April 20, 2013

దూకుడుగా వ్యవహరించాలని యోచన
కృష్ణా జిల్లా వైపు చూపు.. గన్నవరంపై ఆరా
హరికృష్ణ వస్తే దాసరి సోదరులు స్వాగతించే అవకాశం
టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

  విజయవాడ క్రియాశీల రాజకీయాలలో ఇకపై దూకుడుగా వ్యవహరించాలని నందమూరి హరికృష్ణ భావిస్తున్నారు. దీనికి తన తండ్రి ఎన్టీఆర్ పురిటిగడ్డ అయిన కృష్ణా జిల్లాను కేంద్రంగా చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. జిల్లా నుంచి పోటీ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గన్నవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై తన ఆంతరంగికుల ద్వారా హరికృష్ణ ఆరా తీస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ కూడా కొద్దికాలంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తరచూ కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. తాజాగా హరికృష్ణ కూడా కృష్ణా జిల్లాపై దృష్టిసారించడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం దాసరి బాలవర్థనరావు ఉన్నారు. ఆయన మూడు దఫాలుగా గన్నవరం స్థానం నుంచి పోటీ చేయగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సారి గన్నవరం స్థానం నుంచి బాలవర్థనరావు పోటీ చేస్తారా ? వల్లభనేని వంశీకి కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది. బాలవర్థనరావుకు గన్నవరం సీటు ఇవ్వటానికి మొదట్లో గద్దే రామమోహన్‌కు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన గెలిచారు. ఆ తర్వాత 2009లో వల్లభనేని వంశీమోహన్ పోటీకి రావటంతో.. ఆయనను కూడా ఆ ఎన్నికలలో విజయవాడ ఎంపీగా పోటీ చేయించారు.

గద్దే రామ్మోహన్‌ను విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయించారు. స్వల్ప తేడాతో వంశీ ఓడిపోయారు. ఆ తర్వాత అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీని ఎన్నుకున్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, కేశినేని నానిని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. అర్బన్ టీడీపీ నూతన అధ్యక్షుడిగా నాగుల్‌మీరాకు అవకాశమిచ్చారు. దీంతో అటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగాను, ఇటు అర్బన్ టీడీపీ అధ్యక్షుడి పదవులను వంశీ కోల్పోవాల్సి వచ్చింది. గన్నవరం సీటు ఇచ్చే హామీ మీద వంశీని తప్పించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వంశీకి ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు.

తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గద్దే రామమోహన్ కూడా ఇదే సమయంలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిసి విజయవాడ ఎంపీ సీటు కావాలని తన మనసులోని కోరికను బయట పెట్టారు. ఎంపీ సీటు విషయమై చంద్రబాబు హామీ అయితే ఇవ్వలేదు కానీ, గన్నవరం, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్తగా హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయటానికి ఆరా తీయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలున్న ఫ్లెక్సీలను వైసీపీ నేతలు షర్మిల పాదయాత్రలో ప్రదర్శించటం, దానిపై టీడీపీలో వివాదాలు చోటుచేసుకోవడం తెలిసిందే.

తన ఫొటోలను వైసీపీ నేతలు వాడడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలని, లేనిపక్షంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో బాలకృష్ణ హెచ్చరించారు. ఆ తరువాత హరికృష్ణ తన సోదరుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.ఈ పరిస్థితులలో హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారం జిల్లాలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తనకు అత్యంత సన్నిహితుడైన వంశీ మోహన్ గన్నవరం నుంచి రంగంలో ఉండటంతో, ఆ స్థానం నుంచి తన తండ్రి పోటీ చేయటానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరిస్తారా ? లేదా ? అన్నదానిపై కూడా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా నందమూరి కుటుంబంలో జరుగుతున్న తాజా పరిణామాలు టీడీపీలో కలవరాన్ని కలిగిస్తున్నాయి.

బరిలోకి హరికృష్ణ..!తండ్రి పోటీకి జూనియర్ అంగీకరిస్తారా?

