July 15, 2013

ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా డెల్టా ఎడారే!

ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.6 నుండి 524.25 అడుగులకు పెంచుతామని, ఇందుకోసం నిధులు కేటాయించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్నాటక అసెంబ్లీలో స్పష్టంగా ప్ర టిం చారని, అదే జరిగితే కృష్ణాడెల్టా ఎడారవుతుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్యామ్‌ ఎత్తు ఐదు అడుగులు పెంచటం వల్ల ఈ ప్రాం తంలోని 22 ఎకరాలు ఎండిపోయే అవకాశం ఉందన్నారు. కృష్ణాడెల్టాలో నారు మళ్ళు సెప్టెంబరు,అక్టోబరు మాసంలో వేయాల్సిన దుస్ధితి రానుందని ఆయన జోస్యం చెప్పారు.

వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞానికి రూ.80 వేల కోట్లు ఖర్చుచేవారని, కనీసం 8 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి ఈ జలయజ్ఞం అవినీతే పరాకాష్ట అని ఉమా విమర్శించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరపున సరైన వాదనలు వినిపించకపోవడంతో 2012లో తీర్పు ఏకపక్షంగా వచ్చిం దన్నారు. అఖిల పక్షంలో మేమందరం ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా ఎస్‌ఎల్‌పి వేశామని,ఈ 2013లో జడ్జిమెంట్‌ వస్తుందని పాలకపక్షం నేతలు హామీ ఇచ్చా రని గుర్తు చేశారు. అప్పటి వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ముఖ్య మంత్రి ఎం పీలతో కలసి ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని, చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 524 అడుగులు పెంచడానికి ప్రయత్నం చేస్తే న్యాయపోరా టం ద్వారా ఆపామన్నారు.

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున 33 మంది ఎంపీలు ఏమీ చేస్తున్నారని ఉమా ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యా యం జరగబోతుంటే ముఖ్యమంత్రి డిల్లీలో కూర్చుని నోరు మెదపటం లేదని విమర్శించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం బీడులుగా మారే ప్రమాదం ఉం దని, దీనిపై పంచాయతీ ఎన్నికల అనంతరం ఆగస్టు నెలలో రైతులతో కలసి టిడిపి పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమం చేపడుతుందని హెచ్చరించారు. అరెస్టు లకు కూడా భయపడమని,ప్రాణ త్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. దీని మీద మంత్రి సారధి, ఎంపీ రాజగోపాల్‌, ముఖ్యమంత్రి స్పందించాలని, ఆల్మట్టి ఎత్తును పెంపుదల ఆపాలని డిమాండ్‌ చేశారు. సమా వేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.