March 17, 2013

హైదరాబాద్: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై పీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. అవిశ్వాసం సందర్భంగా విప్‌ను ధిక్కరించి అనుకూలంగా ఓటువేసిన ఎమ్మెల్యేల ప్రాం తాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించాలని భావిస్తోంది. టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, కొడాలి నాని, అమర్‌నాథ్‌రెడ్డి, వనిత, సాయిరాజ్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడ్డారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన వీరిపై స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేస్తే.. ఈ ఆరుగురిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆ స్థానాలు ఖాళీ అయ్యే చాన్స్ ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టి పెట్టింది.

టీడీపీ రెబల్స్ స్థానాలపై పీసీసీ నజర్!

* రైతులకు రుణవిముక్తి

* కౌలు రైతులకు భరోసా

* డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

* యువతకు ఉద్యోగాలు, ఉపాధి

* లాభసాటి వ్యవసాయం

* 24 గంటలు కరెంటు సరఫరా

* అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు

* బీసీలకు సామాజిక న్యాయం

* రజకులకు ప్రోత్సాహం

* మాల వర్గీయులకు కూడా అండగా ఉంటాం

* ఎస్సీ వర్గీకరణకు మద్దతు

*విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు

*ఉన్నత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

* మహిళలకు పూర్తి రక్షణ

* ఎరువుల ధరలు నియంత్రణ

* వ్రస్తాలపై విధించిన వ్యాట్‌కు ఆందోళనకు రెడీ

* బ్రాహ్మణులు, వైశ్యులకు ప్రోత్సాహకం

నూరు కిలోమీటర్ల యాత్రలో పాల్గొంటున్న నాయకులు:

జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, టి.వి.రామారావు, చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ అంగరరామ్మోహన్, కన్వీనర్లు వై.టి.రాజా, అంబికా కృష్ణ, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు, ముడియం శ్రీనివాస్, గాదిరాజు బాబు, డాక్టర్ బాబ్జి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, పీతల సుజాత, కొక్కిరగడ్డ జయరాజు, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, రాంకుమార్, బడేటి బుజ్జి, శశి విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ, మేఘలాదేవి.

చంద్రబాబు ఇచ్చిన హామీలివి...

  ఏలూరు :'వస్తున్నా మీకోసం' యాత్రలో ఆదివారం రాత్రి చంద్రబాబు జిల్లాలో వంద కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బహుదూరపు బాటసారి కానూరు దగ్గర సెంచరీని పూర్తి చేశారు. తొమ్మిది రోజులు 65 గ్రామాలు, 13 మండలాల మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయనకు వేలాది మంది జతకలిశారు. వందలాది మంది మహిళలు హారతులుపట్టారు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ తమ ఆకాంక్షను ఆయన ముందు వుంచారు.

అలుపెరుగని సైనికుడిగా చంద్రబాబు శారీరక ఇబ్బందులను తట్టుకుంటూనే మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు గడిచిన తొమ్మిది రోజులుగా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయన పాదయాత్ర పూర్తి చేసుకుని నిడదవోలు నియోజకవర్గంలో ఆదివారం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పెరవలి మండలం కానూరులో ఆయన వందో కిలోమీటరును జిల్లాలో అధిగమించారు.

దీనిపై కార్యకర్తలకు ఆయనకు సంఘీభావం వ్యక్తం చేస్తూ పెద్దసంఖ్యలో ఆయనతో జత కలిశారు. కాకరపర్రు దగ్గర నుంచి కానూరు వరకు మార్గం మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిపోయింది. వందవ కిలోమీటరుకు చేరువవుతున్న బాబు పాదయాత్రకు మద్దతు పలుకుతూ ఆయన నడిచే బాటలో కార్యకర్తలు పూలుపరిచారు. మహిళలు మంగళహారతులుపట్టారు. ఆంజనేయస్వామి, సిద్ధి వినాయకస్వామి దేవాలయాల్లోకి తీసుకువెళ్లి ఆశీర్వచనాలు అందించారు.

వస్తున్నా మీకోసం పేరిట ఆయన హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఈ నెల 9వ తేదీన ఉప్పుటేరు వంతెన మీదుగా కృష్ణా జిల్లాను దాటి పశ్చిమలో కాలిడారు. ఇక అక్కడి నుంచి మొదలుకుని వందో కిలోమీటరు కానూరు వరకు దారిపొడవునా జనమే. తమ అభిమాన నాయకుడిని కలుసుకునేందుకు కార్యకర్తలు, తమ కష్టాలను వెళ్లబోసుకోవడానికి స్థానికులు ఎక్కడలేని తాపత్రయం ప్రదర్శించారు.

