October 24, 2012

తాము అధికారంలోకి వస్తే పది వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రటించారు. ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా బుధవారం పాలమూరు జిల్లా ఐజలో భారీగా హాజరైన స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఆరు వంట గ్యాస్ సిలిండర్లను మాత్రమే సబ్సిడీకి పంపిణీ చేస్తామని చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే పది సిలిండర్లను సబ్సిడీ కింద పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సబ్సిడీ అన్ని వర్గాల వారికి అందేలా చూస్తామన్నారు.

ఇకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు తనకు వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన బీఈడీ విద్యార్థులతో మాట్లాడుతూ.. బీఈడీ అభ్యర్థులు తన వెంట వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని వారికి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి చికిత్స చేయాల్సిన అవసరం,పది వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ -చంద్రబాబు


TV9 - Chandrababu Naidu speech in Palamooru Meekosam yatra





TV9 - Chandrababu Naidu padayatra at Mahaboobnagar




Chandrababau slims down during padayatra - Tv9





 Chandra Babu Padayatra Day 23 Round Up





Chandrababu Padayatra 23rd day- in Mehaboobnagar dist



23వ రోజు చంద్రబాబు పాదయాత్ర "వస్తున్నా మీకోసం" విశేషాలు టి.వీ కవరేజ్....24.10.2012

అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉండే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, విచ్చలవిడిగా సెల్ ఫోన్‌ సౌకర్యం కల్పించారని, ఎవరికీ లేని సౌకర్యాలు కల్పిస్తున్నారని, జైలులో రాజకీయ భేటీలకు అవకాశం కల్పిస్తున్నారని వీటిపై తాము తాము రాష్ట్ర డిజిపికి లేఖ రాశామని యనమల అన్నారు. లేఖ రాసి మూడు రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాధానం లేదన్నారు. జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డు చేయడం లేదన్నారు. సిసి కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని రికార్డ్ చేసినట్లుగా కనిపించడం లేదన్నారు. వీడియో ఫుటేజ్‌లు ఉంటే వెంటనే వాటిని మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించే అంశంపై అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తామన్నారు. జగన్ జైలులో ఎవరెవరిని కలుస్తున్నారో ప్రభుత్వం బయట పెట్టాలని ఎనమల డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కారం కాలేదని పులివెందులలో జగన్ సోదరి షర్మిల చెప్పడంపై యనమల మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి కాలేదని షర్మిల చెప్పారని, అలాగే ప్రజలు కూడా చెబుతున్నారని, మరి ఎందుకు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదో వైయస్ కుటుంబమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పులివెందులను 35 ఏళ్లుగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ఏలుతుందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వారి పైనే ఉందన్నారు. వైయస్ కుటుంబం ఇన్నేళ్లుగా పులివెందుల సమస్యలను పరిష్కరించనందుకు సమాధానం చెప్పాలన్నారు. ఇంతకాలం పులివెందులను ఏలుతూ అభివృద్ధి చేయని వైయస్ కుటుంబం ఇక రాష్ట్ర సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కు అయింది జగన్ పార్టీయే అన్నారు. తన పైనున్న కేసులు ఎత్తివేయించుకోవడానికి జగన్ కేంద్రంతోనూ రాజీ పడ్డారని ఆరోపించారు. పాలనా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలను తీరుస్తుందన్నారు. రాష్ట్ర సంపదను మొత్తం కాంగ్రెస్ పెద్దలు రోచుకున్నారని ఎనమల ఆరోపించారు.

జగన్‌కు జైలులో ఎవరికీ లేని సౌకర్యాలు ,విచ్చలవిడిగా సెల్ ఫోన్‌ సౌకర్యం,రాజకీయ భేటీలు

అవినీతి చక్రవర్తికి
పట్టపు రాణి గా
అవినీతి పుత్రుడికి
అవినీతి మాతగా
పేరొందిన మీరు
అధైర్యపడితే ఎట్టా?

అల్లుడితో చేరి చేసే
మత ప్రచారాలలో
పాపులను పశ్చాత్తాపం ప్రకటించి
ప్రభువు ఎడల విశ్వాసం
ప్రకటించాలని చెబుతారు కదా
అలా మీరు కూడా
పశ్చాత్తాపం ప్రకటించాలే గాని
బైబిల్ పట్టుకొని ధైర్యం తెచ్చుకొంటే
రేపు రాష్ట్రం లో ని
దొంగలు
ఖూనీకోరులు
అత్యాచారాలు చేసిన వారు
అందరూ బైబిలు పట్టుకొని
ధైర్యం తెచ్చుకొని
చట్టం నుండి తప్పించుకోడానికి
వాళ్ళ వాళ్ళ చెల్లాయిలను
ఇంట్లో వాళ్ళను వేసుకొని
పాదయాత్రలు చేస్తూ
పాలనా పగ్గాలు ఇవ్వమంటే
ప్రజలు ఏమి చెయ్యాలి?
అవినీతి చేసిన వాళ్ళను
ఏలికలును చెయ్యించడమే
అల్లుడి గారి బోధనల
పరమార్ధమా?
పావురాళ్ల గుట్ట అడ్డురాకుండా వుంటే
కొత్త దేవుడు
ఇదే సూక్తులు చెప్పి
ఆచరించమని చెప్పి వుండే వాడా?


ఇంట్లో వాళ్ళను వేసుకొని పాదయాత్రలు చేస్తూ పాలనా పగ్గాలు ఇవ్వమంటే ప్రజలు ఏమి చెయ్యాలి? - చాకిరేవు

 Telugu Desam chief N. Chandrababu Naidu will celebrate a quiet Dasara amidst the people on Wednesday during the Vastunna Meko-sam padayatra underway in Mahbubnagar district.
Mr Naidu, who is also planning to restrict his padayatra to 5—6 km on Wednesday due to the festival, is likely to be joined by his family in Alampur Assembly constituency.
In view of the 117-day padayatra from October 2 to January 26, Mr Naidu will miss major Hindu festivals like Dasara, Diwali and Sankranti besides Christmas on December 25.
The TD chief’s padayatra entered its second day in Telangana region without any problem from T-activists.
Naidu was attended to by physiotherapists following complaint of cramps and pain in the leg. “Though his health is failing, he is in high spirits. He will continue the padayatra without any break,” Telangana Telugu Desam Forum convener E. Dayakar said.

Dasara: Naidu to walk less, meet kin - DC

 

 

Special Correspondent

Padayatra goes off smoothly on the second day in Mahabubnagar district
Telugu Desam Party (TDP) president N. Chandrababu Naidu’s padayatra on the second day in Mahabubnagar district on Tuesday went off smoothly with no protests from Telangana activists and people all along his way raising the issue of lack of water to their fields under the Rajolibanda Diversion Scheme (RDS) canal system.
People at Julakal, ‘26{+t}{+h}Canal’, Venkatapuram, Pardipuram and Uppal cross in Alampur constituency complained about not getting water from RDS. Farmers and women who got an opportunity to express their views told Mr. Naidu that they would not require anything but water in RDS canals. It would resolve all their problems.
A farmer at Julakal told Mr. Naidu that canal restoration works under packages IV and V were taken up while ignoring those of packages I and II and questioned Mr. Naidu on how he, as Leader of the Opposition, would solve their problem.
Mr. Naidu assured him that he would take up the issue with the Chief Minister by writing to him so that works were taken up under packages useful to them.
The TDP, if voted to power in the next elections, would lay special emphasis on giving water to every inch of land under the RDS canal system in Mahabubnagar district, the TDP chief promised.