హైదరాబాద్: కృష్ణాజిల్లా అవనిగడ్డ టీడీపీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య (75) అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తను కన్నుమూశారు. తను గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.2009లో అవ నిగడ్డ ఎమ్మెల్యేగా నెగ్గిన అంబటి బ్రాహ్మణయ్య. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ విషాదంలో మునిగిపోయారు

టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూత

కలత చెందిన మనసుతో నడక మొదలుపెట్టాను. దండలు వేయాలని.. కిరీటాలు పెట్టాలని.. జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని ఎందరో తరలివచ్చారు. వారందరిని నిరాశ పరచడం నాకూ ఇష్టం లేదు. కానీ, ఆడపిల్లపై చెయ్యివేసే వాళ్లకు అరదండాలు పడేదాకా.. నా ఆడపడుచు తలపై కిరీటం పెట్టేదాకా.. చిన్నారి పాపలకు శుభం పూసేదాకా.. ఎవరికైనా వేడుక ఎక్కడిది? ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతూ సంతోషంగా ఉండాలంటే వీలయ్యే పనేనా? మా నేతలు అర్థం చేసుకున్నారు.

ఈ సందర్భాన్ని నా కార్యకర్తలు మరింత ప్రజా సేవకు వినియోగించారు. ఆవేదనతో ఉన్న నాకు ఊరట కలిగిస్తున్న విషయాలివి. కానీ, 'నిర్భయ' ఉదంతం మరిచిపోదామని మనమెంత ప్రయత్నించినా.. పాలకులు మరవనిస్తారా? ఏ అత్యాచార ఘటన నుంచీ వీళ్లు గుణపాఠం నేర్చుకోరు. ఎం

విద్యా హక్కు చట్టం ఉంది... నిర్బంధ విద్యా విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల వసతులతో విద్యార్థికి చదువు అందించాలని అవి చెబుతున్నాయి. కానీ, నల్లబోర్డులు, కూర్చొనే బల్లలు వంటి కనీస వసతులు లేని పాఠశాలలు కూడా ఉన్నాయనే విషయం కన్నూరుపాలెంలోని ఆ బడిని చూసేదాకా నేనూ నమ్మలేకపోయాను. ఇప్పటికీ వానాకాలం చదువులే! చెట్టు కిందనే పాఠాలు! గట్టిగా గాలి కొడితే టీచర్ల నుంచి విద్యార్థుల దాకా ఇళ్లకు పరుగులు పెట్టాల్సిందే! ఏం విద్యావిధానం? ఎల్‌కేజీలోనే కంప్యూటర్లు అందిస్తామంటూ ఆర్భాటం చేసే పెద్ద మనుషులు ఈ ఊళ్లోకి వచ్చి ధైర్యంగా ఆ మాట చెప్పగలరా?
తో గొప్పగా తీసుకొచ్చిన నిర్భయ చట్టం సైతం ఈ దుర్మార్గులకు కళ్లెం వేయలేకపోతున్నది. చట్టం పదును పెంచే చొరవ ఈ పాలకులకు లేదు. ఎక్కడో ఢిల్లీ.. ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఒక్కరోజులో నలుగురిపై అత్యాచారాలా?! సిగ్గు.. సిగ్గు..!

'నిర్భయ'లను ఆదుకునేదెలా!:చంద్రబాబు

హైదరాబాద్

కాగా, ఢిల్లీ ఘటనపై టీడీపీ ఎంపీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, చంద్రబాబు 64వ జన్మదిన వేడుకలు కన్నూరుపాలెం గ్రామంలో సాదాసీదాగా జరిగాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు తెచ్చిన పూలమాలలు, బొకేలు, బహుమతులను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
: చంద్రబాబు పుట్టినరోజుని పురస్కరించుకొని ఎన్టీఆర్ భవన్‌లో తలపెట్టిన జన్మదిన వేడుకలను రద్దు చేశారు. వేడుకల కోసం నేతలు తీసుకొచ్చిన ఐదారు పెద్ద పెద్ద కేకులను వెనక్కి పంపేశారు. 'ఢిల్లీలో జరిగిన అమానుష ఘటనకు చంద్రబాబు చాలా బాధపడ్డారు. ప్రజల హృదయం రగులుతున్న ఈ సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని ఆయన భావించారు. వాటిని రద్దు చేయాలని ఆదేశించారు' అని కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దనరావు చెప్పారు.

