September 28, 2013




  కేసీఆర్, జగన్ కాం గ్రెస్ అధినేత్రి సోనియా విసిరిన బాణాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె నివాసంలో తయారుచేసి పంపిన స్క్రిప్టును వారిక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇక ముఖ్యమంత్రి కిరణ్ ఎవరు విసిరిన బాణమో చూడాల్సి ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో లాలూచీపడి నాలుగు సీట్లు గెలుచుకోవాలని, టీడీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందన్నారు. ఇటీవలి రాష్ట్ర పరిణామాలన్నీ అడుగడుగునా కుట్రలు, మ్యాచ్ ఫిక్సింగులేనని, వీటన్నింటికీ కేంద్ర బిందువు సోనియాగాంధీ యేనని విమర్శించారు. చీకటి ఒప్పందాలు, తెరచాటు కుట్రలతో తమను బలిపశువులు చేశారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని చెప్పారు. 'సొంత పార్టీ పోయినా నాలుగు సీట్లు వచ్చి మళ్లీ అధికారం దక్కితే చాలని భావించే మహా నాయకురాలిని ఇప్పుడే చూస్తున్నాం' అని ధ్వజమెత్తారు.

తమ పార్టీ ఇటువంటి కుట్రలను చేధించేందుకు ఎన్టీఆర్ విసిరిన రామబాణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. 'రెండు ప్రాంతాల నాయకులతో ఢిల్లీవెళ్లి మూడు రోజులు అందరితో మాట్లాడాను. వారిని మేనేజ్ చేయడం కాకుండా ఇరుపక్కలా ఉన్న జేఏసీలు, విద్యార్థులు, ప్రభావిత వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యలేమిటో తెలుసుకొని పరిష్కరించమని చెప్పా. ఇదే మా వైఖరి. ఇది సున్నితమైన సమస్య అనే సంగతి మరచి, రాజకీయ లబ్ధికోసం జటిలం చేయడం వల్లే రాష్ట్రం తగలబడుతోంది' అని వ్యాఖ్యానించా రు. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతు న్న సీఎం, ముందుగా తమ అధిష్ఠానంవద్ద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. '60 రోజుల తర్వాత లేచి వచ్చి మాట్లాడుతున్నారు.

ఇన్ని రోజులూ ఏం చేశారు? ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు కనీసం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించలేకపోయారే? పార్టీలో మీ పలుకుబడి ఇదేనా? సీఎంగా చేయాల్సిన సమయంలో చేయకుండా ఇప్పుడు మాట్లాడితే ఉపయోగం ఏమిటి? సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎం, పిీసీసీ అధ్యక్షులను నాలుగైదుసార్లు పిలిపించి మాట్లాడారు. అప్పుడే ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పినా వినకపోతే అప్పుడే బయటకొచ్చి చెప్పాల్సింది. ఆ రోజు సహకరిస్తామని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగులు చేసుకొని పార్టీ అధిష్ఠానమే కుట్రలకు పాల్పడుతోందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా? ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రత మండలి సమావేశంలో నేను రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తుంటే మైక్ కట్ చేశారు.

నిరసనగా వాకౌట్ చేశాను. అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి కనీసం నోరు తెరిచారా? రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పి వచ్చారు. ఢిల్లీలో సోనియా ముందు మాట్లాడటానికి భయం. ఇక్కడికి వచ్చి లీకులు. నేను సీనియర్ రాజకీయవేత్తగా చేయాల్సింది చిత్తశుద్ధితో చేస్తున్నాను. జాక్‌పాట్‌తో సీఎం పోస్టులోకి వచ్చిన వారు కూడా నా గురించి మాట్లాడితే ఎలా? మేం ఏనాడూ అధికారం కోసం లేం. మేం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సిన్సియర్‌గా చేశాం. ప్రజల్లో మా పట్ల ఉన్న మంచిని పోగొట్టడానికే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి' అని విమర్శించారు. కిరణ్ తానే మాట్లాడుతున్నారా లేక ఢిల్లీ పెద్దలు మాట్లాడిస్తున్నారా అన్నది తనకు తెలియదని ఈ సమయంలో ఏదైనా జరగవచ్చని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిచ్చుకైనా, ఎవరితో చేతులు కలపడానికైనా వెనకాడటం లేదని, ఆ పార్టీని ఇంటికి పంపితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఇందుకోసం తాను జాతీయ స్థాయిలో ఎవరెవరిని కలుపుకుంటానో ఇప్పుడే చెప్పలేన న్నారు. బీజేపీతో పొత్తుపై సమాధానం దాటవేశారు. దేశం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకొందని, దానికి కారణమైన కాంగ్రెస్ ఓటమికోసం అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. అక్టోబర్ 4 నుంచి మళ్లీ జిల్లాల పర్యటనకు వెళ్తున్నానని బాబు తెలిపారు.

'సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌ద్వారా బెయిలుపై వచ్చిన జగన్ కూడా విలువ కోల్పోయాడు. ప్రజల విశ్వాసం మనవైపే ఉంది. మీరు ప్రజల్లో ఉండి, బాగా పనిచేయండి. వారి నమ్మకాన్ని నిల బెట్టుకుందాం' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం ఆయన తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడారు.

ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా?


విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని బహిరంగంగా ధిక్కరిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కిరణ్‌పై ఎందుకు మౌనం వహిస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ తామే ఇస్తున్నట్లు ఇక్కడ ప్రచారం చేస్తూ తామే అడ్డుకుంటున్నట్లు సీమాంధ్రలో ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నారు' అని విమర్శించారు. 'సీఎం ప్రజలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న ఆయనపై చీటింగ్ కేసుపెట్టి అరెస్టు చేయాలి. ఆయన చెప్పే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోంది........

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని మైలవరం ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కార్యాలయంలో శనివారం టీడీపీ జిల్లా సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ, చిరంజీవి మాదిరిగానే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి దాసోహం అయ్యారన్నారు. ఫలితంగానే ఆయనకు బెయిలొచ్చిందని లోకం కోడై కూస్తోందన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టే సమైక్య సంగతులు చెబుతున్న జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలసి పోవడం ఖాయమన్నారు.

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది............

దేశంలో జరుగుతున్న ప్రతి దుష్పరిణామానికీ ప్రధాని మన్‌మోహన్, యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధిలే బాధ్యులు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌కు ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగరాదనితీవ్రంగా విమర్శించారు. ఆయన ఇక పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిది అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశం ఎంతో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ను విడిపించడంలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించి బెదిరిస్తారని, తర్వాత వారి పబ్బం గడుపుకుంటారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులే తమ అగ్ర నాయకత్వం జగన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని వారే చెబుతున్నారని ఆయన అన్నారు.
నేషనల్ ఇంటెగ్రేషన్ సమావేశంలో నేను రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తే కాంగ్రెస్ గాని, ముఖ్యమంత్రి గాని ఆ రోజున తమను మాట్లాడనివ్వలేదని, ఆరోజున మాట్లాడింది సొంత సమస్య కాదని ఆయన చెప్పారు. ఆ రోజున తాను మాట్లాడింది ముఖ్యమైన విషయం కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు తాను మాట్లాడితే మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి తానే గుర్తించినట్టు మాట్లాడుతూన్నారని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అన్ని విధాలా నిర్వీర్యం చేస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వ శక్తులు ఒడ్డి ఆ ఉద్యమాన్ని నీరుగార్చారంటూ అన్నా హజారే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేర చరితుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, దానికి తూట్లు పొడిచేందుకు యత్నిస్తున్నారు. అవినీతిపరులను, నేరచరితులను కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయింది. గనులు, మద్యం అన్నీ మాఫియాగా తయారైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఈరోజున సీబీఐని కూడా పాడుచేశారు. సీబీఐని కూడా ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆకస్మికంగా నిద్ర లేచి, అటువంటిది రాహుల్ ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. రూపాయి విలువ పడిపోయింది, ధరలు పడిపోయాయి, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ఈ మొత్తానికి ప్రధాని మన్‌మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. ఆ రోజున సోనియా చెబితే చేశారు, ఇప్పుడు రాహుల్ ఒక మాట మాట్లాడితే ఇండియాకు వచ్చాక మాట్లాడతాను అంటున్నారు. అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని ఆయన చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
నేర చరిత్ర గలవారిని కాపాడడంకోసం చేసిన ఆర్డినెన్స్‌ను ఇప్పుడు రాహుల్ ఆక్షేపించడాన్ని ఆయన ఆక్షేపించారు. నేర చరితులు ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలులేదని మేము స్పష్టం చేశాం. నేను చాలా రోజుల నుంచి ఈ విషయమే చెబుతున్నాను, అయినా
పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ వ్యతిరేకించిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని అడుగుతున్నా. రాహుల్ గాంధి ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదు? ఎక్కడ నిద్ర పోతున్నారు? ఈ బిల్లుపై ఇంత చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి బిల్లును చింపేయాలని ఆయన అంటున్నాడేమిటని ఆయన ఆక్షేపించారు. మీ వల్ల దేశం మొత్తం భ్రష్టు పట్టించారు, సర్వనాశనం అయిపోయింది. నేరస్థులు జైలులో ఉంటే వారు కూడా పోటీ చేసి చట్ట సభలలోకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, 15 లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగింది. కోల్ గేట్, 2 జి స్పెక్ట్రమ్, రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన కుంభకోణం. వీటన్నిటిపైనా రాహుల్ ఎప్పుడైనా మాట్లాడారాఇన్నాళ్లుగా మాఫియాలు దోచుకుంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇలాగే రాబర్ట్ వాధ్రా చేసిన కుంభకోణాలు... దాదాపు 11 వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగినట్టు ఆయనమీద ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఇన్ని రకాల కుంభకోణాలు చేస్తుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
నెగటివ్ వోటు పెట్టమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇష్టం లేని అభ్యర్థులను ప్రజలు త్రోసిపుచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. సమాజంలో మాఫియాలు తయారయ్యాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పెద్ద ఎత్తున డబ్బు వస్తోంది. దీన్ని అరికట్టాలి. మీరు సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి చట్టసభలను బలోపేతం చేయవలసింది పోయి దానికి తూట్ల పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.

అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా?

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే కాంగ్రెస్సే అని, సీఎం కిరణ్‌ను హైకమాండ్ నడిపిస్తోందని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇరుప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సీఎంపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు రోశయ్యతో ఈనాడు కిరణ్‌తో కాంగ్రెస్ డ్రామాలాడిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే సీఎం కిరణ్, బొత్సలను బహిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా ..........