June 12, 2013

హైదరాబాద్: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికి మేనమామ కాదని టీడీపీ నాయకడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎవరూ చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని కాంగ్రెస్‌కు శకుని మామగా ఆయన వర్ణించారు.

కాంగ్రెస్‌కు శకుని మామ జేసీ: టీడీపీ

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసనకు దిగారు. ఎన్జీ రంగా వర్సిటీలో మంత్రి కన్నా, ఆయన బంధువులు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రైతు సమస్యలపై రాజీలేని పోరాటం

రాష్ట్రంలో రైతు సమస్యలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. గన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెలిపారు. రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ సహాయం అందట్లేదని అన్నారు. ఇప్పటి వరకు 23వేల మంది రైతులు బలవన్మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు.

రైతు సమస్యలపై టీడీపీ ధర్నా


హైదరాబాద్‌ : తెలంగాణ కోసం జరిగిన వెయ్యి బలిదానాలకు కేసీఆరే బాధ్యుడని టీడీపీ నేత మోత్కుపల్లి ఆరోపించారు. డబ్బున్నోళ్లకే టికెట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ వైఖరిని ప్రజలు గమనించాలని చెప్పారు. టీజేఏసీ టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌, కోదండరాంలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఛలో అసెంబ్లీకి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు

బలిదానాలకు కేసీఆరే కారణం

హైదరాబాద్ : ఈ నెల 14న టీ జేఏసీ తలపెట్టబోయే ‘ఛలో అసెంబ్లీ’కి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే.. తాము జేఏసీ పిలుపు మేరకో, టీఆర్‌ఎస్ పిలుపు మేరకో ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం లేదని, తెలంగాణ ప్రజలకోసమే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమౌతున్నామని మోత్కుపల్లి ప్రకటించడం కొసమెరుపు.

ఛలో అసెంబ్లీకి టీడీపీ సంపూర్ణ మద్దతు

కాంగ్రెస్ నేతలతో కలయికపై బాబు ఆవేదన కాంగ్రెసు పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ తనపై రాజకీయ విమర్శలు గుప్పించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెసు నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ వాటిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని పార్టీ నేతలతో అన్నారు.

కొందరు వాటికి వక్రభాష్యం చెబుతున్నారన్నారు. ఇకపై తాను ఎవరినీ కలువనని చెప్పారు. ప్రచారం కోసమే తనపై ఇలాంటి ఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రచారం కోసం ఇలా చేసే నేతలను అనుమతించరాదని బాబు పార్టీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విమర్శలపై కాంగ్రెస్ నాన్ సీరియస్‌గా ఉందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలతో కలయికపై బాబు ఆవేదన

హైదరాబాద్‌ : టీడీపీ ఎమ్మెల్యేలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని వాయిదా వేస్తున్నా ఎమ్మెల్యేల్లో స్పందన లేదని పేర్కొన్నారు. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా, పట్టనట్టుగా ఉంటున్నారని మండిపడ్డారు. 3 గంటల పాటు సభలో కూర్చోలేని వారు రాజకీయాల్లో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మునగడానికి మీరు సిద్ధంగా ఉన్నా, తాను లేనని ఆయన వారికి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలపై బాబు ఆగ్రహం

హైదరాబాద్: ప్రభుత్వం సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, దీనికి అనుగుణంగా స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. ప్రతిపక్షాలను అవమానపరిచే విధంగా మాట్లాడిన మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఏ ఒక్కరి సొత్తు కాదు: టీడీపీ