July 5, 2013

 ప్రాంతీయ సదస్సులతో పంచాయితీ సమరానికి తెలుగుదేశంపార్టీ సన్నద్దమవు తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరు పతిలలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులు విజయవం తం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోం ది. శనివారం రంగారెడ్డిజిల్లా కొంపల్లిలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో 5వ ప్రాంతీయ సదస్సును విజయవంతంగా నిర్వ హించేందుకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ఈ సదస్సుకు పెద్దఎత్తున కార్యకర్తలను, అభిమానులను, సానుభూతిపరులను తరలించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన లో కొనసాగిన పంచాయితీలకు ఏడేళ్ల విరామం అనం తరం జరుగబోతున్న ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసేందుకు టీడీపీ నేతలు తమ వ్యూహాలకు పదను పెడు తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా అత్యధిక పంచాయితీ స్థానాలు కైవసం చేసుకోవడంద్వారా 2014లో జరగనున్న సాధా రణ ఎన్నికల్లో అధికారం తమదేనన్న భావన పార్టీ శ్రేణుల్లో కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయితీలు నిధులు లేక నిరసించిన వైనాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. తాగునీటి కోసం బోర్‌ వెల్‌ ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారులను కోరితే చం దాలు వేసుకుని బోర్‌వెల్‌ ఏర్పాటు చేసుకోవాలంటూ ఉచి త సలహాలిచ్చిన వైనాన్ని ఈసందర్భంగా ప్రజల ముందు ప్రస్తావించాలని పార్టీశ్రేణులకు నేతలు సూచిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఎదుర్కోన్న ఇబ్బందులు, మురికికాలువలను శుభ్రం చేసేందుకు కూడా నిధులు లేక ఇబ్బందులెదుర్కొన్న వైనాన్ని గుర్తుచేయాలంటున్నారు.

కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన స్థానిక సం స్థలను నిర్వీర్యం చేసిందనీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ సదస్సుల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల పురోగాభివృద్ధికి పెద్దపీ ట వేస్తే, కాంగ్రెస్‌ నిర్వీర్యం చేసిందని మండిపడుతున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెను వెంటనే ఎన్నికలను నిర్వహించి నిధులు, విధులు అప్పగిం చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఈనెల మూడవ తేదీన విశాఖలో టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించిన రోజే ఎన్నికల కమిషన్‌ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో తమకు కలిసొచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పంచాయితీ ఎన్నికల కోసం తమ పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్దం చేసే అవకాశం చంద్ర బాబుకులభించిందంటున్నారు.

విశాఖ ప్రాంతీయ సద స్సును వేదికగా చేసుకుని పార్టీ శ్రేణులను పంచాయితీ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేశారని పేర్కొంటున్నారు. విశాఖ ప్రాంతీయ సదస్సుకు పెద్దసంఖ్యలో శ్రేణులు, అభి మానులు, సానుభూతిపరులు తరలిరావడంతో నేతల్లోనూ ఉత్సాహం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.అలాగే విజయవాడ, రాజమండ్రి, తిరుపతిల్లో నిర్వహించిన సదస్సులకు విజ యవంతం కావడంతో రాష్ట్రంలోని అత్యధిక పంచాయితీ ల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు పాగవేయడం ఖాయ మని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఛార్‌దామ్‌ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను కాపాడేం దుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌ మె మోరియల్‌ ట్రస్టు సిబ్బంది, ఎంపీలు చేసిన కృషి పంచా యితీ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పంచాయితీ ఎన్నికల గెలుపుకు దోహద పడేందుకు ఉత్తరాఖండ్‌లో బాబు చేసిన సేవను ఊరూరా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటుచేసి ప్రచారం చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వరదల్లో చిక్కుకుని టీడీపీ నేతల సహకారంతో ప్రాణాలతో బయటపడిన బాధితుల స్పందనతోపాటు, బాబు పాల్గొన్న సేవా కార్యక్రమాల ఛాయాచిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేయడం ద్వారా పంచాయితీ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునని యోచిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, తమ పార్టీ అధినేత చంద్రబాబు సకాలంలో స్పందించి కాపాడారని, ప్రస్తుతం రాష్ట్రానికి సమర్ధవంతమైన నాయ కత్వం అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే మెజార్టీ పంచాయితీ స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్య ర్థులనే గెలిపించనున్నారంటున్నారు.

‘దేశం’ప్రాంతీయ సమరం

బెయిలు కోసం పిల్ల కాంగ్రె స
అవినీతిమయం తల్లి కాంగ్రెస్‌
ఇంకొకటి బెట్టింగుల పార్టీ
కేంద్రంలో మూడో కూటమి ఖాయం
పంచాయతీతో పిల్ల, తల్లికాంగ్రెస్‌లకు బుద్ధిచెప్పండి
తిరుపతి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు


 
రాష్ట్రంలో ఇప్పటికీ భూము లు లేని వారు ఎందరో ఉన్నారని, ఉన్న భూములపై హక్కు లేనివారు మరికొంద రు ఉన్నారని తమ పార్టీ అధికారంలోకి వస్తే డీకేసీ, సెటిల్మెంటు పట్టాలపై సర్వహక్కులు ఉండేలా చట్టం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. శాశ్వత పట్టాల తరహాలోనే లబ్ధిదారులు సర్వహక్కు లు పొందుతార న్నారు. వ్యవసాయం కోసం మహిళలు తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించే బాధ్యత ప్రభుత్వ మే తీసుకునేలా చూస్తామన్నారు. తొలిసంతకం రైతుల రుణమాఫీ ఫైల్‌పైన ఉంటే , రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై ఉంటుందని చంద్రబాబు తెలిపారు. శుక్రవారం తిరుప తిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అల్లకల్లో పరిస్థితు లు నెలకొన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లు గానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ముమ్మాటికీ కాంగ్రెస్‌ డీఎన్‌ఏనేనని అందులో అనుమానం లేదన్నారు. తల్లి కాంగ్రె స్‌ అవినీతిలో కూరుకుపోయి ఉంటే పిల్ల కాంగ్రెస్‌ ఆ పార్టీ నాయకుడి బెయిలు కోసం వెంపర్లాడుతోందన్నారు. ఇక కిరణ్‌ ఒక తమ్ముడిని జిల్లాకు మరో తమ్ముడికి హైదరాబాద్‌లో వ్యవహారాలు రాసిచ్చారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో తనకు పిఏగా ఉన్న వ్యక్తికి ఏపిీపీఎస్‌సీ బోర్డు సభ్యులుగా నియమిస్తే ఆయన చేసిన అవినీతికి నేడు చంచలగూడ జైలులో ఊచలు లెక్కబెడు తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. అంతలోనే పరోక్షంగా మూతపడ్డాయనీ, ఇటీవల కూడా ఓ పెద్దమనిషి పార్టీని స్థాపించి రెండేళ్లు కూడా నడపలేక కాంగ్రెస్‌లో కలిపేశారని చిరంజీవిని విమర్శించారు. ఈ తరహాలోనే పిల్ల కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తల్లి కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక మరో పార్టీ టీఆర్‌ఎస్‌ దందాలు, మ్యాచ్‌ ఫిక్సిం గులతో పీకల్లోతు అక్రమాలలో కూరుకుపోయిందని చెప్పారు.

దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే మూడో కూటమి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ముంబయిలో పట్టుబడ్డ హవాలా సొమ్మును గమనిస్తే నల్లధనం ఏ స్థాయిలో బయటకు వెళ్లుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించారు

కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. 1972,1992 ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైంద ని విమర్శించారు. హైదరాబాద్‌లో పదిహేనేళ్లు ఎన్నికలు నిర్వహించే సత్తా కూడా లేకుండా పడి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహించిందన్నారు. గ్రామపంచాయతీలు ప్రత్యే కాధికారులతో కునారిల్లుతున్నాయని ఆరోపించారు. గ్రామ, మండల, జడ్పీ సంస్థలకు ప్రజాప్రతినిధులను పెట్టకపోవడం వలనం ప్రత్యేకాధికారులు ద్వారా ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తు న్నారనీ, తాము ఇచ్చిన అన్ని అధికారాలను వైఎస్‌ హాయాం నుంచి మెల్లమెల్లగా వెనక్కి లాక్కుని వాటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆర్టికల్‌ 73,74 తమ గొప్పేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను నీరుగార్చుతోందని, ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి స్థానికసంస్థలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు.

దివాళాతీస్తున్న రైతు

కాంగ్రెస్‌ పార్టీ విధానాలవల్ల రైతులు దివాళా తీస్తున్నార ని వ్యవసాయం అంటేనే భయపడే స్థితి నెలకొని ఉందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఎరువుల ధరలు 300 నుంచి 400 శాతం పెరిగిపోయాయని ఆరోపించారు. మరోవైపు పం ట దిగుబడులకు మాత్రం కనీసం 30 శాతం కూడా ధరలు పెరగలేదన్నారు.

ఉచిత విద్యుత్‌ ప్రహసనంగా మారిందన్నా రు. వైఎస్‌ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్‌ ను ప్రకటించి 7 గంటల సరఫరా ఇస్తే అది రోశయ్య హయాంలో 5 గంటలకు కిరణ్‌ సర్కార్‌లో 3 గంటలకు దిగజారిపోయిందని ఆరోపించా రు. తమ హయాంలో విద్యుత్‌ శాఖకు 8 శాతం ఖర్చు చేస్తే ప్రస్తుతం 3.7 శాతం మాత్రమే ఖర్చు చేసి ఆ శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రైతుల జీవితాలలో మార్పు వచ్చే వరకూ తాము వారి పక్షాన ఉండి పోరాడతామని తెలిపారు.

నగదు బదిలీ కాదు... నకిలీ బదిలీ

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకాన్ని కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని బాబు ఎద్దేవా చేశారు. ఆ పథకాన్ని కాపీ కొట్టడం కూడా చేతకాక నగదు బదిలీ పథకాన్ని నకిలీ బదిలీ పథకంలా మార్చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లికి, తాము ప్రవేశపెట్టిన ఆడపిల్ల సంరక్షణా పథకానికి తేడా ఏమిటో కిరణ్‌ చెప్పాలని కోరారు. రెండింటికి తేడా ఏమీ లేదన్నారు. ఆ పథకాన్ని కాపీకొట్టారని ఆరోపించారు. ఇలా తాము ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి చెప్పుకోవడం మినహా మరోటి కాదన్నారు.