చంద్రబాబు సైతం పశ్చిమయాత్రలో ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీనికి ఆయనకు అడుగడుగునా లభిస్తున్న జనాదరణ ఒక ఎత్తయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి మరీ శ్రేణులను సమన్వయపరిచి ఈ యాత్రలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునర్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలో తెలుగుదేశం యంత్రాంగం యావత్తు గడిచిన తొమ్మిదిరోజులు ఆయన వెంటే ఉన్నారు. కన్వీనర్లు, పార్టీ ముఖ్యుల్లో అత్యధికులు ఆయన పాదయాత్రలో నిర్విరామంగా కొనసాగుతున్నారు. 'నేనేదో పదవి కోసం ఈ పాదయాత్ర చేయడం లేదు.

మీ కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు, వాటిని పారద్రోలేందుకే శరీరక కష్టాన్ని కూడా లెక్కచేయకుండా వస్తున్నాను' అంటూ ప్రజల ఆదరాభిమానాలను చంద్రబాబు కూడగట్టుకుంటూ వచ్చారు. దీనికి అనుగుణంగానే పశ్చిమవాసులు కూడా స్పందించారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లో ఆయన యాత్రకు అపూర్వమైన ఆదరాభిమానాలు లభించాయి. దీంతో ఆయన యాత్ర ప్రతీరోజు ఆయన పాదయాత్ర చేసుకుంటూ తెల్లవారుజాము నాటికి ప్రతిరోజు రాత్రి బసకు చేరుకుంటున్నారు. ఉదయం పార్టీ సమీక్షలు, మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు దిగుతున్న ఆయన ముందుకు సాగుతూనే వచ్చారు.

మార్గమధ్యలో ఆయనను వేలాది మంది కలుసుకున్నారు. తమ కష్టసుఖాలను ఆయన ఎదుట ఉంచారు. చంద్రబాబు అదే రీతిలో ప్రతిస్పందించారు. మన ప్రభుత్వం వస్తే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ భుజం తట్టి భరోసా ఇచ్చారు. ఇదే ఆయనపై ప్రజల్లో అభిమానం రెట్టింపు అయ్యేలా చేసింది. ఆయన పాదయాత్ర చేస్తున్న మార్గాల్లో వందలాది వినతులు చేతికి అందాయి. బహిరంగసభల్లో మాట్లాడుతున్నప్పుడు మైక్ అందుకున్నవారు తాము ఎలాంటి కష్టాలుపడుతున్నామో చంద్రబాబు ముందుంచుతున్నారు. రైతువారీ కుటుంబాలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మీ కష్టాలు తీర్చేలా రుణమాఫీ చేస్తానని, మిమ్మల్ని రుణవిముక్తులుగా చూడాలన్నదే నా లక్ష్యమని చెప్పినప్పుడు కూడా లభించిన స్పందన సహజంగానే చంద్రబాబుతో పాటు పార్టీలో కూడా ఉత్సాహాన్ని రగిలించింది.

గడిచిన తొమ్మిదిరోజుల్లో ఆయన కాళ్లు నొప్పులతో, శారీరక బాధలతో ఇబ్బందులకు గురవుతున్నా ఎక్కడా కూడా పాదయాత్రను ఆపలేదు. ప్రజలను కలుసుకోవడం మానలేదు. పంటి బిగువున బాధను భరిస్తూనే మీ కష్టాలు తీర్చేందుకు ఇక ముందు పెద్దన్నయ్య పాత్ర పోషిస్తానంటూ పశ్చిమవాసులకు ఊరటనిస్తున్నారు.

నూరు నిలోమీటర్లు వేల దీవెనలు

  ఏలూరు :వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా 168 రోజైన సోమవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సుమారు 15 కిలోమీటర్లకుపైగానే ప్రయాణించనున్నారు. ఆదివారం చేయాల్సిన పది కిలోమీటర్ల పాదయాత్రను ఎనిమిది కిలోమీటర్లకు కుదించుకున్నారు. సోమవారం ఆయన పాదయాత్ర ఇలా సాగబోతోంది. మునిపల్లి, పెండ్యాల సెంటర్, కలవచర్ల, డి.ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తమపల్లి, మద్దూరు బ్రిడ్జి, మద్దూరు వరకు ప్రయాణించి ఆ తర్వాత చంద్రవరం వద్ద రాత్రి బస చేస్తారు.

నేడు చంద్రబాబు పాదయాత్ర ఇలా..

తీపర్రులో చంద్రబాబు నిప్పులు

హైదరాబాద్ : "సార్! మీకు సింగపూర్‌లో హోటల్ ఉన్నదట కదా'' అంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త వేసిన ప్రశ్న చంద్రబాబును చండ్రబాబును చేసేసింది. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో బాబు ప్రసంగిస్తుండగా.. నల్ల విజయకుమార్ అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. అది గమనించిన చంద్రబాబు.. ఆయన చేతికి మైకు ఇచ్చారు. "ఏ పార్టీ.. ఏం పేరు'' అని అతడిని ప్రశ్నించారు. నీది కాంగ్రెస్ పార్టీయా అని అతనిని చంద్రబాబు నిలదీశాడు. అవునని చెప్పాడు.

