July 15, 2013

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత తొమ్మిదేళ్లలో ఛిన్నాభిన్నం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శిం చారు. లక్షల కోట్ల అవినీతి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను మింగేసిందని ఆయన సోమవారంనాడొక ప్రకటనలో ఆరోపించారు. ముగ్గురు మంత్రులు నాయకత్వం వహించినా ఆర్థిక వ్యవస్థ 2007-08 నుండి మరింత సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు. 1999-2004 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ప్రభావం 2006-07 వరకు కొనసాగిందన్నారు. 2004-05 నుండి 2006-07 వరకు వృద్ధిరేటు బాగానే ఉందన్నారు. రెండో సారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల సగటు కేంద్రం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమన్నారు.

సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు వాస్తవాలను మరుగు పరిచి, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే రాష్ట్రం పరిస్థితి బాగుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2009-13 మధ్య నాలుగేళ్ల సగటును పరిశీలిస్తే జీడీపీ 7.3 శాతం ఉండగా, జీఎస్‌డీపీ 6.8 శాతం మాత్రమే ఉందన్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 14 శాతం ఉండగా రాష్ట్రంలో 13. 7 శాతం ఉందన్నారు. వైఎస్‌ హయాంలో, తర్వాత సీఎంల పాలనలో సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి సమిష్టి లబ్దిని గాలికొదిలేసినందుకే రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం అయిందన్నారు. లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు లక్ష కోట్ల బడ్జెట్‌ను మింగేశాయని విమర్శించారు. వైఎస్‌ పాలనలో జరిగిన అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోకుండా తరువాత ముఖమంత్రులు కూడా అదే దారిలో నడవడంతో వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సకాలంలో వర్షాలు పడినా, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్‌ కోతల వల్ల ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 19 శాతం నాట్లు తక్కువ పడడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రం ఉత్పత్తి తగ్గిపోయి వ్యవసాయాభివృద్ధి లేనప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్సే : యనమల

అన్ని పార్టీలు సాధారణ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌ను తయారు చేసుకుని అమలు చేసే పనిలో పడ్డాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆరాటపడుతున్న బాబు ఎన్నికలు వచ్చేంత వరకు జనం మధ్యలో వుండాలని నిర్ణయించు కున్నారు. ఇంతకు ముందు గత ఏడాది అక్టోబర్ 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 27 వరకు 20 రోజుల పాటు 2340 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రను మోకాలు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ విజయవంతంగా పూర్తిచేసిన బాబు, మలి విడతలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్రతో పార్టీకి నూతన జవసత్వాలు అందించినట్టుగా ఇమేజ్ రావడంతో ఆ ఒరవడినికొన సాగించాలని భావిస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలను చుట్టుముట్టారు. మలివిడతగా చేపట్టే బస్సు యాత్రలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు అసంతపృత్తిగా వున్నారని, వైకాపా పట్ల కూడా ప్రజలు ఇదివరకటి అభిప్రాయాన్ని మార్చుకున్నారని, ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీవైపు తిరిగి మొగ్గు చూపుతున్నారని గట్టిగా నమ్ముతున్న చంద్రబాబు బస్సు యాత్రను కూడా ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. నిరంతరమూ ప్రజల మధ్య వుండి, వారి సమస్యల కోసం పనిచేస్తుంటే, ఆదరిస్తారనేది బాబు నమ్మకం. ప్రజలు రాష్ర్టంలో సుస్థిర పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నమ్ముతున్న బాబు అది అందించే సత్తా ఒక తెలుగుదేశం పారీే్టక వుందని ప్రజల్లోకి వెళ్ళి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నా, పార్టీకి గ్రామ, పట్టణ స్థాయిల్లో వున్న పటిష్టమైన శ్రేణీ వ్యవస్థ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని, కార్యకర్తల బలం, ప్రజల అభిమానంతో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేది ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ విశ్వాసంతో వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆగస్టు మొదటి వారంలో ... చంద్రన్న బస్సుయాత్ర

