July 5, 2013

హస్తం వస్తే అస్తవ్యస్తం...మా 'మహాలక్ష్మి'కి కాపీ 'బంగారుతల్లి'



కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కష్టాలే
వైకాపాలో కాంగ్రెస్‌ డీఎన్‌ఏ
నిజాయితీపరులనే ఎన్నుకోండి
విజయవాడ సదస్సులో బాబు పిలుపు

  పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కష్టాలు మరింత పెరుగుతాయెె తప్ప తగ్గవని, రాష్ట్రం మరింత అంథకారంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయ వాడకు సమీపంలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గురు వారం నిర్వహించిన పంచాయతీరాజ్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సదస్సుకు కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వ రరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ విద్యుత్‌ వ్యవస్థను తాను 9 ఏళ్ల పాటు ఎంతో అభి వృద్ధి చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వ అస మర్ధత వల్ల భ్రష్ఠు పట్టించారని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అస్తవ్యస్థమైన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతానన్నారు. తెలుగుదేశం హయంలో వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇచ్చామని అయితే వైఎస్‌ హయంలో ఏడు గంటలు, రోశయ్య హయంలో 5 గంటలు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయంలో మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని చెప్పారు.

సమర్థులనే ఎన్నుకోండి

రాబోయే ఎన్నికలో నిజాయితీ పరులను, మంచివారిని ఎన్నుకోకపోతే శాశ్వతంగా బాధపడాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఏమీ ఒరగదన్నారు. కేవలం ఈ తీర్పు ద్వారా ప్రజలలో తమకు విశ్వాసం ఉందని సాకుగా చూపి బెయిల్‌ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి దోచుకునే డీఎన్‌ఏ వైకాపా పొందిందని చెప్పారు. ఈ డీఎన్‌ఏ ప్రజలకు సర్వీసు చేసేది కాదన్నారు. లక్ష కోట్లు సంపాందించిన కొడుకును మందలించడం చేత కానీ వైఎస్‌ విజయమ్మ ప్రత్యర్థి పార్టీలపై ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ అవినీతి పాల్పడ్డారని ఆయన మరో సారి ఆరోపించారు. ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వారు పిరికి వారని వారికి ఎన్నికలు పెట్టే ధైర్యం లేదన్నారు. 1976-79 మధ్య, 1992-95, 2010-13 మధ్య మూడు సార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతి సారి ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేదన్నారు. తద్వారా రాజ్యంగ స్పూర్తిని కూడా దెబ్బతీశారని ఆరోపించారు. గతంలో చెప్పిన విధంగానే రుణమాఫీ అమలుచేస్తామని ఎలా అమలుచేస్తామో తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత చేసి చూపిస్తామన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ఊరూరా బార్లు

గ్రామాల్లో మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం ఊరూర బార్లను ప్రారంభిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎన్‌టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో ఊరారా స్వచ్చమైన మంచినీరు అందిస్తామని తెలిపారు. బంగారు తల్లి పథకం అమలుకు చట్టం అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పథకం అమలుకు చిత్తశుద్ది అవసరమే తప్ప చట్టం అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ అనే పథకం ప్రవేశ పెడ్తామని చెప్పగా దానిని కాపీ కొట్టి బంగారు తల్లి ప్రవేశపెట్టారని ఆరోపించారు. గతంలో ఉన్న బాలిక సంరక్షణ పథకాన్ని 9 ఏళ్లుగా నిలిపివేశారని విమర్శించారు. ఏపీపీఎస్‌సీ ప్రక్షాళన జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్‌ వద్ద పీఏ పనిచేసిన వ్యక్తిని సభ్యుడిగా నియమించారని ఆయన నేరుగా ఉద్యోగాలు అమ్ముకున్నానని బరితెగించి మాట్లాడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రిటైర్డు ఎంఆర్‌ ఓ గ్రూపు-1 అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తారా అని ఎద్దేవా చేశారు.

తెలుగువారంటే వివక్షే

వరదలో చిక్కకుని మృతి చెందిన వారి కుటుంబాలలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వాసులకు అక్కడి ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం ఇస్తే మన రాష్ట్రం వారికి రెండు లక్షలు ఇచ్చారని, మన ప్ర భుత్వం మూడు లక్షలు ఇస్తామని ప్రకటించిందని తెలుగువారంటే ఎంత వివక్షో దీనిని బట్టి అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. అధికారం, పెత్తనం కావాలని కోరుకునే పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కేవలం పదవులు నిలబెట్టుకోవడానికి ఢిల్లిd చుట్టూ తిరుగుతుంటారని విమర్శించా రు. వరదల సమయంలో మానవత్వం లేకుండా వ్యవహరించా రని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై 9 ఏళ్లుగా ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. డ్యాం కట్టకుండా ముందుగా కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోట్లు దండుకున్నారని ఆరోపించారు.