'సరే.. ఏమి అడుగుతావో అడుగు' అని ప్రోత్సహించాడు. "టివిల్లో, పేపర్లో వచ్చాయి. నలుగురూ చెప్పుకుంటున్నారు, సింగపూర్‌లో మీకు హోటళ్లు ఉన్నాయంటున్నారు. నిజమేనా?'' అని అనడంతో బాబుకు ఆగ్రహం తన్నుకొచ్చింది. " కాంగ్రెస్ దొంగలు ప్రచారం చేస్తున్నారు. అడ్రస్ తీసుకురా.. రాసిస్తాను. సిగ్గులేదా? నీ కాంగ్రెస్ నాయకులు అవినీతి చేసి జైలుకు పోయారు. అలాంటి వాళ్లను వదిలేస్తావా?' అంటూ తీవ్రస్వరంతో మండిపడ్డారు.

ఆ సింగపూర్ అడ్రస్ తీసుకురా.. రాసిస్తా..

నగదు బదిలీని నగుబాటు చేయొద్దు
అవి మంచి పథకాలు
కానీ, పేదలకే చేరితేనే సార్థకత
పశ్చిమ యాత్రలో చంద్రబాబు వినతి

 ఏలూరు : "నగదు బదిలీని నకిలీ బదిలీ చేయొద్దు. రాష్ట్రంలో ఆధార్‌ను నగుబాటు చేయకండి'' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. రేషన్ కార్డుకు ఆధార్‌తో లింక్ పెట్టి.. కిలోకి 14-15 రూపాయలు లెక్కించి డబ్బులు పడేస్తే అవన్నీ మగవాళ్లు తాగడానికే సరిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నిడదవోలు నియోజకవర్గంలో ని తీపర్రు, ఉల్లంపర్రు, కానూరు మీదుగా 10.4 కిలోమీటర్లు నడిచారు. 'బెల్ట్‌షాపులు తీసేయండి. అంతా బాగుపడుతుంద'ని కాకరపర్రు గ్రామంలో ఓ మహిళ కోరగా, ఆమెను చంద్రబాబు అభినందించారు.

మార్గమధ్యలో పూలకొట్టు దగ్గరకు వెళ్లి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దారి మధ్యలో కలిసిన వికలాంగుడిని పలకరించి భుజం తట్టారు. 'మేము గౌడ్లం. మా బతుకులు ఎలా ఉన్నాయో చెప్పడం ఒక ముక్కలో అయ్యేది కాదు, చాలా దారుణంగా ఉందయ్యా పరిస్థితి' అంటూ ఓ గీత కార్మికుడు గోడును వెళ్లబోసుకోగా ధైర్యం చెప్పారు. డ్వాక్రా మహిళలను కలుసుకొని ఊరి పరిస్థితులను విచారించారు. ఈ సందర్భంగా తీపర్రు, కానూరుల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన నకిలీ బదిలీ, ఆధార్‌ల నమోదుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"ఆధార్‌లో తప్పులేదు.. తప్పుల తడకగా మాత్రం మారకూడదు. నగుబాటు అసలే కాకూడదు. పేదవాళ్లు ఎవరు, ఆస్తిపరులు ఎవరు, రైతులు ఎవరు, ఎవరు ప్రభుత్వ పథకాలకు లబ్ధిపొందాలి అని గణాంకాలు ఉండాలి. అవి లేకుండా అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తామంటే ఎలా?'' అని ప్రశ్నించారు. తన ఆలోచనలు దుర్వినియోగం చేసే విధంగా నగదు బదిలీ పథకం రూపొందించారని, దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడకపోగా వారి నడ్డి విరిచే అవకాశమున్నదని చెప్పుకొచ్చారు. " ఇప్పటికే ర్రాష్టాన్ని కరెంటు కోతలతో గాఢాంధకారం చేశారు. చార్జీలు పెంచి ఇబ్బందులపాల్జేస్తున్నారు. దీనికితోడు ప్రజలకు ఉపయోగపడేవాటిని కూడా దారి తప్పించినా.. నకిలీ పథకాలుగా మార్చినా సహించబోం'' అని హెచ్చరించారు.

ఆధార్ కార్డుకు బియ్యంతో ముడిపెడితే వీపులు మాడిపోతాయన్నారు. అదేజరిగితే 'ఖబడ్దార్' అంటూ సర్కారును హెచ్చరించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలోనే తెలుగుదేశం భయపడలేదని, సోనియాకు తానసలు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. గ్రామాల్లో మద్యం సమస్య పెరగడానికి నిరుద్యోగమూ ఒక కారణమేనని అభిప్రాయపడ్డారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ప్రకటించారు.