విజయఢంకా మోగించండి


ముందున్నదంతా ఎన్నికల కాలమేనని చంద్రబాబు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలలో తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ పార్టీ భరతం పట్టాలని పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఒకే అభ్యర్థిని పోటీ చేయించే అవకాశం ఉందనీ, ఇలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ కాస్త జాగ్రత్తపడా ల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పంచాయతీ ఎన్నికల తరువాత మునిసిప ల్‌, మండల, జెడ్పీ, శాసన సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికలలో బీజం వేస్తే అదే శాసనసభ ఎన్నికల వరకూ కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ విజయం సాధిస్తే ఆపై అన్ని ఎన్నికలలో విజయఢంకా మోగించడం నల్లేరుపై నడకేనని చెప్పారు.

రైతుల రుణమాఫీపై తొలిసంతకం.....మలి సంతకంతో బెల్టు తీస్తాం

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి హాజరయ్యారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కేసీఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారు. అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది నేనేనన్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

వరంగల్ కాజీపేటలోని ఫాతిమానగర్ బిషప్ బరెట్టా హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 7వ తేదీన జరుగనున్న తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సభకు యుద్ధప్రాతిపదికపై విస్త­ృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు 20వేల మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సభా నిర్వహణకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తయ్యే ట్టు చూస్తున్నారు. వర్షం వల్ల అంతరాయం కలుగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సువిశాలమైన సభా ప్రాంగణం అంతా టార్పాలిన్లు, టెంట్లకు బదులు ఇనుప రేకులతో పైకప్పును వేస్తున్నారు. టీడీపీ జిల్లా నేతలు శుక్రవారం సాయంత్రం సభా ప్రాంగాణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ శనివారం మధ్యాహ్నానికే పూర్తవుతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలుత సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరిస్తారని, అనంతరం ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తారని చెప్పారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని, చార్‌ధామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు పార్టీ శ్రేణులు చేయవలసిన కృషిపై సభలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పారు.

ఇక టీఆర్ఎస్ మాయం :ఎర్రబెల్లి దయాకర్‌రావు

కొండవీటి సంహాలై విజృంభించండి
పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
టీఆర్ఎస్‌కు ఓటు వేయడం దండగ
బెయిల్ కోసమే వైసీపీ ఓట్లు అడుగుతుంది
తిరుపతి సదస్సులో టీడీపీ అధినేత


రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన రెండు పార్టీలూ త్వరలో కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని, రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లుగా ప్రజల కోసం నిలబడి పోరాడిన పార్టీ తమదేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అలాంటి పార్టీకి వారసులైనందుకు ప్రతి కార్యకర్త్తా గర్వపడాలన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని, పంచాయతీ ఎన్నికలతోనే టీడీపీ విజయ పరంపర కొనసాగాలని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు కొండవీటి సింహాలై విజృంభించాలన్నారు.

ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ తరువాత మునిసిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని పేర్కొన్నారు. "2014 ఎన్నికల్లోనూ గెలుపు మనదే. అధికారంలోకి రాకుండా మనల్ని ఎవరూ ఆపలేరు'' అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా కనిపించే వైసీపీ, టీఆర్ఎస్ ఎన్నికల నాటికి ఉండవని, కాంగ్రెస్‌లో విలీనం అయిపోతాయని జోస్యం చెప్పారు. ఈ పార్టీలకు దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. ఉత్తరాఖండ్‌లో వేలాదిమంది తెలుగువారు ఆపదలో చిక్కుకుంటే వ్యక్తిత్వం లేని సీల్డ్‌కవర్ సీఎం.. ఢిల్లీలో సోనియా ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి జైల్లో ఉన్న జగన్‌కు బెయిల్ తెప్పించుకోవడం కోసమే వైసీపీ ఓట్లు అడుగుతోందని చంద్రబాబు విమర్శించారు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ, బెట్టింగ్‌ల పార్టీ, మ్యాచ్‌ఫిక్సింగ్‌ల పార్టీ అంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసినా నిరుపయోగమేనన్నారు.

ఈ రెండు పార్టీలూ అవినీతికి పుట్టినిల్లు అయిన కాంగ్రెస్్‌లో విలీనం కావడం ఖాయమని చెప్పారు. ప్రాంతీయ సదస్సుకు ఐదు జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. కార్యకర్తల్లో సమరోత్సాహం కనిపించింది. కాగా, స్థానిక ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులు క్రియాశీల పాత్ర పోషించేలా చైతన్యం చేయడానికి టీడీపీ నిర్వహిస్తున్న ప్రాంతీయసదస్సు శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. మేడ్చల్ రోడ్డులోని కొంపల్లిలోగల ఎక్స్‌లెన్సీ గార్డెన్‌లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి గ్రామ, మండల స్థాయి పార్టీ నేతలు పాల్గొంటారు.

పంచాయతీల్లో పచ్చ జెండా ఎగరాలి : టీడీపీ అధినేత

హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నగరంలోని కోంపల్లిలో ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సదస్సులో పాల్గొనున్నారు.

నేడు కోంపల్లిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు


రైతుల రుణాలు మాఫీ చేస్తాం...

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్,ఇతర నేతలు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరపడాన్ని టిడిపి ఆక్షేపించింది.ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణ జెఎసి నేతలు సోనియాగాందీని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఉద్యమానికి ద్రోహం చేయడమేనని,పాల్వాయి గోవర్ధనరెడ్డి ఇంటిలో విందులు తీసుకోవడం ఏమిటని ఆయన అన్నారు. రౌండ్ టేబుల్ పేరుతో కాంగ్రెస్ నేతలతో కలవడానికి వెళ్లారని ఆయన ఆరోపించారు.

