September 11, 2013

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకలు భ్రష్టు పట్టించారని, రాష్ట్రంలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ బస్సుయాత్ర బుధవారం జిల్లాలోని తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కొనసాగింది. దీంతో జిల్లాలో బాబు ఆరురోజుల బస్సు యాత్ర ముగిసింది.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకలు భ్రష్టు పట్టించారన్నారు. రాష్ట్రంలో ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ బస్సుయాత్ర బుధవారం జిల్లాలోని తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల కోట్లు అవినీతి జరిగినా పాలకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చేతకాని నాయకులు రాష్ట్రాన్ని ఏలాలనుకొంటున్నారని, వ్యవస్థ అంతా సర్వ నాశనమయి పోయిందన్నారు.
యువతకు ఉపాధి, ఉద్యోగావాకాశాలు లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ మీ జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. మన్మోహన్ సోనియా చేతిలో కీలుబొమ్మ అని, దేశం కుంభకోణాల మయంగా మారిపోయిందని న్యూ యార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించిందని, దేశంలో నెలకొని ఉన్న దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. వైఎస్ హయాంలో రూ.43 వేల కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ ఎనిమిది చార్జీషీట్లలో పేర్కొందన్నారు.
కాంగ్రెస్ దొంగలను ఆదర్శరైతుల కింద వైఎస్ సత్కరించారని తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గపు రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, వైసీపీలను హెచ్చరించారు. అన్నదమ్ముల్లా ఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారని వ్యాఖ్యానించారు. కొన్ని కుటుంబాల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేదల నెత్తి గుదిబండలు వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటిచెప్పేందుకే మళ్లీ మీ ముందుకు వచ్చా

సీమాంధ్రలో తొలివిడత పర్యటన పూర్తిచేసిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారు. గురువారం ఆయన నగరానికి వస్తున్నా రు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై హస్తినలో ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకత్వాలనూ కలిసి మాట్లాడాలని భావిస్తున్నట్లు సమాచారం. గురువారం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లదలిస్తే పార్టీలోని ఇరుప్రాంతాల నాయకులనూ వెంట తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.

 

హస్తినకు చంద్రబాబు?

 మీ నాయకుడు జైల్లో ఉన్నాడు. పిచ్చపిచ్చగా మాట్లాడితే మీ అంతు చూస్తాం. బీకేర్ ఫుల్. మేం తలుచుకుంటే. తరిమితరిమి కొడతాం. మీ నాయకుడు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. దేశాన్ని భ్రష్టుపట్టించాడు. జైలుకు పోయినా సిగ్గులేదు. 1999లో వైఎస్ ప్రారంభించిన తెలంగాణ ప్రక్రియను సోనియా ముగించినట్లు దిగ్విజయ్‌సింగ్ చెప్పినా
మీకు సిగ్గు కూడా లేదు. రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ఉపయోగించటం ద్వారా ఏ కత్తితో పొడవాలో కూడా ఈ దొంగల నాయకుడే కాంగ్రెస్‌కు చెప్పాడు. ముందు సమన్యాయం.. తర్వాత సమైక్యవాదం. రేపోమాపో కాంగ్రెస్‌లో విలీనమైపోతారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడిన దొంగలు మీరు. మీ పార్టీనా నాకు చెప్పేది? 30 ఏళ్ల టీడీపీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ. ఈ దొంగలు వచ్చి మనల్ని అవమానపరుస్తారా. వీళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరికైనా అమ్మేస్తారు''.

కృష్ణాజిల్లాలో ఆత్మగౌరవ యాత్రను అడ్డగించిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా చండ్రనిప్పులు చెరిగారు. బుధవారం కృష్ణాజిల్లాలో ఆరో రోజున ఆయన తిరువూరు మండలం వావిలాల గ్రామం వచ్చినప్పుడు 30మంది వైసీపీ కార్యకర్తలు కాన్వాయ్‌కి అడ్డుపడేందుకు యత్నించారు. పోలీసులు తరుముతున్నా వారు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఉగ్రరూపం దాల్చి వారిపై మండిపడ్డారు. గ్రామంలో సభ అనంతరం మరోసారి కూడా వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు. "మిమ్మల్ని ఉరుకులెత్తించేవాళ్లం. దేహశుద్ధి చేస్తేగానీ మీకు బుద్ధి రాదు. పొలంలో ఉన్న రైతుకు నన్ను నిలదీసే హక్కు ఉంది. కాంగ్రెస్ వైసీపీ దొంగలకు లేదు. ఖబడ్దార్. మాతో పెట్టుకుంటే తోక కట్ చేసి పంపిస్తా. వైఎస్సారే నా దగ్గర భయపడేవాడు.. మీరెంత? రాజమండ్రిలో ఏటీఎం దోచి పాదయాత్రకు ఖర్చుపెట్టారు. నర్సీపట్నంలో దొంగ నోట్లు ముద్రిం చి ఖర్చు చేశారు. మీరా మాట్లాడేది? ఊరికి ఐదారుగురురు పనికిమాలినవాళ్లుంటారు. వాళ్లకో క్వార్టర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు.. ఆ రోజంతా ఊళ్లో హడావుడి చేసేస్తారు'' అని దుయ్యబట్టారు.

