July 5, 2013

రైతుల రుణమాఫీపై తొలిసంతకం.....మలి సంతకంతో బెల్టు తీస్తాం

బెయిలు కోసం పిల్ల కాంగ్రె స
అవినీతిమయం తల్లి కాంగ్రెస్‌
ఇంకొకటి బెట్టింగుల పార్టీ
కేంద్రంలో మూడో కూటమి ఖాయం
పంచాయతీతో పిల్ల, తల్లికాంగ్రెస్‌లకు బుద్ధిచెప్పండి
తిరుపతి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు


 
రాష్ట్రంలో ఇప్పటికీ భూము లు లేని వారు ఎందరో ఉన్నారని, ఉన్న భూములపై హక్కు లేనివారు మరికొంద రు ఉన్నారని తమ పార్టీ అధికారంలోకి వస్తే డీకేసీ, సెటిల్మెంటు పట్టాలపై సర్వహక్కులు ఉండేలా చట్టం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. శాశ్వత పట్టాల తరహాలోనే లబ్ధిదారులు సర్వహక్కు లు పొందుతార న్నారు. వ్యవసాయం కోసం మహిళలు తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించే బాధ్యత ప్రభుత్వ మే తీసుకునేలా చూస్తామన్నారు. తొలిసంతకం రైతుల రుణమాఫీ ఫైల్‌పైన ఉంటే , రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై ఉంటుందని చంద్రబాబు తెలిపారు. శుక్రవారం తిరుప తిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అల్లకల్లో పరిస్థితు లు నెలకొన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లు గానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ముమ్మాటికీ కాంగ్రెస్‌ డీఎన్‌ఏనేనని అందులో అనుమానం లేదన్నారు. తల్లి కాంగ్రె స్‌ అవినీతిలో కూరుకుపోయి ఉంటే పిల్ల కాంగ్రెస్‌ ఆ పార్టీ నాయకుడి బెయిలు కోసం వెంపర్లాడుతోందన్నారు. ఇక కిరణ్‌ ఒక తమ్ముడిని జిల్లాకు మరో తమ్ముడికి హైదరాబాద్‌లో వ్యవహారాలు రాసిచ్చారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో తనకు పిఏగా ఉన్న వ్యక్తికి ఏపిీపీఎస్‌సీ బోర్డు సభ్యులుగా నియమిస్తే ఆయన చేసిన అవినీతికి నేడు చంచలగూడ జైలులో ఊచలు లెక్కబెడు తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. అంతలోనే పరోక్షంగా మూతపడ్డాయనీ, ఇటీవల కూడా ఓ పెద్దమనిషి పార్టీని స్థాపించి రెండేళ్లు కూడా నడపలేక కాంగ్రెస్‌లో కలిపేశారని చిరంజీవిని విమర్శించారు. ఈ తరహాలోనే పిల్ల కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తల్లి కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక మరో పార్టీ టీఆర్‌ఎస్‌ దందాలు, మ్యాచ్‌ ఫిక్సిం గులతో పీకల్లోతు అక్రమాలలో కూరుకుపోయిందని చెప్పారు.

దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే మూడో కూటమి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ముంబయిలో పట్టుబడ్డ హవాలా సొమ్మును గమనిస్తే నల్లధనం ఏ స్థాయిలో బయటకు వెళ్లుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించారు

కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. 1972,1992 ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైంద ని విమర్శించారు. హైదరాబాద్‌లో పదిహేనేళ్లు ఎన్నికలు నిర్వహించే సత్తా కూడా లేకుండా పడి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహించిందన్నారు. గ్రామపంచాయతీలు ప్రత్యే కాధికారులతో కునారిల్లుతున్నాయని ఆరోపించారు. గ్రామ, మండల, జడ్పీ సంస్థలకు ప్రజాప్రతినిధులను పెట్టకపోవడం వలనం ప్రత్యేకాధికారులు ద్వారా ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తు న్నారనీ, తాము ఇచ్చిన అన్ని అధికారాలను వైఎస్‌ హాయాం నుంచి మెల్లమెల్లగా వెనక్కి లాక్కుని వాటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆర్టికల్‌ 73,74 తమ గొప్పేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను నీరుగార్చుతోందని, ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి స్థానికసంస్థలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు.

దివాళాతీస్తున్న రైతు

కాంగ్రెస్‌ పార్టీ విధానాలవల్ల రైతులు దివాళా తీస్తున్నార ని వ్యవసాయం అంటేనే భయపడే స్థితి నెలకొని ఉందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఎరువుల ధరలు 300 నుంచి 400 శాతం పెరిగిపోయాయని ఆరోపించారు. మరోవైపు పం ట దిగుబడులకు మాత్రం కనీసం 30 శాతం కూడా ధరలు పెరగలేదన్నారు.

ఉచిత విద్యుత్‌ ప్రహసనంగా మారిందన్నా రు. వైఎస్‌ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్‌ ను ప్రకటించి 7 గంటల సరఫరా ఇస్తే అది రోశయ్య హయాంలో 5 గంటలకు కిరణ్‌ సర్కార్‌లో 3 గంటలకు దిగజారిపోయిందని ఆరోపించా రు. తమ హయాంలో విద్యుత్‌ శాఖకు 8 శాతం ఖర్చు చేస్తే ప్రస్తుతం 3.7 శాతం మాత్రమే ఖర్చు చేసి ఆ శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రైతుల జీవితాలలో మార్పు వచ్చే వరకూ తాము వారి పక్షాన ఉండి పోరాడతామని తెలిపారు.

నగదు బదిలీ కాదు... నకిలీ బదిలీ

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకాన్ని కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని బాబు ఎద్దేవా చేశారు. ఆ పథకాన్ని కాపీ కొట్టడం కూడా చేతకాక నగదు బదిలీ పథకాన్ని నకిలీ బదిలీ పథకంలా మార్చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లికి, తాము ప్రవేశపెట్టిన ఆడపిల్ల సంరక్షణా పథకానికి తేడా ఏమిటో కిరణ్‌ చెప్పాలని కోరారు. రెండింటికి తేడా ఏమీ లేదన్నారు. ఆ పథకాన్ని కాపీకొట్టారని ఆరోపించారు. ఇలా తాము ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి చెప్పుకోవడం మినహా మరోటి కాదన్నారు.

విజయఢంకా మోగించండి


ముందున్నదంతా ఎన్నికల కాలమేనని చంద్రబాబు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలలో తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ పార్టీ భరతం పట్టాలని పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఒకే అభ్యర్థిని పోటీ చేయించే అవకాశం ఉందనీ, ఇలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ కాస్త జాగ్రత్తపడా ల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పంచాయతీ ఎన్నికల తరువాత మునిసిప ల్‌, మండల, జెడ్పీ, శాసన సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికలలో బీజం వేస్తే అదే శాసనసభ ఎన్నికల వరకూ కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ విజయం సాధిస్తే ఆపై అన్ని ఎన్నికలలో విజయఢంకా మోగించడం నల్లేరుపై నడకేనని చెప్పారు.