July 5, 2013

‘దేశం’ప్రాంతీయ సమరం

 ప్రాంతీయ సదస్సులతో పంచాయితీ సమరానికి తెలుగుదేశంపార్టీ సన్నద్దమవు తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరు పతిలలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులు విజయవం తం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోం ది. శనివారం రంగారెడ్డిజిల్లా కొంపల్లిలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో 5వ ప్రాంతీయ సదస్సును విజయవంతంగా నిర్వ హించేందుకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ఈ సదస్సుకు పెద్దఎత్తున కార్యకర్తలను, అభిమానులను, సానుభూతిపరులను తరలించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన లో కొనసాగిన పంచాయితీలకు ఏడేళ్ల విరామం అనం తరం జరుగబోతున్న ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసేందుకు టీడీపీ నేతలు తమ వ్యూహాలకు పదను పెడు తున్నారు.

రాష్టవ్య్రాప్తంగా అత్యధిక పంచాయితీ స్థానాలు కైవసం చేసుకోవడంద్వారా 2014లో జరగనున్న సాధా రణ ఎన్నికల్లో అధికారం తమదేనన్న భావన పార్టీ శ్రేణుల్లో కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయితీలు నిధులు లేక నిరసించిన వైనాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. తాగునీటి కోసం బోర్‌ వెల్‌ ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారులను కోరితే చం దాలు వేసుకుని బోర్‌వెల్‌ ఏర్పాటు చేసుకోవాలంటూ ఉచి త సలహాలిచ్చిన వైనాన్ని ఈసందర్భంగా ప్రజల ముందు ప్రస్తావించాలని పార్టీశ్రేణులకు నేతలు సూచిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఎదుర్కోన్న ఇబ్బందులు, మురికికాలువలను శుభ్రం చేసేందుకు కూడా నిధులు లేక ఇబ్బందులెదుర్కొన్న వైనాన్ని గుర్తుచేయాలంటున్నారు.

కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన స్థానిక సం స్థలను నిర్వీర్యం చేసిందనీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ సదస్సుల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల పురోగాభివృద్ధికి పెద్దపీ ట వేస్తే, కాంగ్రెస్‌ నిర్వీర్యం చేసిందని మండిపడుతున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెను వెంటనే ఎన్నికలను నిర్వహించి నిధులు, విధులు అప్పగిం చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఈనెల మూడవ తేదీన విశాఖలో టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించిన రోజే ఎన్నికల కమిషన్‌ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో తమకు కలిసొచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పంచాయితీ ఎన్నికల కోసం తమ పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్దం చేసే అవకాశం చంద్ర బాబుకులభించిందంటున్నారు.

విశాఖ ప్రాంతీయ సద స్సును వేదికగా చేసుకుని పార్టీ శ్రేణులను పంచాయితీ ఎన్నికలకు కార్యోన్ముఖులను చేశారని పేర్కొంటున్నారు. విశాఖ ప్రాంతీయ సదస్సుకు పెద్దసంఖ్యలో శ్రేణులు, అభి మానులు, సానుభూతిపరులు తరలిరావడంతో నేతల్లోనూ ఉత్సాహం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.అలాగే విజయవాడ, రాజమండ్రి, తిరుపతిల్లో నిర్వహించిన సదస్సులకు విజ యవంతం కావడంతో రాష్ట్రంలోని అత్యధిక పంచాయితీ ల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు పాగవేయడం ఖాయ మని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఛార్‌దామ్‌ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను కాపాడేం దుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌ మె మోరియల్‌ ట్రస్టు సిబ్బంది, ఎంపీలు చేసిన కృషి పంచా యితీ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పంచాయితీ ఎన్నికల గెలుపుకు దోహద పడేందుకు ఉత్తరాఖండ్‌లో బాబు చేసిన సేవను ఊరూరా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటుచేసి ప్రచారం చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వరదల్లో చిక్కుకుని టీడీపీ నేతల సహకారంతో ప్రాణాలతో బయటపడిన బాధితుల స్పందనతోపాటు, బాబు పాల్గొన్న సేవా కార్యక్రమాల ఛాయాచిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేయడం ద్వారా పంచాయితీ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునని యోచిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, తమ పార్టీ అధినేత చంద్రబాబు సకాలంలో స్పందించి కాపాడారని, ప్రస్తుతం రాష్ట్రానికి సమర్ధవంతమైన నాయ కత్వం అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే మెజార్టీ పంచాయితీ స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్య ర్థులనే గెలిపించనున్నారంటున్నారు.