May 24, 2013



  కొత్త ఉద్యోగాల మాట అటుంచితే... విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు, ఉద్యోగులు వీధిన పడే దుస్థితి నెలకొందని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల మందికి మూడేళ్లలో ఉద్యోగాలు రానున్నాయని సీఎం ప్రకటించడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం 6-10 శాతానికి పెరగగా, రాష్ట్రంలో 9-11 శాతానికి పెరిగిం దన్నారు.
ఇప్పటి వరకు రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇక నుంచి విద్యుత్ కోతతో పరిశ్రమల మూత కారణంగా చిన్న పరిశ్రమల యజమా నులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ శాఖకు మంత్రిని నియమించలేదని, విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. కోత కారణంగా చికిత్సలు అందక... ఆస్పత్రుల్లో చిన్నారులు కూడా మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై కార్యాచరణను ప్రకటించాలని, పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

ఊడుతున్న కొలువుల మాటేమిటి?: మోత్కుపల్లి


ఈ నెల 27 నుంచి మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామంలోని తెలుగు విజయంలో జరగనున్న టీడీపీ మహానాడుకు పార్టీ నేతలు ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా ప్రవేశమార్గం టిప్పుఖాన్ వంతెన వద్ద భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కమాన్‌తో పాటు 80 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ కటౌట్ ఏర్పాటు పనులు చకచక సాగుతున్నాయి.
ఇలాంటి స్వాగత తోరణం, కటౌట్‌లు టిప్పుఖాన్ వంతెన నుంచి అప్పా మీదుగా తెలుగువిజయం వరకు డజనుకు పైగా ఏర్పాటు చేస్తున్నారు. మహానాడులో పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొనే సమయంలో టిప్పుఖాన్ వంతెన నుంచి సభాస్థలి వరకు రెండువేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించే యోచనలో ఉన్నారు.

మహానాడుకు భారీ ఏర్పాట్లు


ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్థి నేత రాజారాం యాదవ్ శనివారం టీడీపీలో చేరనున్నారు. ఆయన ఓయూ విద్యార్థి జేఏసీకి అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి నేతల్లో రాజారాం ప్రముఖుడు. ఆయన ..పెద్ద సంఖ్యలో విద్యార్థులతో కలిసి టీడీపీలో చేరుతున్నారు.
ఒకప్పుడు దేవేందర్ గౌడ్‌కు సన్నిహితంగా ఉన్న రాజారాం తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సన్నిహితంగా మారారు. కాని ఆ పార్టీలో బీసీలకు అవకాశాలు రావడం లేదని ఆయన కినుక వహించారు.

నేడు టీడీపీలోకి ఓయూ విద్యార్థి నేత రాజారాం

హైదరాబాద్‌ : టీడీపీ ప్రజాప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలువనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంని కలిసి కళంకిత మంత్రులను తొలగించాలని కోరనున్నారు.

రేపు సీఎంను కలువనున్న టీడీపీ నేతలు