ఆధార్‌ని బియ్యానికి లింకుపెడితే ఖబడ్దార్

తవణంపల్లె : రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించి, అన్ని రంగాల్లో ముం దుకు వెళ్లాలంటే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు అన్నారు. గడప గడపకూ టీడీపీ కార్యక్రమంలో భాగంగా తవణంపల్లె మండలంలో గాజులపల్లె సర్కిల్ వద్ద శనివారం ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్, పెట్రోల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచి ప్రజల నెత్తిన భారం మోపుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.

గత 9 సంవత్సరాలుగా రాష్ట్రా న్ని తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు దోచుకు తిన్నాయన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి లలిత కుమారి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుతో కలిసి కట్టకిందపల్లె, యడమలవారిపల్లె, కృష్ణాపురం, మాధవరం తదితర గ్రామాల్లో తమ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అవినీతిని కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గాజులపల్లెలో పార్టీకి చెందిన రసూల్ బాషా అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వరదప్ప నాయుడు, పూల చందు, ఆనంద నాయుడు, మల్లంకుంట జగన్నాద రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం టీడీపీకే సాధ్యం

టీడీపీ అమ్ముల పొదిలో అవిశ్వాసాస్త్రం

హైదరాబాద్ : టీఆర్ఎస్, వైసీపీల అవిశ్వాసంపై తటస్థ వైఖరి అవలంబించిన టీడీపీ.. టైమ్ చూసుకుని సర్కారుపై తానే సొంతంగా పంచ్ విసరాలని భావిస్తోంది. రాజకీయం గా తమకు అనుకూల సమయం ఏర్పడిందనే అంచనాకు రాగానే... సొంతంగా అవిశ్వాస్త్రం సంధించాలని యోచిస్తోంది. "సీమాంధ్ర, తెలంగాణల్లో మా గ్రాఫ్ పెరగడం మొదలైంది. గత మూడు నెలల్లోనే ప్రజల్లో మాకు ఆదరణ 6 శాతం వరకు పెరిగినట్లు మా సర్వేల్లో వెల్లడైంది. వచ్చే ఆరేడు నెలల్లో మరింత పెరిగే అవకాశముంది. ఆరేడు నెలలు గడిస్తే మేం సొంతంగా గెలవగలిగిన వాతావరణం నెలకొంటుందని మేం ఆశిస్తున్నాం' అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఆ సమయం వచ్చిందనుకొన్నప్పుడు కిరణ్ సర్కారుపై సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి సర్కారును దించాలన్నది టీడీపీ అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. అదేసమయంలో.. గీత దాటిన వారిపై ఇప్పటికిప్పుడు వేటు వేసి, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా టీడీపీ భావించడంలేదు. 'ఉప ఎన్నికలపై మాకు ఆసక్తి లేదు. తెస్తే అసెంబ్లీ ఎన్నికలే తెస్తాం. విప్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేస్తాంగానీ, వాటిపై అంత గట్టిగా వెంటపడకపోవచ్చు'' అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు.

మోత్కుపల్లిపై అభినందనల వర్షం
అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చెలరేగిపోయిన పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులుపై శనివారం ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్సులో అభినందనల వర్షం కురిసింది. 'నర్సింహులూ శభాష్! అవినీతి పార్టీలపై మన పోరాటాన్ని అసెంబ్లీ వేదికగా ఒక మలుపు తిప్పావు. బెయిల్లు, బ్లాక్ మెయిల్ల కోసం మద్దతు ఇవ్వబోమని బలంగా చెప్పావు. నీకు నా అభినందనలు' అని చంద్రబాబు ఆయనతో అన్నారు. అసెంబ్లీలో ఇదే దూకుడు సాగించాలని పార్టీ సభ్యులకు సూచించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా నర్సింహులుకు అభినందనలు చెప్పారు.

అదను చూసి వదులుదాం!

హైదరాబాద్: "ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఆయుధంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం బేరసారాలకు ఉపయోగపడే సాధనంగా మాత్రం కాదు. కొనుగోళ్ళు, ఫిరాయింపులతో ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడం.. అవినీతి సొమ్మును విరజిమ్మి రాష్ట్రాన్ని కలుషితం చేయడం 'చంచల్‌గూడ జైలు పార్టీ' లక్ష్యం. దానితో కలవలేకే తటస్థంగా ఉన్నాం'' అని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

వైఎస్ అవినీతి కుంభకోణాలపై 2004 నుంచీ టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందని.. ఒకవైపు వాళ్ళతో పోరాటం చేస్తూ మరోవైపు వాళ్ళ అవిశ్వాసాన్ని బలపర్చలేమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పార్టీలన్నింటిని ఏకం చేసి కాంగ్రెస్‌ను కేంద్రంలో గద్దె దించిన ఘనత కూడా తమ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. "ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి అవిశ్వాసాన్ని వినియోగించుకోవాలని రాజ్యాంగ రచయితలు ఆశించారు. మేం దానికి కట్టుబడి ఉన్నాం'' అని తుమ్మల పేర్కొన్నారు.

