September 11, 2013

అక్రమ సంపా దనతో సాక్షి పత్రిక,సాక్షి చానల్స్‌ పెట్టి ప్రతిరోజు నా గురించి నాలుగు పేజీలు ...........

గంపలగూడెం (కృష్ణాజిల్లా ) : కాంగ్రెస్‌ అవినీతి పార్టీ.....వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ దొంగల పార్టీలు రెండూ కలసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఊటుకూరులో బస చేసిన ఆయన బుధవారం కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని గాదెవారి గూడెం,ఆర్లపాడు,గొల్లపూడి గ్రామాలలో బస్సు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామగ్రామాన ఆయనకు భారీ స్ధాయిలో మహిళలు,యువకులు,పార్టీ నాయకులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పరిపాలన అవినీతిలో కూరుకుపోయిందని ద్వజ మెత్తారు.నిత్యవసర వస్తువులు ఆకాశన్నంటి ఉల్లిపాయల సైతం కొనే పరిస్ధితులలో లేరన్నారు.ప్రజల కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీయేనని.తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ హయంలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృధ్ధి చెందాయన్నారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది కూడా తెలు గుదేశం పార్టీ వలనేనని,తెలుగు ప్రజల కష్టాలు తెలుసుకోడానికే మీ ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.టిడిపి పాలనలో డ్వాక్రా మహిళలు లక్షాదికారులు కాగా ఇప్పటి కాంగ్రెస్‌ పార్టీ పాలనలో భిక్షా ధికారులు అయ్యారని ద్వజమెత్తారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా టిడిపికే దక్కుతుందన్నారు. 9ఏళ్ళ నుండి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఎటువంటి అభివృధ్ధి జరగలేదని అంతా అవినీతేనని ఆయన అన్నారు. లీకుల వీరుడు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, లిక్కర్‌ డాన్‌ బొత్స, ఫాంహౌస్‌ కేసిఆర్‌లు కుమ్మక్క య్యారని విమర్శించారు. .ఉత్తరాఖండ్‌ బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడ లేకపోయారని బాధితులను కాపాడింది టీడీపీయేనని సగర్వంగా చెప్పారు. .వైఎస్‌ రాజ శేఖరరెడ్డిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపా దనతో సాక్షి పత్రిక,సాక్షి చానల్స్‌ పెట్టి ప్రతిరోజు నా గురించి నాలుగు పేజీలు రాసి మిగిలిన పేజీలు వాళ్ళ గురించి రాసుకోవడం జరు గుతుందన్నారు. టీడీపీకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుజాతి మద్య సోనియాగాంధి చిచ్చుపెట్టిందని ఆరోపించారు. .రాష్ట్రంలో రౌడీ అనేవాడిని లేకుండా చేసింది కూడా తెలుదేశం పార్టీ యేనన్నారు.రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని తెలంగాణలో టిఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైసిపితో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు తెచ్చుకోవాలని ఆలోచన చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. తెలుగుజాతికి అన్యాయం చేస్తే ఖబడ్ధార్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆర్లపాడు లో ఉద్యోగాలు కావాలంటే బాబు అధి కారంలోకి రావా లంటూ యువకులు నినా దాలు చేయగా, అది నిజం అంటూ వారిని బాబు ఉత్తేజపర్చారు. అనంతరం యాత్ర గొల్లపూడి నుండి తిరువూరు మండలానికి చేరింది. మండలంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర విజయ వంతంగా సాగింది.అ కార్యక్రమంలో ఎంపీ కొనకాళ్ళ నారాయణ,జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు,విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్ధి కేశినేని నాని,తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌,మండల నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, వై.నాగమల్లేశ్వరరావు, వై.పుల్లయ్యచౌదరి, స్ధానిక నాయకులు కె.వెంకటేశ్వర రావు,సిహెచ్‌ నాగేశ్వరరావు, బాగ్యలక్ష్మి, గొల్లపూడి సొసైటి అధ్యక్షులు కేతినేని కుటుంబరావు, పలువురు జిల్లా మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ప్రభాకరరావు, నూజివీడు డిఎస్పీ ఎ.శంకర్‌రెడ్డిలు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.