభారాణి, టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్ సురేందర్‌రావు, మన్మథరెడ్డి, కొ మ్ము భిక్షం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సోమయ్య, రమేష్, ఎల్లయ్య, సైదులు, యాకన్న, లక్ష్మీనారాయణ, సత్తయ్య, లాలయ్య, సోమ్లానాయక్, కే నాగార్జున, బత్తుల శ్రీనివా స్, వేముల రమేష్, విద్యాసాగర్, జయన్న, సైదు లు, సోమయ్య, బీ సోమయ్య,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.