జైలు' పార్టీతో కలవలేకే తటస్థం: తుమ్మల


ఏలూరు : 'ఎన్టీఆర్ కుటుంబం నిఖార్సయిన కుటుంబం. ఏనాడూ ఈ కుటుంబం బయటకు రాలేదు. మా ఇంట్లో వాళ్లు కూడా కష్టపడతారు. వైఎస్ కుటుంబానిది అరాచకం. పేదల కోసమే ఆనాడైనా, ఏనాడైనా పోరాడతాం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం, వైఎస్ కుటుంబ తీరును ఆయన బేరీజు వేసుకొచ్చారు. నాకు ఒకకొడుకు, కుటుంబ నియంత్రణ పాటించాను, బాగా చదివించాను. మా ఆవిడ కష్టపడుతోంది. కోడలు కష్టపడుతోంది. ఉన్నంతలోనే మేము బతుకుతున్నాం. ఆదాయ పన్నును ప్రతి ఏడాది ప్రకటిస్తున్నాం. మా కుటుంబం మాదిరిగా ఏ నాయకుడి కుటుంబం అయినా ఈ దేశంలో నిక్కచ్చిగా ప్రకటిస్తుందా అని చంద్రబాబు అన్నారు.

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు శనివారం 166వ రోజు యాత్ర కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయ న 2375 కిలోమీటర్ల మేర ప్రయాణిం చి పాదయాత్ర పూర్తి చేశారు. దీనిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం క న్వీనర్ ముళ్లపూడి బాపిరాజు 2375 మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి బాబుకు సంఘీభావం ప్రకటించారు. తణుకు ఫ్లై ఓవర్ వద్ద భారీ జ న సమూహాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

వైఎస్ కుటుంబం అ రాచక కుటుంబం. కొడుకు లక్ష కోట్లు దోచుకుని జైలుకు వెళ్లాడు. అల్లుడికి బ య్యారం గనులు అప్పగించారు. బావమరిది ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కున్నాడు. హత్యలు చేయడం, అవినీతికి పాల్పడ టం ఆ కుటుంబానికి తెలిసిన విద్య అ ని ఆరోపించారు. అవినీతికి పాల్పడి త మ నాయకుడు జైలులో ఉంటే అ లాం టి నేతతో ఫ్లెక్సీలు పెట్టుకుని స్థానికు లు ఊరేగటం ఎలాంటి సంకేతాల ను ప్రజలకు అందిస్తున్నారంటూ పిల్ల కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించా రు. వైఎస్ రైతులకు తొమ్మిది గం టలు కరెంటు ఇస్తానన్నాడు. అది సాధ్యం కాలేదు. కిరికిరి సీఎం ఏడు గంటలు ఇ స్తానని, ఏడు గంటలు ఇవ్వలేకపోయా డు. వీళ్లా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే నేతలా అంటూ నిగ్గుతీశారు.

ర్రాష్టంలో రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. 'పిల్లలను ఎలా త యారు చేయాలనుకుంటున్నారు.. ఆ జగన్ మాదిరిగా అవినీతిపరులుగా నా, పులివెందుల రౌడీల మాదిరిగా నా, హత్య చేసేవాళ్లగానా, లేక వీటికి భిన్నంగా క్రమశిక్షణతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నా రా' అంటూ తల్లిదండ్రులు ఇ ప్పుడు న్న రాజకీయాలను చూసి నిర్ణయించుకోవాలని కోరారు. మీకు బంగారు భ విష్యత్ ఉంది. ఈ ర్రాష్టంలో అవినీతి తో పేట్రేగిపోయిన వాళ్లు రకరకాల కూతలు కూస్తున్నారు. వీటిని నమ్ము కుంటే భవిష్యత్ నాశనం అయ్యే ప్ర మాదం ఉందని హెచ్చరించారు.

నే ను అధికారం కోసం రాలేదు. క్రమశిక్ష ణ తప్పలేదు. ఏది చేస్తానో అదే చెబుతాన ని స్పష్టం చేస్తూ పిల్ల కాంగ్రెస్, తల్లికాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. సీఎం కి రణ్‌కుమార్‌రెడ్డిపైనావిరుచుకుపడ్డారు.

ఉంగుటూరు, తణుకు కార్యకర్తల స మావేశంలో ప్రతిదానికీ డబ్బే ముఖ్యం కాదు. సేవ చేయాలి. అప్పుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. గౌరవిస్తారు, గెలిపిస్తారు అని కార్యకర్తలకు హితవు పలికారు. అప్పట్లో కాంగ్రెస్‌లో విలువలు ఉండేవని, ఇప్పుడు అవన్నీ హరించుకుపోయాయని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పందించాల్సి ఉం టే, దీనికి భిన్నంగా ఏవేవో జరుగుతున్నాయని, వీటి కారణంగా అసలు స మస్యలు మరుగునపడుతున్నాయని ఆయన పేర్కొంటూ తమ తప్పులు బ యటపడకుండా సభ వాయిదాపడితే నే మంచిదని భావిస్తున్నారని చెప్పా రు.

కౌలు రైతుల రుణం విషయాన్ని కూడా ఆయన తాజాగా ప్రస్తావించా రు. కౌలు రైతులు, బ్యాంకులు, సొసైటీల్లో రుణాలు తీసుకుని ఉంటే తప్పనిసరిగా వాటి మాఫీ విషయంలో కూ డా పార్టీపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇవ్వడం ద్వారా కౌలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రైతు వ్యతిరేకిగా తెలుగుదేశం పై జరుగుతున్న ద్రుష్పచారాన్ని కార్యకర్తలు నేరుగానే తిప్పికొట్టాలని కూడా కోరారు. జాబ్ రావాలంటే బాబు రా వాలని నిరుద్యోగులు కోరుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. టీడీపీ అ ధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాల ను మెరుగుపరుస్తానని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మా నం తుస్‌మందని ఆ రెండు పార్టీల తీ రును ప్రజలకు వివరించారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే కరెంటు కష్టాలు తప్పుతాయని ఆయ న స్పష్టం చేశారు. మీరు మేము చెప్పేదంతా నమ్మితే సహకరించండని పిలుపునిచ్చారు. నాకో అవకాశమిస్తే ఐదేళ్ల పాటు మీ సేవకుడిగా ఉంటానని కూ డా అభ్యర్థించారు. అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయని, వీరికి రిజర్వేషన్ కల్పించే అంశం పరిశీలిస్తామని ప్రకటించారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉ న్నారని, వారి రుణాల మాఫీలోనూ మాకొక స్థిర నిర్ణయం ఉందని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పార్టీ కన్వీనర్ వై.టి. రా జా, ఎమ్మెల్యేలు శేషారావు, రామారా వు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పా ర్టీ కన్వీనర్లు ఉన్నారు.

మాది నిఖార్సయిన కుటుంబం

ఏలూరు:' తమ్ముళ్లు.. మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో, ఏ ఆటలు ఆడుతున్నారో అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈలలు వేసి సరిపెట్టుకుంటే కుదరదు. కష్టించి పని చేయండి, అవినీతికి వ్యతిరేకంగా పో రాడండి, పార్టీని గెలిపించండి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రైతులను తెలుగుదేశం ఏనాడూ మోసం చేయలేదు, సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం, మద్దతు ధర కల్పించాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించాం, స్వయంగా నష్టపరిహారం అందిం చాం.

కానీ వై.ఎస్ కావాలని టీడీపీ మీద ద్రుష్పచారం చేశారని చంద్రబా బు ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగం గా 166వ రోజైన శనివారం ఆయన తణుకు సమీపంలో ఉన్న పైడిపర్రులో ఉంగుటూ రు, తణుకు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కష్టించి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇన్‌ఛార్జిలు కూడా కష్టపడి పనిచేయాల్సిందేనని అప్పుడే పార్టీకి మంచిరోజులు రావడమే కాకుండా మనం అధికారంలోకి రావడానికి వీలవుతుందని అన్నా రు. ఇంతకుముందు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిన సందర్భాల్లో వాళ్లకు ఏ సీట్లు ఇవ్వాలి, మనం ఏ సీట్లు మినహాయించుకోవాలి అనే చర్చలు సాగుతున్నప్పుడు పార్టీ అభ్యర్థుల ఖరారులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు.

ఇన్‌చార్జిలు సైతం ఇప్పుడు మూలన కూర్చుంటే సరిపోదని, కష్టపడి పనిచేయాల్సిందేనని, చేయకపోతే మేమేమి చేయాలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. కౌలు రైతులకు కూడా సరైన న్యాయం చేసేందుకు పార్టీ అన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. తల్లి కాం గ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 'మనం ఏం చేశామో ఇప్పటిదాకా, భవిష్యత్‌లో ఏమి చేయబోతున్నామో ప్రజలకు స్పష్టంగా వివరించాలి. అన్ని వర్గాల ప్రజలకు ఈ సమాచారం సంపూర్ణంగా అందాలి. అప్పుడే పార్టీకి అన్ని ఫలాలు దక్కుతాయని'' చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. మనం ఏ అవినీతి చేయలేదు. ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నాం.

