October 13, 2012

పల్లెలు దాటి, మండలాలు దాటి, ఇకనిప్పుడు జిల్లానూ దాటి పోతున్నాను. ఇన్నాళ్లలో లక్షలాది మందిని కలిశాను. వేలాది గడపలు తొక్కాను. వందకుపైగా సభల్లో మాట్లాడాను. జనం చెప్పిందల్లా విన్నాను. అంతకన్నా వాళ్ల అగచాట్లను దగ్గరగా చూశాను. పల్లెల్లో లాగే వారి బతుకుల్లోనూ చీకట్లు అలుముకున్నట్టనిపించింది.

పొలం గట్లపై దిగాలుగా కూర్చున్న రైతులు, ఏ ఆసరా లేక కూలిపోతున్న కుటుంబాల నుంచి, వృత్తులు పోయి వ్యథ చెందుతున్న మనుషులు, గుక్కెడు నీటి కోసం అంగలారుస్తున్న తల్లుల దాకా ఒక బాధా కాదు..ఒక తలపోతా కాదు..హాస్టల్‌కో, బడికో వెళ్లినప్పుడు నా వైపు ఆశగా చూసే చిన్నారుల కళ్లకు ఇకనే కలను అతకగలను!

ఏదీ కలిసిరాక, చివరకు కడుపున పుట్టిన బిడ్డలూ చేతి కిందకు రాక ఆ అమ్మానాన్నలు పడుతున్న రంపపు కోతను చూడలేకపోయాను.

"చదువుంది.. కొలువు లేదు..చేతులున్నాయి.. పని లేదు..''. వజ్రకరూరు వైపుగా వెళుతూ గడేహోతూరు, పొట్టిపాడు గ్రామాలకు వెళ్లినప్పుడు ఎదిగొచ్చిన కొడుకుల గురించి బెంగపడుతున్న జనం కనిపించారు. వారి పక్కనే అపరాధుల్లా నేలవైపు చూస్తూ కొంతమంది యువకులు నిలబడ్డారు. చదివినా ఉద్యోగాలు రాక గ్రామంలో ఏదో పని చేసుకు బతుకుతున్నామని వారంతా చెప్పుకొచ్చారు.

"సార్ మా కుటుంబాలకు కొంత భూమి ఉంది. కానీ, ఇంటిల్లిపాది పనిచేసేందుకు అది చాలదు. సాగు చేసినా మిగిలేదేమీ ఉండటం లేదు. వలస పోదామంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసేదెవరు?'' అని ఆ నిరుద్యోగులు అడుగుతుంటే, ఇదంతా సమాజం మంచికి జరగడం లేదనిపించింది.

ఏ 'కిరణాలూ' తమకు తెలియవని, డిగ్రీలు చదివినా దిక్కు లేదని వారు చెబుతుంటే వీళ్ల ఆగ్రహం ఏ అశాంతికి బీజం నాటుతుందోనని కలవరపడ్డాను. వాళ్ల తాలూకు బంధువులో, బాబాయిలో, వరసకు అన్నయ్యలో పదేళ్ల కిందట హైదరాబాద్‌కో, అమెరికాకో వెళ్లినట్టు తెలిసినప్పుడు.. ఈ యువకులు చేసిన పాపం ఏమిటనిపించింది. నా హయాంలో జరిగిన మంచిని చూసి సంతోషించనా! ఒక తరం తరమే తల్లడిల్లుతున్నందుకు చింతించనా!

ఆ కళ్లకు ఏ కల అతకాలి!

12th day padayatra photos














12వ రోజు వస్తున్నా మీకోసం పోటోలు.13.10.2012

13th Day vastunnameekosam padayatra route

13వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్ 14.10.2012

  చంద్రబాబు పాదయాత్ర  వస్తున్నా మీకోసం, విమర్శలు,రోజువారి వార్తలు 

  వీటిని చూడలంటే వాటి పై క్లిక్ చెయ్యండి.



షర్మిల పాదయాత్రపై బాబు ఫైర్, ఒత్తిడికేనని వ్యాఖ్య 


పాదయాత్ర: మాట్లాడుతూ సొమ్మసిల్లిన చంద్రబాబు


 బాబు డైలాగ్: జగన్ పార్టీకి ట్విట్టర్‌లో లోకేష్ సూచన


 వ్యూహాత్మకంగా: ఇంటర్వ్యూలకు నారా లోకేష్ నో


 పెంపుడు, సొంత కొడుకుల కుమ్మక్కు: విజయమ్మపై రేవంత్


 బాబుపై పిటిషన్లన్నీ కొట్టేశారు, విజయమ్మకు..: రేవంత్


 తెలంగాణపై బాబు దృష్టి: కొడంగల్ నుండి పాదయాత్ర


 కిరణ్ రెడ్డి, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం


 చంద్రబాబు యాత్ర: వేషాలు మార్చేన్, ప్రజలతో కలిసేన్ 


 అభిమానుల పూలతో బాబు కళ్లకు ఇన్ఫెక్షన్, ఆలస్యం


 అల్లుడామజాకా: జగన్‌తో రాబర్ట్‌వాద్రాను పోల్చిన బాబు


 కాంగ్రెసు కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్: చంద్రబాబు 


మంత్రి ఇంటిమీదుగా బాబు: చేతులూపిన అనుచరులు 


బాబు యాత్రపై బెట్టింగ్స్‌: లాసైన జగన్ పార్టీ నేతలు


 జైలుకు పంపిస్తా: బాబు, కాలి బొబ్బలతోనే పాదయాత్ర


 బాబుయాత్రలో 6రోజులుగా బుడతడు: సాక్షిపైటిడిపి ఫైర్ 


 జగన్ పార్టీని బహిష్కరించాలి: బాబు, 100కిమీల నడక


 మహిళకు బాబు గోరుముద్ద: విచిత్రవ్యక్తి.. సిఎంపై సెటైర్


 పరిటాలది ప్రభుత్వ హత్యే: బాబు, వెంట పరిటాల శ్రీరామ్ 


 బాబుకు కండరాల నొప్పి, ఫిజియో థెరపిస్టుల సేవలు


 పాదయాత్రలోనూ మారని బాబు అలవాట్లు


 నాడు నేను చెప్పిందే నిజమైంది: బాబు, బట్టలు ఇస్త్రీ


 నా రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఎవరికైనా ఏళ్లు: చంద్రబాబు


 లోకేష్ హల్‌చల్: కలివిడిగా ఉంటూ.. ఆసక్తిగా వింటూ..