జన్మదిన వేడుకలు రద్దు

అప్పట్లో మౌనంగా ఉండి ఇప్పుడు రగడా?
టీఆర్ఎస్‌పై చంద్రబాబు ధ్వజం



"కళంకిత మంత్రులపై ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స చివరికి ఏం తేల్చారు?'' అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా చాలామంది 'ఏ- 4' లు ఉన్నారన్నారు. వైఎస్ పాలనతో నష్టపోయింది కాంగ్రెస్ కాదు..ప్రజలని చెప్పారు. అంతులేని అవినీతికి పాల్పడి జైలులో కూర్చున్న వారికి అనుకూలంగా మేం మాట్లాడాలా అని జి.భీమవరం సభలో జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగానే తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించి అత్యాచారాలను నిరోధిస్తామని భరోసా ఇచ్చారు. "ఢిల్లీ యువతిపై అత్యాచారం జరిగి రెండు నెలలు కాకముందే ఆ నగరంలోనే ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం దారుణం. అక్కడ పోలీసులు, అధికారులు ఎంత హేయంగా ప్రవర్తించారనేది తలుచుకుంటే దుఖం వస్తున్నది'' అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆడపిల్లలను చదివించాలని కోరారు.

"నా కోడలిని ఆరేళ్లుగా చదివిస్తున్నాను. ఆడపిల్లలను ఎంతగా చదివిస్తే అంతగా ఆ ఇంటి గౌరవం పెరుగుతుంది'' అని పేర్కొన్నారు. కులవృత్తుల వారికి 'ఆదరణ' కింద ఆధునిక పరికరాలు అందించామని, మళ్లీ అధికారంలోకి వస్తే అంతకంటే మంచి పథకాలు అందిస్తామని తనను కలిసిన విశ్వబ్రాహ్మణ, రజక, నాయీబ్రాహ్మ ణ, కుమ్మర్ల సంఘం ప్రతినిధులకు చంద్రబాబు హామీ ఇచ్చా రు. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానాన్ని ఎవరో రచయిత అపహాస్యం చేయగా, సీఎం ఆ చర్యను సమర్థించారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే కులవృత్తుల వా రికి కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 64 ఏళ్ల వయసులో.. 2750 కిలోమీటర్లు నడిచి ఇప్పుడిలా ప్రజల వెంట ఉండగలగడం సంతోషంగా ఉన్నదని భావోద్వేగంతో పలికారు.
విశాఖపట్నం/కశింకోట : 'వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లుడికి లక్షా 46 వేల ఎకరాల గనులను కట్నంగా ధారాదత్తం చేశారు. ఆయన నుంచి సూట్‌కేసులందుకున్న ఓ ఫామ్ హౌస్ పార్టీ అప్పట్లో మౌనం వహించింది. ఇప్పుడేమో బయ్యారంపై యాగీ చేస్తున్నది'' అని టీఆర్ఎస్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గంలోని కళంకితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం కన్నూరుపాలెంలో శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పుట్టిన రోజు సందర్భంగా.. తనను కలిసేందుకు వచ్చిన నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. బయ్యారం గనులపై తొలి నుంచీ రాజీ లేని పోరాటం చేసింది తమ పార్టీయేనని గుర్తు చేశారు. ఎక్కడ గనులుంటే అక్కడే స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని టీడీపీ గతంలోనే ప్రతిపాదించిందని కొత్తూరు జంక్షన్‌లో జరిగిన సభలో గుర్తుచేశారు. ఖనిజ సంపద ప్రజలకు ఉపయోగపడాలి తప్ప, దోపిడీదారులకు కాదని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న మంత్రులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కన్నూరుపాలెం సభలో కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.

ఫామ్‌హౌస్ పార్టీకి సూట్‌కేసులు! బయ్యారంపై నోటుతో నోరు మూయించిన వైఎస్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో తెలంగాణ టీడీపీ నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. బయ్యారం గనుల జీవోను వెనక్కు తీసుకోవాలని నేతలు వినతి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీకి డిమాండ్ చేశామని,

దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. బయ్యారం గనుల నుంచి ఒక్క తట్ట ఖనిజాన్ని తరలించినా సహించేది లేదని హెచ్చరించారు. బయ్యారంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడకుండా ఉన్నారని టీ.టీడీపీ నేతలు ప్రశ్నించారు.

సీఎం కిరణ్‌కు కలిసిన టి.టీడీపీ నేతలు

హైదరాబాద్ : మహిళలపై దాడులను అరికట్టడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నటుడు బాలకృష్ణ ఆరోపించారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలోనే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలను కాపాడుకోవడంలో తప్ప శాంతిభద్రతల విషయంలో శ్రద్ధ చూపడం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

మహిళా సీఎం ఉన్న రాష్ట్రాంలోనే అత్యాచారాలు : బాలకృష్ణ