గంపలగూడెం మండలంలోనూ బాబు యాత్ర సాగించారు. కాంగ్రెస్ ప్రభు త్వం తెలుగు ప్రజలమధ్య అనుబంధాన్ని తెంచేసి వేడుక చేసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ సమస్యను పరిష్కరించమంటే సీమాంధ్రలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. సోనియాగాంధీ దేశానికే శాపమని దుయ్యబట్టారు. సిగ్గు లేని వైసీపీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కలిసే రోజు వస్తుందని.. వైసీపీకి ఓటు వేస్తే సోనియాకు వేసినట్లేనని అన్నారు. దేశంలోని ఆర్థిక ఉగ్రవాదులను ఏం చేశారని ప్రధాని మన్మోహన్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైసీపీ బ్రాంచ్ ఆఫీసులుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు

రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ఉపయోగించటం ద్వారా ఏ కత్తితో పొడవాలో కూడా ఈ దొంగల నాయకుడే కాంగ్రెస్‌కు చెప్పాడు.

గంపలగూడెం (కృష్ణాజిల్లా ) : కాంగ్రెస్‌ అవినీతి పార్టీ.....వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ దొంగల పార్టీలు రెండూ కలసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఊటుకూరులో బస చేసిన ఆయన బుధవారం కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని గాదెవారి గూడెం,ఆర్లపాడు,గొల్లపూడి గ్రామాలలో బస్సు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన ఆయనకు భారీ స్ధాయిలో మహిళలు,యువకులు,పార్టీ నాయకులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పరిపాలన అవినీతిలో కూరుకుపోయిందని ద్వజ మెత్తారు.నిత్యవసర వస్తువులు ఆకాశన్నంటి ఉల్లిపాయల సైతం కొనే పరిస్ధితులలో లేరన్నారు.ప్రజల కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీయేనని.తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ హయంలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృధ్ధి చెందాయన్నారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది కూడా తెలు గుదేశం పార్టీ వలనేనని,తెలుగు ప్రజల కష్టాలు తెలుసుకోడానికే మీ ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.టిడిపి పాలనలో డ్వాక్రా మహిళలు లక్షాదికారులు కాగా ఇప్పటి కాంగ్రెస్‌ పార్టీ పాలనలో భిక్షా ధికారులు అయ్యారని ద్వజమెత్తారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా టిడిపికే దక్కుతుందన్నారు. 9ఏళ్ళ నుండి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఎటువంటి అభివృధ్ధి జరగలేదని అంతా అవినీతేనని ఆయన అన్నారు. లీకుల వీరుడు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, లిక్కర్‌ డాన్‌ బొత్స, ఫాంహౌస్‌ కేసిఆర్‌లు కుమ్మక్క య్యారని విమర్శించారు. .ఉత్తరాఖండ్‌ బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడ లేకపోయారని బాధితులను కాపాడింది టీడీపీయేనని సగర్వంగా చెప్పారు. .వైఎస్‌ రాజ శేఖరరెడ్డిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపా దనతో సాక్షి పత్రిక,సాక్షి చానల్స్‌ పెట్టి ప్రతిరోజు నా గురించి నాలుగు పేజీలు రాసి మిగిలిన పేజీలు వాళ్ళ గురించి రాసుకోవడం జరు గుతుందన్నారు. టీడీపీకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుజాతి మద్య సోనియాగాంధి చిచ్చుపెట్టిందని ఆరోపించారు. .రాష్ట్రంలో రౌడీ అనేవాడిని లేకుండా చేసింది కూడా తెలుదేశం పార్టీ యేనన్నారు.రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని తెలంగాణలో టిఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైసిపితో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు తెచ్చుకోవాలని ఆలోచన చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. తెలుగుజాతికి అన్యాయం చేస్తే ఖబడ్ధార్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆర్లపాడు లో ఉద్యోగాలు కావాలంటే బాబు అధి కారంలోకి రావా లంటూ యువకులు నినా దాలు చేయగా, అది నిజం అంటూ వారిని బాబు ఉత్తేజపర్చారు. అనంతరం యాత్ర గొల్లపూడి నుండి తిరువూరు మండలానికి చేరింది. మండలంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర విజయ వంతంగా సాగింది.అ కార్యక్రమంలో ఎంపీ కొనకాళ్ళ నారాయణ,జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు,విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్ధి కేశినేని నాని,తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌,మండల నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, వై.నాగమల్లేశ్వరరావు, వై.పుల్లయ్యచౌదరి, స్ధానిక నాయకులు కె.వెంకటేశ్వర రావు,సిహెచ్‌ నాగేశ్వరరావు, బాగ్యలక్ష్మి, గొల్లపూడి సొసైటి అధ్యక్షులు కేతినేని కుటుంబరావు, పలువురు జిల్లా మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, నూజివీడు డిఎస్పీ ఎ.శంకర్‌రెడ్డిలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