అందుకే కష్టనష్టాలు కూర్చయినా సరే వస్తున్నా మీకోసం యాత్ర పేరిట నేను పాదయాత్ర చేస్తున్నాను అని వివరించారు. నేను ఒక పని అనుకున్నానంటే దానిని పూర్తి చేసి తీరుతాను. ఈ విషయంలో ఎప్పుడూ వెనకేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశా రు. కాంగ్రెస్ దుర్మార్గ రాజకీయాలను, దోపిడీ తనాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ అవినీతిని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్లాలన్నారు. మనకున్న పరిధిలోనే పార్టీకి చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్లు అభ్యర్థ్ధులను ఆరు నెలల ముందుగానే ప్రకటిస్తాను. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అన్నారు. సుమారు గంటన్నరపైగానే ఆయన ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఛలోక్తులు విసిరారు. మన వాళ్లు కొందరు మైకాసురుల్లా మారిపోయారని ఒకసారి, సెంటిమెంట్‌తో కొడుతున్నారని ఇంకోసారి చమత్కార బాణాలు సంధించారు. పార్టీ అంశాలను, గెలుపు ఆవశ్యకతను ఒకవైపు ప్రస్తావిస్తూనే ఇంకోవైపు చమక్కులు విసురుతుండటంతో సమీక్షలో అనేకమార్లు నవ్వుల పువ్వులు విరిసాయి.

తప్పులు సరిదిద్దుకోవాలి

: కార్యకర్తలు

ఇప్పుడు పార్టీలో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల కార్యకర్తలు తమ అధినేత చంద్రబాబు ఎదుట స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించి అయినా సరే గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. పోలింగ్‌కు 22 రోజుల ముందు ఉంగుటూరు అభ్యర్థ్ధిని ఖరారు చేశారు. అయినా కూడా అక్కడ మనకి రెండోస్థానం లభించిందని ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. మాకు కిరణ్ సీఎం కాదు, మీరే సీఎం, కరెంటు కష్టాలతో వేగలేకపోతున్నాం, కౌలు రైతులను ఆదుకోవాలని మందలపు సత్యనారాయణ కోరారు. కౌలు రైతులు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని రామకృష్ణ అనే మరో కార్యకర్త సూచించారు. మా రికార్డులన్నీ మీ దగ్గర ఉంటున్నాయంటున్నారు, కానీ ఉంగుటూరులో పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న మమ్మల్ని స్థానిక మంత్రి పీడించి పిప్పి చేస్తున్నారని పాతూరు విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీబీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మనం ఓడిపోవాల్సి వచ్చిందని, అందుకే మా ఇన్‌ఛార్జికి మరింత బూస్ట్ అవసరమ న్నారు. పార్టీ రాజకీయాలు కలుషితంగా మారాయని కార్యకర్త అప్పలనాయుడు పేర్కొనగా డబ్బులకు ఆశపడిన వారే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లోకి వెళ్తారని నారాయణ అనే మరో కార్యకర్త పేర్కొన్నారు. ఇంతకుముందు మా నాన్న మమ్మల్ని బాగా చూసుకునేవారు, కావల్సినంత తిండిపెట్టేవారు. ఇప్పు డు నావరకు వచ్చేసరికి నా పిల్లలకు పప్పుచారు వేసి కూడా పెట్టలేకపోతున్నానని కార్యకర్త ఏసుబాబు కన్నీంటి పర్యంతమయ్యారు. డ్వాక్రా ప్రస్తుతం సర్వనాశనం అయినందని పుష్పాంజలి అనే మరో నేత ఆందోళన వ్యక్తం చేశా రు. ఉద్యోగాలు లేక యువకులు విలవిలలాడుతున్నారని తణుకు నియోజకవర్గ నేత నరిసింగ్ పేర్కొన్నారు. జగన్ వస్తే ఉప్పు కిలో వంద రూపాయలు అవుతుందని, రైతులకు నష్టాలు తప్పవని వీరవెంకట సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటాం, వై.టి.రాజాకు ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని నందమూరి ప్రసాద్ కోరారు. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని పాపాయమ్మ ఆందోళన వ్యక్తం చేయగా, ఇప్పుడిస్తున్న హామీలతో పాటు ప్రతీ కుటుంబానికి కొంత లబ్ధ్ది చేకూరేలా కార్యాచరణ చేయాలని సర్వారాయుడు విజ్ఞప్తి చేశారు.

మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి

ఏలూరు : తెలుగుదే శం పార్టీ అధినేత చంద్రబాబునాయు డు వస్తున్నా..మీకోసం యాత్ర శనివారం వరకు 93.2 కి.మీ.మేర పూర్తయ్యింది. 167రోజైన ఆదివారం ఆయ న పెరవలి, నిడదవోలు మండలాల్లో మరో 13.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆదివా రం ఉదయం కాకరపర్రు హైస్కూల్ నుంచి బయలుదేరి కాకరపర్రు, తీ పర్రు, ఉసులుమర్రు, కానూరు, మునిపల్లి, పెండ్యాల సెంటర్, కలవచర్ల మీదుగా పాదయాత్ర కొనసాగించి కలవచర్ల దాటిన తర్వాత వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు.

నేడు చంద్రబాబు పాదయాత్ర ఇలా..


