July 5, 2013

ఢిల్లీ 'చక్రం' మళ్లీ మన చేతికే! :చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి ఎక్కు సీట్లు రావు
బీజేపీ పుంజుకునే ఆవకాశాల్లేవు
విజయవాడ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు

 
'కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావు. బీజేపీ పుంజుకునే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ, వైసీపీకి ఓటు వేస్తే వారికి బెయిల్ తెచ్చుకోడానికో, జైలు నుంచి బయటికి రావటానికో ఉపయోగపడుతుంది తప్ప మరే ఉపయోగం లేదు, కనుక రాబోయే రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది మళ్లీ మనమే' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు వద్ద జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల పంచాయతీ ఎన్నికల ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్ వరదల్లో మానవత్వం కూడా లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ పరమ దుర్మార్గుడని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చట్టాలు చేస్తే ఏం లాభమని అన్నారు. జగన్ దోచుకున్న డబ్బు రాబడితే ప్రజల అవసరాలన్నీ తీర్చవచ్చునన్నారు. చంచల్‌గూడ జైలులో మగ్గుతున్న జగన్‌ది, కాంగ్రెస్‌ది ఒకే డీఎన్ఏ అని దిగ్విజయ్‌సింగ్ ఒప్పుకుని కాంగ్రెస్ దోపిడీ పార్టీ అని చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలు 2014లో జరిగే ఎన్నికలకు రిహార్సల్ వంటివని, ఇందులో టీడీపీ విజయఢంకా మోగించేలా కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే పంచాయతీల వ్యవస్థ సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక గ్రామం బాగా ఉండాలంటే.. ఒక మంచి వ్యక్తి సమర్థ పాలన అందించాలన్నారు. కుల, మతాల జాడ్యాన్ని పక్కనపెట్టి, సమర్థులైన వారిని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు.