July 5, 2013

సోనియాను కోదండరామ్ ఎలా కలుస్తారు!: రేవంత్ రెడ్డి

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్,ఇతర నేతలు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరపడాన్ని టిడిపి ఆక్షేపించింది.ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణ జెఎసి నేతలు సోనియాగాందీని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఉద్యమానికి ద్రోహం చేయడమేనని,పాల్వాయి గోవర్ధనరెడ్డి ఇంటిలో విందులు తీసుకోవడం ఏమిటని ఆయన అన్నారు. రౌండ్ టేబుల్ పేరుతో కాంగ్రెస్ నేతలతో కలవడానికి వెళ్లారని ఆయన ఆరోపించారు.

నిజామాబాద్ ఉప ఎన్నికలలో బంగారుపళ్లెంలో తెలంగాణ తెస్తానని చెప్పిన మాజీ పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్ ,ఆ తర్వాత తెలంగాణ గురించి పట్టించకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి డి.శ్రీనివాస్ తో తెలంగాణ జెఎసి నేతలు మంతనాలు జరపడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ కాంగ్రెస్ నేతల సభ తర్వాత సీమాంద్ర కాంగ్రెస్ నేతలకు కూడా దిగ్విజయ్ సింగ్ సభ పెట్టుకోమ్మని చెప్పారని,అలాంటి దిగ్విజయ ను కోదండరామ్ ఎందుకు కలిశారని ఆయన అన్నారు.

డిల్లీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇక్కడి రాష్ట్ర నేతలే పాల్గొన్నారని, దానికి టిడిపి నేతలను పిలవలేదని ఆయన అన్నారు.తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ ను వెలివేయాలని అనుకుంటుంటే, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఫోటోలు దిగుతుంటే ఎలాంటి సందేశం ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు.తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కోదండరామ్ తదితరులు సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పాత్రికేయులను కూడా ఆయా సమావేశాలకు ఎందుకు పిలవడం లేదని ఆయన అన్నారు.

రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెబుతున్న జెఎసి నేతలు తెలంగాణ ప్రజల బలిదానాలను కాంగ్రెస్ కాళ్లమీద పెడుతున్నారని ఆయన ఆరోపించారు.కెసిఆర్ గతంలో కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు కోదండరామ్ కాంగ్రెస్ తో కలవడం ఏమిటని ప్రశ్నించారు. చలో అసెంబ్లీని ఎవరికి వ్యతిరేకంగా చేశారో, ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు.అదే వ్యక్తులను డిల్లీకి వెళ్లి కౌగిలించుకుంటున్నారంటే మీరు ఏ ప్రవర్తనతో ఉన్నారో సమాజం గమనిస్తున్నదని ఆయన అన్నారు.