September 9, 2013

వై.ఎస్.ఆర్.కాంగ్రస్ విభజన వాద పార్టీనేనని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు.దానికి ఆయన ఒక కారణం కూడా చెప్పారు.తెలంగాణలో మొత్తం పార్టీని ఎత్తేసుకుని సీమాంద్రకే పరిమితం అవుతున్నారంటే విబజన కోరుకుంటున్నట్లా?లేక సమైక్యం కోరుకుంటున్నట్లా అని ఆయన ప్రశ్నించారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విభజన వాద పార్టీనే : కోడెల

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు బస్ యాత్రను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని టిడిపి లోక్ సభ మాజీ సభ్యుడు గద్దె రామ్మోహన్ అన్నారు.గ్రామాలలో జనం చంద్రబాబుకు నీరాజనం పడుతున్నారని, మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన చెప్పే విషయాలను విని అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికే ఈ కుట్ర జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు యాత్రను ప్రజలు ఆదరిస్తున్నారు : గద్దె రామ్మోహన్

ఆత్మగౌరవం కాపాడతా
దేశాన్ని పాలిస్తున్న నేతలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా
రు. ఆత్మగౌరవయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి రెడ్డిగూడెం విచ్చేసిన బాబు పాలకుల అవినీతిని ఎండగట్టారు. రెడ్డిగూడెం మొదటిసారిగా వచ్చాననీ, మీ ఆదరణ మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ పుట్టినగడ్డ కృష్ణాజిల్లా కావడం, తనకు ఈ జిల్లా ప్రజలంటే గౌరవమన్నారు.
కాంగ్రెస్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసమర్ధ ప్రధాని కావడం వల్లే ఎవరికి దొరికినంత వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. బొగ్గుకు సంబంధించి 190 ఫైళ్ళు మాయమయినా ప్రధానికి చీమకుట్టినట్లైనా లేదని వాపోయారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారడంతో అవినీతికి హద్దులేకుండా పోయిందన్నారు. అవినీతి కారణంగా దేశ ప్రజలు కోలుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. ధరలు అదుపుచేయలేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయరంగం కుదేలైపోయిందన్నారు. మరోపక్క సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వాపోయారు.
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని కాంగ్రెస్ నాయకులు కోట్లు దండుకుంటున్నారని ఆరోపిం చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా.. ప్రజాసమస్యలు, ధరలు దారిలోకి తెస్తానంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. లక్షలకోట్లు దోచుకున్న వారు రాష్ట్రాన్ని ఏలాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటలీకి- ఇడుపులపాయకు సంధి కుదిరిందని, ఈనేపథ్యంలో ఇటలీ సోనియా రూ.5లక్షల కోట్లు దోచుకోగా, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి రూ.100కోట్లు దోపిడీ చేశారన్నారు. ఈ అవినీతిని తెలుసుకున్న రాష్ట్రప్రజలు గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీని చిత్తుగా ఓడించారన్నారు. రానున్నకాలంలో దేశం పార్టీ రెపరెపలాడుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాల హక్కును సాధించితీరతానన్నారు.
విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడగలనని హామీఇచ్చారు. సింగపూర్ తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ది చేశానన్నారు. కుట్రలోభాగంగా రాష్ట్రాన్ని కొన్నిశక్తులు విడదీసి రాజకీయ లబ్దిపొందటానికి సన్నాహాలు చేయడాన్ని ఆయన ఖండించారు.
గత 38 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్రప్రభుత్వానికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగువారి పరువు ప్రతిష్ఠ కాంగ్రెస్ మంటకలిపిందని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాను కాపాడతానన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. ఒక కుటుంబం వల్ల రాష్ట్రం, ఒకవ్యక్తి కారణంగా దేశం అవినీతి అసమర్దతతో చిన్నాభిన్నం అయ్యాయని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు చక్కిదిద్దబడతాయన్నారు. కేశినేని నాని, దేవినేని ఉమా, వర్ల రామయ్యలు ప్రసంగించారు.

అసమర్ధ ప్రధాని కావడం వల్లే ఎవరికి దొరికినంత వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు...

ఆత్మగౌరవ యాత్రలో బాబు
 గత 40 రోజులుగా రాష్ట్రం అట్టడుకుతుంటే, కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని, కేంద్రం ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అయంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నేతల కనుసైగలతో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు నడుస్తున్నాయని, ఈ రెండు పార్టీలు ఏం మాట్లాడాలో కేంద్రం నుంచే స్క్రీప్ట్ వస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ తొలగిపోయి, దేశానికి, తెలుగుజాతికి పూర్వవైభవం రావాలని వినాయకున్ని ప్రార్థించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు వెళుతున్న బస్సులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని, అలాగే సీమాంధ్రలో కాంగ్రెస్, వైసీపీలు దాడులకు ఎగబడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లు దాడులు చేసి రెండు ప్రాంతాల్లో టీడీపీని విమర్శిన్నాయని ఆయన మండిపడ్డారు.
కాగా రంగాపురంలో చంద్రబాబు బస్సు యాత్రంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తావన తేవాలని వారు నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు వారిని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా జూ. ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన విరమించలేదు. పోలీసులు జోక్యంతో అంతా సద్దుమణిగింది.

అట్టడుకుతున్న రాష్ట్రం... కాంగ్రెస్కనుసైగల్లో టీఆర్ఎస్,వైసీపీ

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి రాష్ట్ర విభజన జరగడం ఇష్టం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేనా పార్టీలా టీఆర్ఎస్ వసూలు పార్టీయని ఆయన ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలను టీడీపీ ద్వేషించడంలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను కేంద్రం ఏక పక్షంగా చేయాలనుకేంటే ఊరుకునేది లేదని, జేజమ్మకాదు, బ్రహ్మదేవుడు దిగిరావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది కాబట్టే ఆ పార్టీని విమర్శించడంలేదని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నుంచి సలహాలు తీసుకునే స్థితిలో టీడీపీ లేదని ఆయన వెల్లడించారు.

టీఆర్ఎస్‌కు రాష్ట్ర విభజన ఇష్టం లేదు : సోమిరెడ్డి

కృష్ణా, సెప్టెంబర్ 9 : గత 40 రోజులుగా రాష్ట్రం అట్టడుకుతుంటే, కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని, కేంద్రం ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారితో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అయంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నేతల కనుసైగలతో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు నడుస్తున్నాయని, ఈ రెండు పార్టీలు ఏం మాట్లాడాలో కేంద్రం నుంచే స్క్రీప్ట్ వస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ తొలగిపోయి, దేశానికి, తెలుగుజాతికి పూర్వవైభవం రావాలని వినాయకున్ని ప్రార్థించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు వెళుతున్న బస్సులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని, అలాగే సీమాంధ్రలో కాంగ్రెస్, వైసీపీలు దాడులకు ఎగబడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లు దాడులు చేసి రెండు ప్రాంతాల్లో టీడీపీని విమర్శిన్నాయని ఆయన మండిపడ్డారు.

అట్టడుకుతున్న రాష్ట్రం కాంగ్రెస్కనుసైగల్లో టీఆర్ఎస్,వైసీపీ ఆత్మగౌరవ యాత్రలో బాబు