అక్రమ సంపా దనతో సాక్షి పత్రిక,సాక్షి చానల్స్‌ పెట్టి ప్రతిరోజు నా గురించి నాలుగు పేజీలు ...........

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆత్మగౌరవ బస్పు యాత్రలో వైసిపి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బాబు ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా బుధవారం కృష్ణా జిల్లా వావిలాల గ్రామంలో చంద్రబాబు ప్రసంగించేందుకు వస్తుండగా అక్కడ ఉన్న వైసిపి కార్యకర్తలు సమైక్యాంధ్ర నినాదాలతో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి యత్నించారు.
రైతులకు నన్ను నిలదేసే హక్కు ఉందని, దొంగలకు మాత్రం తనను ప్రశ్నించే హక్కులేదని ఆయన వైసిపి కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేం తలుచుకుంటే వైసిపి నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని,
తనకు వైఎస్సే భయపడేవాడని,  అని చంద్రబాబు నాయిడు వైసిపి కార్యకర్తలను హెచ్చరించారు.
దీంతో ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలను అడ్డుకున్నారు. అంతటితో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇది చూసిన బాబు వైసిపి కార్యకర్తలను నిలువరించారు. "పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఉరుకోం'' అంటూ బాబు వైసిపి కార్యకర్తలపై నిప్పులు చెరిగారు.
జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్‌తో లాలూచి పడి నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ అసలు తెలంగాణకు బీజం వేసింది వైఎస్ అని బాబు ధ్వజమెత్తారు. జైల్లో ఉన్నా మీ నాయకుడికి సిగ్గు రాలేదు, నర్సీపట్నంలో దొంగనోట్లు ముద్రించి, ఎటిఎంలు దోచి షర్మిల పాదయాత్రలకు ఖర్చుపెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈలోగా ఘర్షణకు దిగిన వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అక్కడి నుండి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.

వైఎస్సే భయపడేవాడు ....గట్టిగా మాట్లాడితే మీ అంతు చూస్తాం

ఇరుప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి తెలుగుప్రజలు మరణశాసనం రాయనున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయు డు అన్నారు. ఆయన సోమవారం తె లుగుజాతి ఆత్మగౌరవయాత్రలో భా గంగా మండలంలోని వినగడప, తోటమూల, మేడూరు, సత్యాలపాడు, పెనుగొలను, ఊటుకూరు గ్రామాల్లో నిర్వహించిన బస్సుయాత్ర సందర్భంగా బహిరంగసభల్లో మాట్లాడారు. తెలుగుజాతికి గుర్తింపుతెచ్చింది ఎన్టీఆరేనని నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్‌గాంధీ ఘోరంగా అవమానిస్తే ఎన్టీఆర్ ఆం«ధ రాష్ట్రగౌరవం ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారని తెలుగుదేశం పార్టీని స్థాపించి 9నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడించారన్నారు. తెలుగుదేశం పార్టీని ఏవిధంగానైనా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుటిలరాజకీయాలకు తెరలేపి ఓట్లు, సీట్లు ఆధారంగా రాష్ట్రవిభజన చేసి తెలంగాణలో టీఆర్ఎస్‌ను, సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీని ప్రోత్సహిస్తుందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా, జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ తెరవెనుక రాజకీయాలు చేస్తుందన్నారు. కాం గ్రెస్ రాష్ట్రప్రజలను వీధులపాలు చేసిందన్నారు. బస్సుయాత్రలో చెరుకూరి రాజేశ్వరరావు, పుల్లయ్యచౌదరి, దిరిశాల వెంకటకృష్ణారావు, సీతారామప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు మరణశాసనం రాసేది తెలుగు ప్రజలే


టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బు«ధవారం నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా తలసాని

 కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రలో వైసీపీ నేతలు సమైక్య నిదాలు చేశారు. దీనిపై బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి వేశాలు వేస్తే సహించేది లేదన్నారు. తాము తలుచుకుంటే మీ పార్టీ నేతలు ఇంట్లో నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. సమైక్యం పేరుతో కాంగ్రెస్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజం వేసింది వైఎస్సే అని ఆయన తెలిపారు. మీ నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గు లేదని, గట్టిగా మాట్లాడితే అంతు చూస్తామని చంద్రాబాబు హెచ్చరించారు.

మీ నాయకుడు జైల్లో ఉన్నా మీకు సిగ్గు లేదు.......

కాంగ్రెస్ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది : చంద్రబాబు 
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గాదెవారిపేటలో బాబు 11వ రోజు ఆత్మగౌరవయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ ఓ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో ప్రధాని రిమోట్‌కంట్రోల్ లాంటివారని ఆయన విమర్శించారు.
దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సీఎం కిరణ్ లీకుల వీరుడని...బొత్స ఉత్సవ విగ్రహం మాత్రమే అని బాబు ధ్వజమెత్తారు. మరో నాయకుడు ఎప్పుడూ జైల్లోనే ఉంటాడని, వీరి వల్ల ఒరిగేది ఏమీ లేదని బాబు అన్నారు. టీడీపీ హయాంలో గ్రామగ్రామాన నాయకుడు పుట్టుకొస్తాడని బాబు తెలిపారు.
సమైక్యాంధ్ర కోసం 42 రోజులుగా ఉద్యమిస్తున్నా సీమాం«ద్రులను పట్టించుకునే నాథుడే లేడని, సీమాం«ద్రుల హక్కుల కోసం పోరాడుతామని ఆయన చెప్పారు. అన్ని రాజకీయపార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం చేయమంటే కాంగ్రెస్ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం కిరణ్ లీకుల వీరుడు...బొత్స ఉత్సవ విగ్రహం...

 టీడీఎల్పీలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామని ఎర్రబెల్లి తెలిపారు.

పార్లమెంటులో బిల్లు పెట్టేలా ఒత్తిడి : ఎర్రబెల్లి

  ప్రజలను మభ్యపెడుతూ రోజుకో తీరుగా మాటల గారడీ చేస్తున్న పాలకులు, కొన్నిపార్టీల నాయకుల ప్రవర్తనను చూసి తనకంటే బాగా రంగులు మారుస్తున్నారని ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఘాటైన విమర్శలు చేశారు. మంగళవారం తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సాగిన ఆత్మగౌరవయాత్రలో ఆయనమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రంలో విభజన చిచ్చు రేపాయని, పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్సార్‌కాంగ్రెస్ గంటకో ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాలతో సైతం అభివృద్దిపథం
లో పయనింపచేస్తే మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిందని నేడు యువత నిర్వీర్యమైపోతుందని ఆవేదన చెందారు. రాష్ట్రాన్ని వంతులు వారీగా దోచుకుతింటున్నారని, ప్రజలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసి అధిక ధరలను ప్రజలపై మోపుతున్నారని ఉల్లిపాయలతోపాటు నిత్యావసరధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సోనియాగాందీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలని లక్ష్యంతోటే రాష్ట్రాలను సైతం అగ్నిగుండాలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
ఈ యాత్రలో నియోజకవర్గ కన్వీనర్ నల్లగట్ల స్వామిదాసు, జిల్లాపార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ చీప్‌విఫ్ కాగితం వెంకట్రావు, మాజీచైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, విజయవాడ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి కేశినేని నాని, వల్లభనేని వంశీమోహన్, సుంకర కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

తనకంటే బాగా రంగులు మారుస్తున్నారని ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయి...