April 20, 2013

ఫామ్‌హౌస్ పార్టీకి సూట్‌కేసులు! బయ్యారంపై నోటుతో నోరు మూయించిన వైఎస్

అప్పట్లో మౌనంగా ఉండి ఇప్పుడు రగడా?
టీఆర్ఎస్‌పై చంద్రబాబు ధ్వజం



"కళంకిత మంత్రులపై ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స చివరికి ఏం తేల్చారు?'' అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా చాలామంది 'ఏ- 4' లు ఉన్నారన్నారు. వైఎస్ పాలనతో నష్టపోయింది కాంగ్రెస్ కాదు..ప్రజలని చెప్పారు. అంతులేని అవినీతికి పాల్పడి జైలులో కూర్చున్న వారికి అనుకూలంగా మేం మాట్లాడాలా అని జి.భీమవరం సభలో జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగానే తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించి అత్యాచారాలను నిరోధిస్తామని భరోసా ఇచ్చారు. "ఢిల్లీ యువతిపై అత్యాచారం జరిగి రెండు నెలలు కాకముందే ఆ నగరంలోనే ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం దారుణం. అక్కడ పోలీసులు, అధికారులు ఎంత హేయంగా ప్రవర్తించారనేది తలుచుకుంటే దుఖం వస్తున్నది'' అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆడపిల్లలను చదివించాలని కోరారు.

"నా కోడలిని ఆరేళ్లుగా చదివిస్తున్నాను. ఆడపిల్లలను ఎంతగా చదివిస్తే అంతగా ఆ ఇంటి గౌరవం పెరుగుతుంది'' అని పేర్కొన్నారు. కులవృత్తుల వారికి 'ఆదరణ' కింద ఆధునిక పరికరాలు అందించామని, మళ్లీ అధికారంలోకి వస్తే అంతకంటే మంచి పథకాలు అందిస్తామని తనను కలిసిన విశ్వబ్రాహ్మణ, రజక, నాయీబ్రాహ్మ ణ, కుమ్మర్ల సంఘం ప్రతినిధులకు చంద్రబాబు హామీ ఇచ్చా రు. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానాన్ని ఎవరో రచయిత అపహాస్యం చేయగా, సీఎం ఆ చర్యను సమర్థించారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే కులవృత్తుల వా రికి కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 64 ఏళ్ల వయసులో.. 2750 కిలోమీటర్లు నడిచి ఇప్పుడిలా ప్రజల వెంట ఉండగలగడం సంతోషంగా ఉన్నదని భావోద్వేగంతో పలికారు.
విశాఖపట్నం/కశింకోట : 'వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లుడికి లక్షా 46 వేల ఎకరాల గనులను కట్నంగా ధారాదత్తం చేశారు. ఆయన నుంచి సూట్‌కేసులందుకున్న ఓ ఫామ్ హౌస్ పార్టీ అప్పట్లో మౌనం వహించింది. ఇప్పుడేమో బయ్యారంపై యాగీ చేస్తున్నది'' అని టీఆర్ఎస్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గంలోని కళంకితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలం కన్నూరుపాలెంలో శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పుట్టిన రోజు సందర్భంగా.. తనను కలిసేందుకు వచ్చిన నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. బయ్యారం గనులపై తొలి నుంచీ రాజీ లేని పోరాటం చేసింది తమ పార్టీయేనని గుర్తు చేశారు. ఎక్కడ గనులుంటే అక్కడే స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని టీడీపీ గతంలోనే ప్రతిపాదించిందని కొత్తూరు జంక్షన్‌లో జరిగిన సభలో గుర్తుచేశారు. ఖనిజ సంపద ప్రజలకు ఉపయోగపడాలి తప్ప, దోపిడీదారులకు కాదని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న మంత్రులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కన్నూరుపాలెం సభలో కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.