 ఏలూరు :తణుకు జన సంద్రమైంది.. వీధులు కిక్కిరిశా యి..జనం హోరు నలుదిక్కులా దద్దరిల్లేలా చేసి ంది..వీధులు పసుపుమయమయ్యాయి.. చంద్రదండు కదం తొక్కింది. అడుగులో అడుగు కలిపింది..మహిళలు నీరాజనాలు అర్పించారు. యు వకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు.. సుమా రు మూడు గంటలకుపైగానే పైడిపర్రు నుంచి తణుకు శివారు వరకు ప్రజలు హోరెత్తారు. బహుదూరపు బాటసారికి ఎదురేగి దీవెనలిచ్చా రు.మహిళలు నుదుట తిలకాలు దిద్దారు.


అంతకంటే మించి ఆయనకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. మ రికొందరు గ్రూపు ఫొటోల కోసం పోటీలు పడ్డారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా 166వ రోజైన శనివారం యాత్ర ఆది నుంచి తుది దాకా చంద్రబాబుపై జనాభిమానం వెల్లువెత్తింది. మేడ లు, మిద్దెలపై జనం కిక్కిరిసినిలడ్డారు. పట్టణంలోని దారికి ఇరువైపులా జనం బారులుతీరారు. ఆయనను దగ్గర నుంచి చూసేందుకు తాపత్రయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పాదయాత్ర ఎన్నికల ప్రచార యాత్రను తలపింపజేసింది.

చంద్రబాబు మధ్యాహ్నం నాలుగు గంటలకు పైడిపర్రు నుంచి పాదయాత్రకు ఉపక్రమించారు. తణుకు నియోజకవర్గ కన్వీనర్ వై.టి.రాజా, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, సీనియర్ నాయకులు వెంట రాగా పైడిపర్రు నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటికే తణుకు పట్టణ వీధుల్లో చంద్రబాబును చూసేందుకు వందలాది మంది బారులుతీరారు. పైడిపర్రు నుంచి ఫ్లయ్ ఓవర్ సెంటర్ వరకు వచ్చేసరికి అక్కడి కూడలి జనంతో కిక్కిరిసింది. వారితో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. బెల్ట్‌షాపులు ఎత్తివేస్తామని, రుణమాఫీ చేస్తామని, అగ్రవర్ణాల్లో పేదకుటుంబాలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. మీ కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం, మిమ్మల్ని సీఎంను చేస్తామంటూ ప్రజల నుంచి వచ్చిన నినాదాలతో చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. అక్కడి నుంచి ఫ్లయ్ ఓవర్ మీదుగా తణుకు పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు వందలాది మంది ఆయనను అనుసరించారు. పున్నమి చంద్రుడిలా చంద్రబాబు మెల్లగా ముందుకు సాగారు. తన కోసం వేచి ఉన్న వారికి చేతులు ఊపుతూ అభివాదాలు చేశారు. మహిళలు పిల్లలతో సహా ఎదురొచ్చి ఆయనకు హారతులిచ్చారు. తణుకు కన్స్యూమర్స్ సొసైటీ వద్ద ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య జతకలిశారు. అక్కడి నుంచి నరేంద్ర సెంటర్ వరకు ఇసుక వేస్తే రాలనంతగా రోడ్లు కిక్కిరిశాయి. వాస్తవానికి చాలాకాలం తర్వాత చంద్రబాబు ఈ ప్రాంతానికి రావడం ఒక ఎత్తయితే, వస్తున్నా మీ కోసం పేరిట ఆయన తణుకు పట్టణం మీదుగా ముందుకు వెళ్తుండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పట్టరాని ఆనందంతో కార్యకర్తలు నృత్యాలు చేశారు. మాదిగ దండోరా కార్యకర్తలు ఆయనను అనుసరించారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను ఆయన నరేంద్ర సెంటర్‌లో దుయ్యబట్టినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత ఆయన ఉండ్రాజవరం జంక్షన్ వైపు బయలుదేరినప్పుడు కూడా అదే అభిమానం, అంతే ఉత్సాహం అందరిలోనూ కన్పించింది. సీనియర్ నేత మాగంటి బాబు అయితే కుర్రకారుతో కలిసి నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. కార్యకర్తల ఉత్సాహం ఒకవైపు, వేలాదిగా హాజరైన జనం అభిమానం ఇంకోవైపు చంద్రబాబును సైతం ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆయన చెరగని చిరునవ్వుతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మహిళలను, యువకులను పలకరిస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యలో మొక్కజొన్న పొత్తును కాల్చారు. పుచ్చకాయను రుచిచూశారు. పాదయాత్రలో చంద్రబాబుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే టి.వి.రామారావు, వై.టి.రాజా, బోళ్ల బుల్లిరామయ్య, బూరుగుపల్లి శేషారావు, పీతల సుజాత, మాగంటి బాబు, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, పాందువ శ్రీను, కొక్కిరగడ్డ జయరాజు వంటి నేతలు ఉన్నారు.

తణుకు.. తళుకు...