నిజామాబాద్ ఉప ఎన్నికలలో బంగారుపళ్లెంలో తెలంగాణ తెస్తానని చెప్పిన మాజీ పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్ ,ఆ తర్వాత తెలంగాణ గురించి పట్టించకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి డి.శ్రీనివాస్ తో తెలంగాణ జెఎసి నేతలు మంతనాలు జరపడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ కాంగ్రెస్ నేతల సభ తర్వాత సీమాంద్ర కాంగ్రెస్ నేతలకు కూడా దిగ్విజయ్ సింగ్ సభ పెట్టుకోమ్మని చెప్పారని,అలాంటి దిగ్విజయ ను కోదండరామ్ ఎందుకు కలిశారని ఆయన అన్నారు.

డిల్లీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇక్కడి రాష్ట్ర నేతలే పాల్గొన్నారని, దానికి టిడిపి నేతలను పిలవలేదని ఆయన అన్నారు.తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ ను వెలివేయాలని అనుకుంటుంటే, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఫోటోలు దిగుతుంటే ఎలాంటి సందేశం ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు.తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కోదండరామ్ తదితరులు సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పాత్రికేయులను కూడా ఆయా సమావేశాలకు ఎందుకు పిలవడం లేదని ఆయన అన్నారు.

రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెబుతున్న జెఎసి నేతలు తెలంగాణ ప్రజల బలిదానాలను కాంగ్రెస్ కాళ్లమీద పెడుతున్నారని ఆయన ఆరోపించారు.కెసిఆర్ గతంలో కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు కోదండరామ్ కాంగ్రెస్ తో కలవడం ఏమిటని ప్రశ్నించారు. చలో అసెంబ్లీని ఎవరికి వ్యతిరేకంగా చేశారో, ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు.అదే వ్యక్తులను డిల్లీకి వెళ్లి కౌగిలించుకుంటున్నారంటే మీరు ఏ ప్రవర్తనతో ఉన్నారో సమాజం గమనిస్తున్నదని ఆయన అన్నారు.

సోనియాను కోదండరామ్ ఎలా కలుస్తారు!: రేవంత్ రెడ్డి

కృష్ణా డెల్డాలో 15 లక్షల ఎకరాలకు నీరందక రైతులు అల్లాడిపోతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పులిచింతల, డెల్టా ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు. మద్యం టెండర్లతో మంత్రి పార్థసారథి డబ్బులు దండుకుంటున్నారని, సాగునీటి సలహా మండలి గురించి పట్టించుకోవడం లేదని దేవినేని ఉమా ఆరోపించారు.

నీరందక రైతుల అల్లాడిపోతున్నారు : దేవినేని

ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో పాల్గొని విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్ వినాయకం కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. పూతలపట్టు మండలం చిన్నబండపల్లి వినాయకం కుటుంబాన్ని పరామర్శించి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని బాబు అందజేశారు.

జవాన్ వినాయకం కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెసు పార్టీ నేతలను తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఎలా కలుస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ తెలంగాణ డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ సాధన సభ అందులో భాగమేనని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెసు పార్టీని వెలేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వెయ్యి మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెసు వారి అపాయింటుమెంట్ కోసం కోదండరామ్ నిరీక్షించడం, తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. రాజకీయ నాయకులు వారి వారి రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడవచ్చు.. కానీ, తెలంగాణ సాధన కోసం పుట్టుకొచ్చిన జెఏసి కాంగ్రెసుకు అనుకూలంగా ఉండటం శోచనీయమన్నారు.

జెఏసి నేతలు కాంగ్రెసు పార్టీ కార్యకర్తల కంటే అధ్వాన్నంగా మారి, ఆ పార్టీని పునర్నిర్మాణం చేసే పనిలో పడ్డారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలువడమంటే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అన్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్నప్పుడు వారికి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి ఎవరు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెసు పార్టీని కోదండరామ్ ఎందుకు నమ్ముతున్నారన్నారు. నాడు సకల జనుల సమ్మె ఉధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారని, ఇప్పుడు కోదండరామ్ వెళ్లారన్నారు. కాంగ్రెసు నేతలను కలుస్తున్నందుకు కోదండ సమాధానం చెప్పాలని, తెలంగాణ ప్రజలు ఆయనను నిలదీస్తారన్నారు. సీమాంధ్ర సభలు పెట్టుకోవాలని అనుమతిచ్చిన దిగ్విజయ్ సింగ్ కోసం కూడా నిరీక్షించడం దారుణమన్నారు.

సోనియాని ఎలా కలుస్తారు?: కోదండపై రేవంత్ నిప్పులు

రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌ చార్జిలు మద్దిపట్ల రెడ్డినారాయణకే అప్ప గించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాయచో టి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేసే నేతలే కరు వయ్యారు. నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి నేత ఎవరోనని సందిగ్ద ంలో ఉండిపోయారు. ఆ పరిస్థితుల్లో సంబేపల్లె మండలానికి చెందిన పారి శ్రామికవేత్త రెడ్డినారాయణ ఆ పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలుస్తూవచ్చారు. ని యోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి.