Telangana issue
On the issue of Telangana, he reiterated that TDP was not against statehood to the region but the issue was in the hands of the Congress.
Alleging that the Congress government had been allowing belt (liquor) shops indiscriminately to fill its coffers, Mr. Naidu said it was not only ruining the lives of the poor but was also bothering him in his padayatra as some people were coming to his programme in an inebriated condition.
Party leaders Nama Nageswara Rao, Motkupalli Narasimhulu, Errabelli Dayakar Rao, Kothakota Dayakar Reddy, Ravula Chandrasekhar Reddy, A. Revanth Reddy and others participated in the padayatra.

Naidu flooded with complaints about lack of water in RDS canals

టిడిపి రాజకీయ ప్రచార యాత్రను ''మీకోసం వస్తున్నా'' పేరుతో సుదీర్ఘ ప్రణాళికతో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పాదయాత్రను ప్రారంభించారు. ఆ పార్టీ నిర్ణయించిన విధానాల రూపకల్పనలో భాగంగా వారు ప్రచారం సాగిస్తున్నారు. అయితే పాద యాత్రను, ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాలను తెలంగాణ ఐకాస అడ్డుకోవడం ప్రజాస్వామ్య విజ్ఞత అనిపించుకోదు. ఒక్కో రాజకీయ పార్టీకి, ఒక్కో రాజకీయ విధానం ఉంటుంది. రాజకీయ అంశంలో గానీ సమస్యల విషయంలోగాని సైద్ధాంతిక అంశా లలో గాని ఏపార్టీ పద్ధతులు వారికి వుంటాయి. ఒక పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో, ఎత్తుగడలు వేస్తుందో, ఇతర పార్టీలు కూడా అదే మాదిరిగా ఆలోచించాలని, మాట్లాడా లని కోరుకోవడం ప్రజా స్వామ్య సూత్రాలకు విరుద్ధం. అదొక విధంగా నియంత పోకడలకు దారి తీస్తుంది. అయితే ఒక పార్టీ అనుసరించే విధానంపై అభ్యంతరాలు, అభి ప్రాయభేదాలు ఉంటే విమర్శ చేయడం ద్వారా ఎత్తి చూపవచ్చు. అంతేకాని ఆ పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమంజసం కాదు.
తెలంగాణ అంశంలో తప్పెవరిది?: ఇపుడు తెలంగాణ అంశం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ సమస్యగానే మారిపోతున్నది. దానికి కారాణాలేంటి? ఈ సమస్య 1956 వ. సంవత్సరం నుండే ప్రారంభమైనది. హమీలతో కూడిన పెద్ద మనుషుల ఒప్పందం కొనసాగింపులో అనేక ఇబ్బందులు ఏర్పడినా ఎప్పటికప్పుడు తాత్కలిక మేనేజ్‌మెంట్‌ ద్వారా అధిగమిస్తూవస్తున్నది. ఇప్పుడు అది పరాకాష్టకు చేరింది.రాష్ట్రంలోను, కేంద్రంలోను కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ ప్రభుత్వాలే వున్నాయి. 2004 లో సూత్రప్రాయంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదించబడిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశం చోటు చేసుకున్నది. 2009లో డిసెంబర్‌ 9న అధికార పూర్వకంగా ప్రకటించబడింది. అయితే ప్రకటించిన విధానం నుండి కేంద్ర అధిష్టానం వెనక్కు పోయింది. అప్పటి నుండి ఎటూ తేల్చకుండా కేంద్రం ఊగిసలాటలో పడింది. చివరికి వారి సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీనే నియంత్రించుకోలేక ఎత్తుగడలలో భాగంగా ఏప్రాంత కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. అలాంటప్పుడు విధాన నిర్ణయం దృఢంగా తీసుకోగలిగే స్థితిలో ఉన్నది కాంగ్రెస్‌ అధిష్టానమే. విధాన నిర్ణయం చేయగలిగిన కాంగ్రెస్‌ అధిష్టానానికి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి లాంటి వారు రాష్ట్రానికి వచ్చి వెళ్త్తూనే వున్నారు. మన రాష్ట్రం నుంచి కీలక పాత్రవహించే కేంద్రమంత్రులు పర్యటిస్తూనే వున్నారు. టి.