March 17, 2013

తణుకు.. తళుకు...


 ఏలూరు :తణుకు జన సంద్రమైంది.. వీధులు కిక్కిరిశా యి..జనం హోరు నలుదిక్కులా దద్దరిల్లేలా చేసి ంది..వీధులు పసుపుమయమయ్యాయి.. చంద్రదండు కదం తొక్కింది. అడుగులో అడుగు కలిపింది..మహిళలు నీరాజనాలు అర్పించారు. యు వకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు.. సుమా రు మూడు గంటలకుపైగానే పైడిపర్రు నుంచి తణుకు శివారు వరకు ప్రజలు హోరెత్తారు. బహుదూరపు బాటసారికి ఎదురేగి దీవెనలిచ్చా రు.మహిళలు నుదుట తిలకాలు దిద్దారు.


అంతకంటే మించి ఆయనకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. మ రికొందరు గ్రూపు ఫొటోల కోసం పోటీలు పడ్డారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా 166వ రోజైన శనివారం యాత్ర ఆది నుంచి తుది దాకా చంద్రబాబుపై జనాభిమానం వెల్లువెత్తింది. మేడ లు, మిద్దెలపై జనం కిక్కిరిసినిలడ్డారు. పట్టణంలోని దారికి ఇరువైపులా జనం బారులుతీరారు. ఆయనను దగ్గర నుంచి చూసేందుకు తాపత్రయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పాదయాత్ర ఎన్నికల ప్రచార యాత్రను తలపింపజేసింది.

చంద్రబాబు మధ్యాహ్నం నాలుగు గంటలకు పైడిపర్రు నుంచి పాదయాత్రకు ఉపక్రమించారు. తణుకు నియోజకవర్గ కన్వీనర్ వై.టి.రాజా, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, సీనియర్ నాయకులు వెంట రాగా పైడిపర్రు నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటికే తణుకు పట్టణ వీధుల్లో చంద్రబాబును చూసేందుకు వందలాది మంది బారులుతీరారు. పైడిపర్రు నుంచి ఫ్లయ్ ఓవర్ సెంటర్ వరకు వచ్చేసరికి అక్కడి కూడలి జనంతో కిక్కిరిసింది. వారితో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. బెల్ట్‌షాపులు ఎత్తివేస్తామని, రుణమాఫీ చేస్తామని, అగ్రవర్ణాల్లో పేదకుటుంబాలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. మీ కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం, మిమ్మల్ని సీఎంను చేస్తామంటూ ప్రజల నుంచి వచ్చిన నినాదాలతో చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. అక్కడి నుంచి ఫ్లయ్ ఓవర్ మీదుగా తణుకు పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు వందలాది మంది ఆయనను అనుసరించారు. పున్నమి చంద్రుడిలా చంద్రబాబు మెల్లగా ముందుకు సాగారు. తన కోసం వేచి ఉన్న వారికి చేతులు ఊపుతూ అభివాదాలు చేశారు. మహిళలు పిల్లలతో సహా ఎదురొచ్చి ఆయనకు హారతులిచ్చారు. తణుకు కన్స్యూమర్స్ సొసైటీ వద్ద ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య జతకలిశారు. అక్కడి నుంచి నరేంద్ర సెంటర్ వరకు ఇసుక వేస్తే రాలనంతగా రోడ్లు కిక్కిరిశాయి. వాస్తవానికి చాలాకాలం తర్వాత చంద్రబాబు ఈ ప్రాంతానికి రావడం ఒక ఎత్తయితే, వస్తున్నా మీ కోసం పేరిట ఆయన తణుకు పట్టణం మీదుగా ముందుకు వెళ్తుండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పట్టరాని ఆనందంతో కార్యకర్తలు నృత్యాలు చేశారు. మాదిగ దండోరా కార్యకర్తలు ఆయనను అనుసరించారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను ఆయన నరేంద్ర సెంటర్‌లో దుయ్యబట్టినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత ఆయన ఉండ్రాజవరం జంక్షన్ వైపు బయలుదేరినప్పుడు కూడా అదే అభిమానం, అంతే ఉత్సాహం అందరిలోనూ కన్పించింది. సీనియర్ నేత మాగంటి బాబు అయితే కుర్రకారుతో కలిసి నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. కార్యకర్తల ఉత్సాహం ఒకవైపు, వేలాదిగా హాజరైన జనం అభిమానం ఇంకోవైపు చంద్రబాబును సైతం ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆయన చెరగని చిరునవ్వుతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మహిళలను, యువకులను పలకరిస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యలో మొక్కజొన్న పొత్తును కాల్చారు. పుచ్చకాయను రుచిచూశారు. పాదయాత్రలో చంద్రబాబుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే టి.వి.రామారావు, వై.టి.రాజా, బోళ్ల బుల్లిరామయ్య, బూరుగుపల్లి శేషారావు, పీతల సుజాత, మాగంటి బాబు, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, పాందువ శ్రీను, కొక్కిరగడ్డ జయరాజు వంటి నేతలు ఉన్నారు.