ఇన్‌చార్జి బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే పార్టీ పటి ష్టమ వుతుందని ఆ పార్టీ అభిమానులు ఆశిస్తూవచ్చారు. ఇటీ వల పార్టీ అధి నేత చంద్రబాబునాయుడు కడప జిల్లాపై దృష్టిసారిస్తూ రాయచోటి నియో జకవర్గంపై జిల్లా నేతలతో చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్య క్రమాలకు గతంలో పనిచేసిన నాయకులు దూరంగా ఉండడంతో ఇక్కడ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలియజేశారు.ఈ పరిస్థితుల్లో అన్నివిధాలుగా సమర్ధులైన రెడ్డినారాయణకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్ని లతో పాటు రాబోవు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు విలవుతుందని అదిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

రాయచోటి తెదేపా పగ్గాలు రెడ్డినారాయణకే!

 స్ధానిక సంస్ధలను బలోపేతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని, దీన్ని గతంలో ఎన్‌టిఆర్‌ చేసి చూపారని, పంచాయితీలకు మంచివారిని ఎన్నుకోవాలని, రానున్న ఎన్నికల్లో అన్ని పంచాయితీ ల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. స్ధానిక ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నేతలను సమా యత్తం చేసేందుకు విజయవాడలో గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హజరై కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగిం చారు. తొలుత టిడిపి వ్యవస్ధాపకులు ఎన్‌టిఆర్‌ విగ్రహా నికి పూలమాలవేశారు. దివంగత నేతలు ఎర్రన్నాయుడు, అంబటి బ్రాహ్మణయ్య ఫోటోలకు నివాళులర్పించారు.

ఉత్తరాఖండ్‌ మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పనిచేసేది తెలుగుదేశం మాత్రమేనన్నారు. పం చాయితీ సర్పంచిలుగా మంచివారిని ఎన్నుకుంటే వాటి రూపురేఖలు మారి ఆదర్శ గ్రామాలుగా మారుతాయ న్నారు. తండ్రి అధికార బలంతో కోట్లు మూట కట్టుకున్న పార్టీ వైకాపా అని, తెరాస సెటిల్‌మెంట్ల పార్టీ అని, కాం గ్రెస్‌ అధికారంలో ఉన్నా ఎందుకు పనికిరాని అసమర్ధ పా ర్టీ అని, ముఖ్యమంత్రికి ఏమీ తెలియదని, అసమర్ధుడని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ద వ్యవస్ధలన్నింటిని నిర్వీర్యం చేసిందని, స్ధాని క సంస్ధలకు ఇదే కోవకు చెందుతాయని విమర్శించారు. వీటిని బలోపేతం చేస్తేనే గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఫరిడ విల్లుతుందన్నారు. అధికార పార్టీ చేతగానితనంవల్ల కేంద్రం నుంచి రూ.4వేల కోట్లు రాకుండా పోయాయని మండిపడ్డారు.

దివంగత వైఎస్‌ సర్పంచ్‌లను ఉత్సవ విగ్ర హాలుగా మార్చి కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫలితాలను అం దించారని ఆరోపించారు. 1999లో టిడిపి హయాంలో స్ధానిక సంస్ధల బలోపేతానికి 89, 105 జీవోలను తెచ్చా మని, పంచాయితీలకు అధికారాల బదలాయింపుతోపా టు ఇసుకపై ఆదాయం కూడా అప్పగించామని గుర్తు చేశా రు. పంచాయితీల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని డిమాండ్‌చేశారు. నల్లధనం పోవాలంటే రూ. వెయ్యి, 500 నోట్లను రద్దుచేయాలని కోరారు. తమ ప్రభు త్వం అధికారంలోకివస్తే ప్రజా ధనాన్ని దోచుకున్నవారి వద్ద నుంచి ఆ సొమ్మును రికవరీచేసి ప్రజాసంక్షేమానికి విని యోగిస్తానని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతుందని, లేకపోతే ఆ పార్టీ నేతను కో ర్టు కేసుల నుంచి బయటకు తెచ్చుకోవడానికి వాడుకుం టారేగాని ప్రజలకు ఎటువంటి మేలు చేయలేరని విమర్శిం చారు. అధికార కాంగ్రెస్‌ గత 50ఏళ్ల నుంచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే, దివంగత ఎన్‌టిఆర్‌ తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చారన్నారు.

తమ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ప్రజా సేవా దృక్పదంతో ముందుకు వెళుతున్నామని, ఇందులో భాగంగానే ఉత్తరాఖండ్‌, చార్‌దామ్‌లలో తెలుగువారు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికంటే మిన్నగా సేవ లందించామని గుర్తుచేశారు. ఉత్తరఖాండ్‌లో చూసిన హృ దయవిదారక దృశ్యాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరిం చారు. తెదేపాను నాయకులే మోసం చేశారుతప్ప కార్యక ర్తలు కాదని, కార్యకర్తలవల్లనే ఎన్‌టిఆర్‌కు, తనకు గుర్తిం పు వచ్చిందన్నారు. 9ఏళ్ల కాంగ్రెస్‌ పాలనవల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తల్లి, పిల్ల కాం గ్రెస్‌లను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన హయాంలోని ఐఏఎస్‌ ఆఫీసర్లు కేంద్రంలో ఉన్నత స్ధానాల్లో ఉంటే వైఎస్‌తో పనిచేసిన వారు జైళ్లల్లో మగ్గు తున్నారని ఎద్దేవా చేశారు. ఏపిపిఎస్‌సిలో కాంగ్రెస్‌ కార్య కర్తలను సభ్యులుగా చేర్చి దాన్ని బ్రష్టుపట్టించారని, వారం దరి సభ్యత్వాలను రద్దుచేయాలని గవర్నర్‌ను కలిశామని, త్వరలో రాష్టప్రతిని కూడా కలుస్తామని ఆయన వెల్ల డించారు.

జగన్‌ అవినీతి చేశాడా? లేదో స్పష్టం చేయాలని వైకాపా నేతలను డిమాండ్‌ చేశారు. 2004లో వారి ఆస్తు లెంత? ఇప్పుడెంతో ప్రకటించాలని సవాల్‌ విసిరారు. దొం గ మంత్రులను కాపాడడంలో ఈ సీఎం బిజీగా ఉన్నారని, క్యాబినెట్‌ మంత్రుల పాపాలపై విచారణ చేయిస్తే 70 శాతం మంది జైళ్లలో ఉంటారన్నారు.అవినీతి లేకపోతే పేద రికం ఉండదని, పేదల కష్టార్జితం అవినీతిపరుల పాల వుతోందని ఆవేదన చెందారు.విద్యుత్‌ సమస్య పరిష్కారం, కేజి బేసిన్‌ గ్యాస్‌ మన అవసరాలకు ఉపయోగపడాలన్నా టిడిపినే గెలవాలని స్పష్టం చేశారు. రుణమాఫిపై మొదటి సంతకం, మద్య నియంత్రణపై రెండో సంతకం చేస్తానని మరోసారి నొక్కి వక్కాణించారు. దీన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేయమని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు.

ఈ నెలరోజులు నిద్రపోకుండా పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించేందుకు కృషిచేయాలని కోరారు. సదస్సులో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు దేవినేని ఉమా, పత్తిపాట పుల్లారావు, సీతామహాలక్ష్మి, కరణం బలరామ్‌, బందరు ఎంపి కొనగళ్ల నారాయణ, మాజీ మంత్రులు కోడెల శివప్రసాదరావు, గో రంట్ల బుచ్చయ్యచౌదరి, ఆలపాటి రాజా, మాగంటి బాబు, నన్నపనేని రాజకుమారి, వైవిబి రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ సి ఎల్‌ వెంకటరావ్‌, వర్ల రామయ్య, కాగిత వెంకటరావు, 4 జిల్లాల ఎంఎల్‌ఏలు,పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల బలోపేతమే దేశం లక్ష్యం

రాయల తెలంగాణ ప్రతి పాదన తెలుగుతమ్ముళ్లలో గుబులు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపితే తాము ఎటువంటి వైఖరి తీసుకోవాలన్నదానిపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు తర్జన, భర్జనలు కొనసాగుతున్నాయి. రా ష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విభజన అంశాన్ని తెరపై కి తెచ్చిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విభజన వాదాన్ని ఆదిలోనే సమర్ధవంతంగా అడ్డుకోకపోతే తమ ప్రాంత ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోవాల్సిందె మో నన్న ఆందోళన సీమాంధ్ర తమ్ముళ్లులో స్పష్టంగా కని పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపు తోందన్న సంకేతాల వెలువడుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే తమ ప్రాంత కాంగ్రెస్‌పార్టీ నేతలతో కలిసి బలంగా సమైక్యవాదాన్ని వినిపించాల్సిందేనని టీడీపీ నేత లు ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రకటనను వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లుగానే, అవసరమైతే మరోసారి రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సహచర శాసనస భ్యులకు, పార్లమెంట్‌సభ్యులకు సూచిస్తూ సందేశాలను పంపిస్తున్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన మూకుమ్మడిగా వ్యతిరేకించి గతంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకున్నామని, ఇప్పుడూ మరోసారి అదే తరహాలో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిస్తు న్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్ర ప్రజలు క్షమించరన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును కోరుతూ మహానాడులో తీర్మానం చేసిందని, గతం లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకిచ్చిన లేఖను ఇటీవల మరోసా రి హోంమంత్రి షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఇచ్చిన నేపథ్యంలో అచి, తూచి వ్యహ రించాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతి ష్టకు భంగం కలుగకుండా తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని సీమాంధ్ర నేతలు పేర్కొంటున్నారు. అందుకే తెలు గుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు విభజన అంశంపై మీడి యా ముందు నోరు విప్పడానికి సుతారం ఇష్టపడడం లే దు.

తెలంగాణ అనుకూలంగా తమ పార్టీ గతంలో తీసు కున్న వైఖరికి కట్టుబడి ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రయోజ నాలను పణంగా పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసిన తాము వ్యతిరేకిస్తామంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని సీమ ప్రజలు, తెలంగాణ ప్రజలు కో రుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. రాజకీయలబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమ నేతలు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు న్నారని గుర్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు అమోదయోగ్యం కానీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేయడం ఏమిటనీ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయావసరాల కోసం రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ నాయకత్వం పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ప్రజా గ్రహానికి గురికావల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్‌తో కలుద్దామా?



కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కష్టాలే
వైకాపాలో కాంగ్రెస్‌ డీఎన్‌ఏ
నిజాయితీపరులనే ఎన్నుకోండి
విజయవాడ సదస్సులో బాబు పిలుపు

  పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కష్టాలు మరింత పెరుగుతాయెె తప్ప తగ్గవని, రాష్ట్రం మరింత అంథకారంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయ వాడకు సమీపంలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గురు వారం నిర్వహించిన పంచాయతీరాజ్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సదస్సుకు కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వ రరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ విద్యుత్‌ వ్యవస్థను తాను 9 ఏళ్ల పాటు ఎంతో అభి వృద్ధి చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వ అస మర్ధత వల్ల భ్రష్ఠు పట్టించారని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అస్తవ్యస్థమైన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతానన్నారు. తెలుగుదేశం హయంలో వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇచ్చామని అయితే వైఎస్‌ హయంలో ఏడు గంటలు, రోశయ్య హయంలో 5 గంటలు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయంలో మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని చెప్పారు.

సమర్థులనే ఎన్నుకోండి

రాబోయే ఎన్నికలో నిజాయితీ పరులను, మంచివారిని ఎన్నుకోకపోతే శాశ్వతంగా బాధపడాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఏమీ ఒరగదన్నారు. కేవలం ఈ తీర్పు ద్వారా ప్రజలలో తమకు విశ్వాసం ఉందని సాకుగా చూపి బెయిల్‌ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి దోచుకునే డీఎన్‌ఏ వైకాపా పొందిందని చెప్పారు. ఈ డీఎన్‌ఏ ప్రజలకు సర్వీసు చేసేది కాదన్నారు. లక్ష కోట్లు సంపాందించిన కొడుకును మందలించడం చేత కానీ వైఎస్‌ విజయమ్మ ప్రత్యర్థి పార్టీలపై ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ అవినీతి పాల్పడ్డారని ఆయన మరో సారి ఆరోపించారు. ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వారు పిరికి వారని వారికి ఎన్నికలు పెట్టే ధైర్యం లేదన్నారు. 1976-79 మధ్య, 1992-95, 2010-13 మధ్య మూడు సార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతి సారి ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేదన్నారు. తద్వారా రాజ్యంగ స్పూర్తిని కూడా దెబ్బతీశారని ఆరోపించారు. గతంలో చెప్పిన విధంగానే రుణమాఫీ అమలుచేస్తామని ఎలా అమలుచేస్తామో తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత చేసి చూపిస్తామన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ఊరూరా బార్లు

గ్రామాల్లో మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం ఊరూర బార్లను ప్రారంభిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎన్‌టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో ఊరారా స్వచ్చమైన మంచినీరు అందిస్తామని తెలిపారు. బంగారు తల్లి పథకం అమలుకు చట్టం అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పథకం అమలుకు చిత్తశుద్ది అవసరమే తప్ప చట్టం అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ అనే పథకం ప్రవేశ పెడ్తామని చెప్పగా దానిని కాపీ కొట్టి బంగారు తల్లి ప్రవేశపెట్టారని ఆరోపించారు. గతంలో ఉన్న బాలిక సంరక్షణ పథకాన్ని 9 ఏళ్లుగా నిలిపివేశారని విమర్శించారు. ఏపీపీఎస్‌సీ ప్రక్షాళన జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్‌ వద్ద పీఏ పనిచేసిన వ్యక్తిని సభ్యుడిగా నియమించారని ఆయన నేరుగా ఉద్యోగాలు అమ్ముకున్నానని బరితెగించి మాట్లాడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రిటైర్డు ఎంఆర్‌ ఓ గ్రూపు-1 అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తారా అని ఎద్దేవా చేశారు.

తెలుగువారంటే వివక్షే

వరదలో చిక్కకుని మృతి చెందిన వారి కుటుంబాలలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వాసులకు అక్కడి ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం ఇస్తే మన రాష్ట్రం వారికి రెండు లక్షలు ఇచ్చారని, మన ప్ర భుత్వం మూడు లక్షలు ఇస్తామని ప్రకటించిందని తెలుగువారంటే ఎంత వివక్షో దీనిని బట్టి అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. అధికారం, పెత్తనం కావాలని కోరుకునే పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కేవలం పదవులు నిలబెట్టుకోవడానికి ఢిల్లిd చుట్టూ తిరుగుతుంటారని విమర్శించా రు. వరదల సమయంలో మానవత్వం లేకుండా వ్యవహరించా రని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై 9 ఏళ్లుగా ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. డ్యాం కట్టకుండా ముందుగా కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

హస్తం వస్తే అస్తవ్యస్తం...మా 'మహాలక్ష్మి'కి కాపీ 'బంగారుతల్లి'