ఆర్‌.ఎస్‌. అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు సైతం కాంగ్రెస్‌ అధిష్టానంతో మంతనాలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే వున్నారు. అయితే ఈ చర్చలను కూడా మేము రాజకీయ ప్రక్రియలో భాగంగానే చూస్తున్నాము. కాని తెలంగాణాకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో కె.సి.ఆర్‌. ఎలా చర్చిస్తారని ప్రశ్నిస్తే ఐకాస ఏమి సమాధానం చెప్పగల్గుతుంది. అలాంటప్పుడు తెలంగాణ అంశంపై ప్రతిపక్షాలపై పడాల్సిన అవసరం వున్నదా? తెలంగాణకు వ్యతిరేకం కాదని, గతంలోనే లేఖ ఇచ్చామని టిడిపి చెబుతున్నప్పటికీ ఇంకా ఆ పార్టీ ఊగిసలాటలో వుందనడంలో సందేహం లేదు. అయితే వారి పద్ధతులలో వారు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ అంశంపై టిడిపి విధానాన్ని అంగీకరిస్తారా? సమర్థిస్తారా? అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఫలితంగా వచ్చే లాభ నష్టాలకు ఆ పార్టీనే బాధ్యురాలవుతుంది. ఇక బిజెపి కూడా ఒకప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోయినా ప్రస్తుతం అధికార పూర్వకంగానే తెలంగాణ అంశాన్ని సమర్ధిస్తున్నది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం వారి విధానం స్పష్టంగా ప్రకటించ లేక పోతున్నారు. అయితే కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. సమైక్యత కోరే సిపిఐ(ఎం) సైతం ''మా విధానం మాదే. నిర్ణయించగలిగింది కాంగ్రెస్‌ పార్టీయే కాబట్టి వారి నిర్ణయం వారు చేసుకోవచ్చని'' పదేపదే ప్రకటన చేస్తున్నది. ఇక బంతి కేంద్రంలో యుపిఏ సర్కార్‌, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం కోర్టులో ఉన్నది. తెలంగాణ అంశంపై రాజకీయ సానుకూలత ఏర్పడినప్పటికీ ఏకాభిప్రాయమనే కుంటిసాకులతో అంశాన్ని వెనక్కి నెడుతున్నారు. అదే సమయంలో కనీసం నలభై శాతమైనా రాజకీయ ఏకాభిప్రాయం లేని అణు ఒప్పందంపైన, రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం పైన, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పెట్టుబడుల ఉపసంహరణపైన ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఏకాభిప్రాయం రాని అంశంపై ధృఢమైన వైఖరి తీసుకున్న కేంద్రం తెలంగాణ అంశంపై ''ములక్కాడ అడ్డమొచ్చిందని'' తప్పించుకోవటం కాంగ్రెస్‌కు పరిపాటైంది. తెలంగాణకు అడ్డంకిగా వున్న కాంగ్రెస్‌ పార్టీని, ఆపార్టీ కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులను నిలదీయకుండా, విపక్షంలో ఉన్న టిడిపిపైన, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పైన పడటమనేది రాజకీయ నైతికత కాదు. కాబట్టి పాదయాత్రను అడ్డుకోవడం మంచిది కాదు. పాదయాత్రపై విభేదిస్తూ ప్రకటన చేయొచ్చు. కానీ అడ్డగించడం రాజకీయ సంప్రదాయం కాదు. తెలంగాణ అంశాన్ని తేల్చగల స్థాయిలో ఉంటూ ద్రోహం చేస్తున్నది, తెలంగాణకు ప్రధాన శతృవుగా ఉన్నది కాంగ్రెస్‌ పార్టీయే. కాబట్టి అన్ని బాణాలు ఎక్కుపెట్టాల్సింది కాంగ్రెస్‌ వైపే.

సుదీర్ఘ ప్రణాళికతో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం మంచిదికాదు -కె.నారాయణ, సిపిఐ