 పర్మిషన్ అవసరంలేదు, కుప్పంఅంటే ఊరుకోరు: లోకేష్


 కాళ్లకు నొప్పులు, 20 ఏళ్లుగా రోజుకు 2గంటలు: బాబు


 తప్పులు దిద్దుకునేందుకు బాబు సిద్ధం, యాత్ర ఆలస్యం


 1 నుండి 10 వరకు బాబే: పయ్యావుల, హరికృష్ణ పైనా..


 జయలలిత బాట వదిలి.. చేతులుజోడిస్తున్న బాబు!




















తెలుగు వన్ ఇండియా లో చంద్రబాబు పాదయాత్ర పై వార్తలు మీ కోసం....

వస్తున్నా మీకోసం 12వ రోజు అన్ని తెలుగు TV చానెల్స్ విడీయెలు


TV9

12వ రోజు అన్ని తెలుగు TV చానెల్స్ విడీయెలు

  అనంతపురం జిల్లాలో 12 రోజులుగా పాదయ్రాత చేస్తున్న చంద్రబాబు నాయుడును ఆయన సతీమణి నందమూరి భువనేశ్వరి శనివారం ఉరవకొండ మండలం చిన్నహోతూరు వద్ద కలిసి పరామర్శించారు. శుక్రవారం పాదయాత్రలో ఆయన అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఆమె హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి బాబు బసచేసిన ప్రాంతానికి చేరుకున్నారు.

ఆయన బస చేసిన బస్సులోకి వెళ్లి పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వెన్ను పట్టేయడం, కాలికి బొబ్బలు రావడం తదతర వాటిని చూసిన భువనేశ్వరి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకేమీ కాదని, ప్రజల కష్టాల ముందు తన ఇబ్బందులు లెక్కలోకి రావని చంద్రబాబు ఆమెతో అన్నట్లు సమాచారం. ఆదివారం కూడా భువనేశ్వరి చంద్రబాబు వెంటే ఉండి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని, గుంతకల్లు సమీపంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాల యంలో చంద్రబాబు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం. 










బాబును పరామర్శించిన భువనేశ్వరి & 12వ రోజు యాత్ర పోటోలు

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర
టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 10 సిలిండర్లు
వైఎస్సార్‌సీపీవి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు 

కిరణ్ సర్కార్ అసమర్థ పాలన వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఫీజు రియింబర్స్‌మెంట్, పదో తరగతి చదివిన వారికి సైతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో నిరోద్యోగ భృతి కల్పిస్తామన్నారు.

శనివారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం గడేహోతు నుంచి చంద్రబాబునాయుడు 12వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. గొర్రెలు కాసే మహిళలు ఈ గ్రామంలో బాబును కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీతివంతమైన పాలనపై యువత దృష్టిసారించాలని అన్నారు. సోనియా గాంధీ చెప్పినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదనపు సిలిండర్లు ఇవ్వడం లేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి కుటుంబానికి10 సిలిండర్లను ఇస్తామని, నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వితంతువులకు, వృద్ధులకు రూ. 600 పింఛను సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీని ప్రవేశపెట్టింది టీడీపీయేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో అప్పులు లేని వారు ఎవరైనా ఉంటే వారు పుణ్యపురుషులే అని ఆయన అన్నారు. అవిశ్వాసం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బేరసారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోదని ఆయన ధ్వజమెత్తారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీలో బేరసారాలకు దిగుతారని, వారు చేసే పాపకార్యలకు తాము సహకరించాలా అని ప్రశ్నించారు. వైఎస్సార్ పార్టీ నేతలు ప్రణబ్‌కు ఓటు వేసి ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

"వస్తున్నా...మీకోసం'' కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలోని గడేహోతు నుంచి పొట్టిపాడు మీదుగా ఛామాపురం చేరుకుని చంద్రబాబు అక్కడ భోజనం చేశారు. అనంతరం కనకొండ్ల, గుంతకల్లు వరకు పాదయాత్రగా వెళ్లారు. హనుమాన్ సర్కిల్‌లో బాబు రాత్రికి బస చేయనున్నారు. ఈ రోజు మొత్తం 20.3 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా నిన్న స్వల్ప అస్వస్థతకు గురైన చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కలుసుకున్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర 13.10.2012

press note from Telugudesam desam party office

ప్రెస్ నోట్...గుంతకల్, అలూరు సెగ్మెంట్ లలో పాదయాత్ర

'వస్తున్నా.. మీ కోసం' అంటూ చేపట్టిన పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం 11వ రోజున 200 కిలోమీటర్లు పూర్తి చేశారు.    ఆ పోటోలు చూడండి.....





















11th Day padayatra photos -part 2

11 వరోజు పాదయాత్ర పోటోలు- Part 2 (12.10.2012)

నేటి పాదయాత్ర సాగుతూందిలా   ............Today Padayatra Route Shedule

నేటి పాదయాత్ర సాగుతూందిలా....13.10.2102