పట్టం గడితే గ్రామాల్లో వెలుగులు నింపుతా తెలుగుజాతి ప్రతిష్ఠను పునరుద్ధరిస్తా.. చరిత్ర తిరగరాస్తా అవినీతి సొమ్మును నయాపైసలతో కక్కిస్తా టిడిపి నాలుగు జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ============ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టంకడితే వౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన స్వపరిపాలనతో గ్రామాల్లో వెలుగులు నింపడంతో పాటు అవినీతి, అక్రమాలతో అవమానాలపాలవుతున్న తెలుగుజాతి ప్రతిష్ఠను పునరుద్ధరించి చరిత్రను తిరగ రాసేందుకు శ్రీకారం చుడతానని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పంచాయతీల్లో పెరిగిన ఆర్థిక భారాలతో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక విద్యుత్ స్తంభాలు కూడా ఉండవని ఎద్దేవా చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కంకిపాడు మండలం ఈడుపుగల్లులో గురువారం జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూనే అనేక హామీలు గుప్పించారు. పేదరికంలేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో చూడాలనేది తన లక్ష్యమని, కలలో కూడా ఇదే విషయం ఆలోచిస్తుంటానని, అందుకే రానున్న సాధారణ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ముచ్చటగా మూడు ఫైళ్లపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. మొదటగా రైతు రుణ మాఫీ, ఆ తర్వాత మద్యం అమ్మకాలపై నియంత్రణ, ఎన్టీఆర్ జలప్రభ పేరిట అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కుల మతాలు ఇతర ప్రయోజనాలను పక్కనబెట్టి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతిపరులు దిగమింగిన ప్రజాధనాన్ని నయాపైసలతో సహా కక్కించి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి చూపాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అవినీతిపరులైన వైఎస్, జగన్ అనుయాయులతో నిండిపోయిందని, దీనిని సమూలంగా ప్రక్షాళన చేసి సమర్థులను నియమించేదాకా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జలయజ్ఞం పేరిట 86 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే సాగు విస్తీర్ణం పెరగకపోగా 25 వేల ఎకరాలు తగ్గిందన్నారు. తన హయాంలో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు ఏనాడో పూర్తికావాల్సిందని, ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్టూ కొలిక్కి రాలేదని, కాంట్రాక్టర్ల నుంచి పాలకుల వరకూ ఎవరికి అందినంత వారు దోచుకోవడమే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ప్రస్తుత మంత్రుల్లో కనీసం 75 శాతం మంది జైళ్లకు వెళ్తారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ప్రజా సమస్యలేమీ పట్టడం లేదని, అవినీతిపరులైన మంత్రులను రక్షించే పనిలో ఆయన తలమునకలైపోయారని నిప్పులు చెరిగారు. తొలుతగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావుతో పాటు ఇటీవల మృతిచెందిన కింజరాపు ఎర్రంనాయుడు, అంబటి బ్రాహ్మణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం పాత బస్టాండ్ సమీపంలో పార్లమెంటు నియోజకవర్గ టిడిపి కార్యాలయం ‘కేశినేని భవన్’ను చంద్రబాబు ప్రారంభించారు. కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. (చిత్రం) తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

అసెంబ్లీ ఎన్నికలకు ‘పంచాయతీ’యే పునాది

కాంగ్రెస్ పార్టీకి ఎక్కు సీట్లు రావు
బీజేపీ పుంజుకునే ఆవకాశాల్లేవు
విజయవాడ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు

 
'కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావు. బీజేపీ పుంజుకునే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ, వైసీపీకి ఓటు వేస్తే వారికి బెయిల్ తెచ్చుకోడానికో, జైలు నుంచి బయటికి రావటానికో ఉపయోగపడుతుంది తప్ప మరే ఉపయోగం లేదు, కనుక రాబోయే రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది మళ్లీ మనమే' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు వద్ద జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల పంచాయతీ ఎన్నికల ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్ వరదల్లో మానవత్వం కూడా లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ పరమ దుర్మార్గుడని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చట్టాలు చేస్తే ఏం లాభమని అన్నారు. జగన్ దోచుకున్న డబ్బు రాబడితే ప్రజల అవసరాలన్నీ తీర్చవచ్చునన్నారు. చంచల్‌గూడ జైలులో మగ్గుతున్న జగన్‌ది, కాంగ్రెస్‌ది ఒకే డీఎన్ఏ అని దిగ్విజయ్‌సింగ్ ఒప్పుకుని కాంగ్రెస్ దోపిడీ పార్టీ అని చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలు 2014లో జరిగే ఎన్నికలకు రిహార్సల్ వంటివని, ఇందులో టీడీపీ విజయఢంకా మోగించేలా కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే పంచాయతీల వ్యవస్థ సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక గ్రామం బాగా ఉండాలంటే.. ఒక మంచి వ్యక్తి సమర్థ పాలన అందించాలన్నారు. కుల, మతాల జాడ్యాన్ని పక్కనపెట్టి, సమర్థులైన వారిని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు.

ఢిల్లీ 'చక్రం' మళ్లీ మన చేతికే! :చంద్రబాబు

పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తపరిచే దిశగా శుక్రవారం తిరుపతిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు జరగనుంది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి హాజరు కానున్న పార్టీ శ్రేణులకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కష్ణమూర్తి, నాయకులు నరసింహయాదవ్, మందలపు మోహన రావు తదితరులు ప్రాంతీయ సదస్సు జరిగే రామానాయుడు కల్యాణ మండపాన్ని పరిశీలించారు. సుమారు 20వేల మంది హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక పూతలపట్టు మండలం చిన్న బండపల్లెకు బయలుదేరి వెళతారు. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వీర జవాన్ వినాయకన్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు తిరుపతి చేరుకుని ప్రాంతీయ సదస్సుకు హాజరవుతారు.సాయంత్రం 5 గంటల వరకు సాగే సదస్సులో చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు ప్రసంగించనున్నారు.తరువాత ఉదయీ హోటల్‌కు చేరుకునే చంద్రబాబు అక్కడే బస చేస్తారు. రాత్రి జిల్లా టీడీపీ నాయకులతో పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై సమీక్షిస్తారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి స్పైస్ జెట్ విమానంలో హైదరాబాదుకు వెళతారు.

తిరుపతిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు రేపు