July 15, 2013

పులివెందులలో టీడీపీ పాగా

కాంబల్లె సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు ఏకగ్రీవం

వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఆరంగేట్రం తర్వాత ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని ఏ పంచాయతీలోనూ టీడీపీ విజయం సాధించలేదు. దశాబ్దం కిందట వేంపల్లె మండలంలో ఓ పంచాయతీ కందుల శివానందరెడ్డి వర్గీయులు గెలుచుకున్న తర్వాత టీడీపీకి గెలుపు సొంతం కాలేదు. అయితే తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. సింహాద్రిపురం మండలం కాంబల్లె పంచాయతీ సర్పంచిగా టీడీ పీ బలపర్చిన అభ్యర్థి భూమిరెడ్డి ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఉమాదేవి ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఈమేరకు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉమాదేవి.. తెలుగు యు వత రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి సతీమణి కావడం, ఆయన స్వగ్రామం కాంబల్లె కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ఈ పంచాయతీలోని ఎనిమిది వా ర్డుల్లో టీడీపీ మద్దతుదారులుగా మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వారంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంబల్లె గ్రామాభివృద్ధికి రాంగోపాల్‌రెడ్డి విశే ష కృషి చేశారు. గ్రామంలో రాంగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కారణంగా వార్డు సభ్యులుగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి సైతం ఎవరూ ముందుకు రాలేదు.