June 12, 2013

రైతు సమస్యలపై టీడీపీ ధర్నా

హైదరాబాద్‌ : రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసనకు దిగారు. ఎన్జీ రంగా వర్సిటీలో మంత్రి కన్నా, ఆయన బంధువులు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రైతు సమస్యలపై రాజీలేని పోరాటం

రాష్ట్రంలో రైతు సమస్యలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. గన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెలిపారు. రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ సహాయం అందట్లేదని అన్నారు. ఇప్పటి వరకు 23వేల మంది రైతులు బలవన్మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన చెప్పారు.