కొమరవోలు పంచాయతీలో పోటీ రసవత్తరం (కృష్ణా కెఎన్‌ఎన్‌ బ్యూరో) సినీహీరో నందమూరి బాలకృష్ణ మేనమామ కుమారుడి భార్య వరుసకు చెల్లెలు పొట్లూరి క్రిష్ణ కుమారి శనివారం కొమరవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికోసం నామినేషన్‌ వేశారు. దీంతో ఆ పంచాయతీలో పోటీ రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున అంటే ఆ పార్టీ మద్దతుతో పోటీచేశారు. పార్టీలు నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనక పోయినా, పరోక్షంగా పార్టీలే ఎన్నికల్లో తలపడతాయన్న విషయం తెలిసిందే. అయితే పామర్రు మండల పరిధిలోని కొమరఓలు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామం స్వర్గీయ ఎన్‌టిరామారావు అత్తవారి ఊరు అది. బాలక్రిష్ణ అమ్మమ్మ వారి సొంత గ్రామం నుంచి పొట్లూరి క్రిష్ణకుమారి పోటీచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ పంచాయతీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. బాలయ్య బంధువు రంగంలో ఉండడంతో టిడిపి ఆ పంచాయతీ గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది. బాలయ్య కూడా ఏదో ఒక సమయంలో ఆ గ్రామాన్ని ఈ ఎన్నికల లోపు సందర్శించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

బాలయ్య సోదరి నామినేషన్‌..

రాజమండ్రిలోని బొమ్మూరి సెంటర్‌లో గల ఎన్టీఆర్ విగ్రహంపై కొందరు గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చేతిని దుండగులు విరగొట్టారు. దుండగుల దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం స్థానికులు ఆందోళనకు దిగారు.

ఎన్టీఆర్ విగ్రహంపై దాడి

ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.6 నుండి 524.25 అడుగులకు పెంచుతామని, ఇందుకోసం నిధులు కేటాయించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్నాటక అసెంబ్లీలో స్పష్టంగా ప్ర టిం చారని, అదే జరిగితే కృష్ణాడెల్టా ఎడారవుతుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్యామ్‌ ఎత్తు ఐదు అడుగులు పెంచటం వల్ల ఈ ప్రాం తంలోని 22 ఎకరాలు ఎండిపోయే అవకాశం ఉందన్నారు. కృష్ణాడెల్టాలో నారు మళ్ళు సెప్టెంబరు,అక్టోబరు మాసంలో వేయాల్సిన దుస్ధితి రానుందని ఆయన జోస్యం చెప్పారు.

వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞానికి రూ.80 వేల కోట్లు ఖర్చుచేవారని, కనీసం 8 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి ఈ జలయజ్ఞం అవినీతే పరాకాష్ట అని ఉమా విమర్శించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరపున సరైన వాదనలు వినిపించకపోవడంతో 2012లో తీర్పు ఏకపక్షంగా వచ్చిం దన్నారు. అఖిల పక్షంలో మేమందరం ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా ఎస్‌ఎల్‌పి వేశామని,ఈ 2013లో జడ్జిమెంట్‌ వస్తుందని పాలకపక్షం నేతలు హామీ ఇచ్చా రని గుర్తు చేశారు. అప్పటి వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ముఖ్య మంత్రి ఎం పీలతో కలసి ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని, చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 524 అడుగులు పెంచడానికి ప్రయత్నం చేస్తే న్యాయపోరా టం ద్వారా ఆపామన్నారు.

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున 33 మంది ఎంపీలు ఏమీ చేస్తున్నారని ఉమా ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యా యం జరగబోతుంటే ముఖ్యమంత్రి డిల్లీలో కూర్చుని నోరు మెదపటం లేదని విమర్శించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం బీడులుగా మారే ప్రమాదం ఉం దని, దీనిపై పంచాయతీ ఎన్నికల అనంతరం ఆగస్టు నెలలో రైతులతో కలసి టిడిపి పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమం చేపడుతుందని హెచ్చరించారు. అరెస్టు లకు కూడా భయపడమని,ప్రాణ త్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. దీని మీద మంత్రి సారధి, ఎంపీ రాజగోపాల్‌, ముఖ్యమంత్రి స్పందించాలని, ఆల్మట్టి ఎత్తును పెంపుదల ఆపాలని డిమాండ్‌ చేశారు. సమా వేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా డెల్టా ఎడారే!

కాంబల్లె సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు ఏకగ్రీవం

వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఆరంగేట్రం తర్వాత ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని ఏ పంచాయతీలోనూ టీడీపీ విజయం సాధించలేదు. దశాబ్దం కిందట వేంపల్లె మండలంలో ఓ పంచాయతీ కందుల శివానందరెడ్డి వర్గీయులు గెలుచుకున్న తర్వాత టీడీపీకి గెలుపు సొంతం కాలేదు. అయితే తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. సింహాద్రిపురం మండలం కాంబల్లె పంచాయతీ సర్పంచిగా టీడీ పీ బలపర్చిన అభ్యర్థి భూమిరెడ్డి ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఉమాదేవి ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఈమేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉమాదేవి.. తెలుగు యు వత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి సతీమణి కావడం, ఆయన స్వగ్రామం కాంబల్లె కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ పంచాయతీలోని ఎనిమిది వా ర్డుల్లో టీడీపీ మద్దతుదారులుగా మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వారంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంబల్లె గ్రామాభివృద్ధికి రాంగోపాల్‌రెడ్డి విశే ష కృషి చేశారు. గ్రామంలో రాంగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కారణంగా వార్డు సభ్యులుగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదు.

పులివెందులలో టీడీపీ పాగా

సీబీఎస్ఈ, సీఎస్ఏబీ, జేఈఈ చైర్మన్‌లకు చంద్రబాబు లేఖలు
ఐఐటీ ప్రవేశ పరీక్షలపై కేంద్రం తెచ్చిన కొత్తవిధానం వల్ల రాష్ట్ర విద్యార్థు లు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర విద్యార్థులలో ప్రతిభ ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, సీఎఫ్‌టీఐ వంటి సం స్థల్లో కేంద్రం కొత్త విధానంతో ప్రవేశార్హతను కోల్పోతున్నారని మండిపడ్డారు. సీబీఎస్ఈ, సీఎస్ఏబీ, జేఈఈ చైర్మన్లకు, సీబీఎస్ఈ-జేఈఈ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఆదివారం ఆయన లేఖలు రాశారు. ఎన్ఐటీల్లో 2,500, ఐఐటీల్లో 1,500 సీట్ల వంతున ఏపీ విద్యార్థులు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

ఐఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐ ప్రవే శాల్లో జరిగిన ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. కొత్త విధానం కారణంగా రాష్ట్రానికి చెందిన పెద్ద సంఖ్యలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఐఐటీ(అడ్వాన్స్‌డ్) పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ, ప్లస్ టూ పరీక్షలకు సంబంధించి వెయిటేజీ మార్కుల నిబంధన కారణంగా ఐఐటీల్లో ప్రవేశాన్ని పొందే అవకాశాలు మూసుకుపోయినందున విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అభ్యర్థుల ఎంపికకు జేఈఈ మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలని, 2012 వరకు కొనసాగిన ఇదే విధానంలో ఎటువంటి లోటుపాట్లు లేవని తెలిపారు. జేఈఈ(మెయిన్స్)కు సంబంధించి ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం మేరకు వెయిటేజీ ఇవ్వాలన్న కొత్త నిబంధన కారణంగా ఇటు రాష్ట్రానికి చెందిన విద్యార్థులలో అయోమయం నెలకొనడంతోపాటు రాష్ట్రాల మధ్య అంతరాలు సైతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

జేఈఈ(అడ్వాన్స్‌డ్)కు సంబంధించి కూడా ఇంటర్మీడియెట్/ప్లస్ టూల్లోని కట్ ఆఫ్ మార్కుల విషయానికొస్తే త్రిపుర రాష్ట్రంలో 53 శాతం ఉండగా, మహారాష్ట్రలో 68 శాతంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 91.89 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో జేఈఈ(అడ్వాన్స్‌డ్, మెయిన్స్) పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌టీఐ, ఐఐటీల్లో మాత్రం ప్రవేశాన్ని పొందలేని పరిస్థితులేర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎన్ఐటీల్లో 2,500 సీట్లను, ఐఐటీల్లో 1,500 సీట్లను కోల్పోతున్నట్లుగా తెలుస్తోందని చంద్రబాబు తన లేఖలో వెల్లడించారు.

జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి యూపీఎస్సీ పరీక్షల్లో సైతం ఆయా ప్రవేశపరీక్షల్లో వచ్చే మార్కుల ప్రాతిపదికపైనే అభ్యర్థులకు అవకాశముంటుంది తప్ప క్వాలిఫైయింగ్ పరీక్షల మార్కులకు వెయిటేజీ లేదన్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. మరి జేఈఈ(మెయిన్స్, అడ్వాన్స్‌డ్) పరీక్షలకు మాత్రం ఇంటర్ లేదా ప్లస్ టూ వెయిటేజీ ఎందుకని ప్రశ్నించారు. కొత్త విధానాన్ని రద్దు చేయాలని, జేఈఈ(మెయిన్స్, అడ్వాన్స్‌డ్) పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రాతిపదికనే సీట్లను కేటాయించాలని చంద్రబాబు కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు న్యాయం చేయండి