July 5, 2013

కాంగ్రెస్‌తో కలుద్దామా?

రాయల తెలంగాణ ప్రతి పాదన తెలుగుతమ్ముళ్లలో గుబులు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపితే తాము ఎటువంటి వైఖరి తీసుకోవాలన్నదానిపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు తర్జన, భర్జనలు కొనసాగుతున్నాయి. రా ష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విభజన అంశాన్ని తెరపై కి తెచ్చిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విభజన వాదాన్ని ఆదిలోనే సమర్ధవంతంగా అడ్డుకోకపోతే తమ ప్రాంత ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోవాల్సిందె మో నన్న ఆందోళన సీమాంధ్ర తమ్ముళ్లులో స్పష్టంగా కని పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపు తోందన్న సంకేతాల వెలువడుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే తమ ప్రాంత కాంగ్రెస్‌పార్టీ నేతలతో కలిసి బలంగా సమైక్యవాదాన్ని వినిపించాల్సిందేనని టీడీపీ నేత లు ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రకటనను వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లుగానే, అవసరమైతే మరోసారి రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సహచర శాసనస భ్యులకు, పార్లమెంట్‌సభ్యులకు సూచిస్తూ సందేశాలను పంపిస్తున్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన మూకుమ్మడిగా వ్యతిరేకించి గతంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకున్నామని, ఇప్పుడూ మరోసారి అదే తరహాలో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిస్తు న్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్ర ప్రజలు క్షమించరన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును కోరుతూ మహానాడులో తీర్మానం చేసిందని, గతం లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకిచ్చిన లేఖను ఇటీవల మరోసా రి హోంమంత్రి షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఇచ్చిన నేపథ్యంలో అచి, తూచి వ్యహ రించాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతి ష్టకు భంగం కలుగకుండా తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని సీమాంధ్ర నేతలు పేర్కొంటున్నారు. అందుకే తెలు గుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు విభజన అంశంపై మీడి యా ముందు నోరు విప్పడానికి సుతారం ఇష్టపడడం లే దు.

తెలంగాణ అనుకూలంగా తమ పార్టీ గతంలో తీసు కున్న వైఖరికి కట్టుబడి ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రయోజ నాలను పణంగా పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసిన తాము వ్యతిరేకిస్తామంటున్నారు. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని సీమ ప్రజలు, తెలంగాణ ప్రజలు కో రుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. రాజకీయలబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమ నేతలు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు న్నారని గుర్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు అమోదయోగ్యం కానీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేయడం ఏమిటనీ మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయావసరాల కోసం రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ నాయకత్వం పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ప్రజా గ్రహానికి గురికావల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.