December 7, 2012



6-12-2012:

ఉదయం బాసర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం బా సరలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. తర్వాత మైలాపూర్, బాసర ట్రి పుల్ ఐటీ, బిద్రవెల్లిలో మధ్యాహ్న భో జనం. టాక్లీ, ముథోల్‌క్రాస్, ముథోల్ మెయిన్‌రోడ్‌లో రాత్రి బస.

మొదటి రోజు 16.2 కిలో మీటర్ల పాదయాత్ర.
7-12-2012:

ముథోల్ మెయిన్ రోడ్, తరోడ మీ దుగా భైంసా సరస్వతీనగర్, దేగాం లో మధ్యాహ్న భోజనం, భోకర్‌క్రాస్, భైంసా బైపాస్‌క్రాస్, భైంసా మెయిన్ రోడ్‌లో రాత్రి బస.

రెండో రోజు 15.9 కిలో మీటర్ల పాదయాత్ర.

8-12-2012:

భైంసా మెయిన్ రోడ్, మోటేగాం, వానలపాడ్‌లో మధ్యాహ్న భోజనం. కుంటాల మండలంలోని తిమ్మాపూర్ క్రాస్, కల్లూరు, బూర్లపల్లి, అర్లిక్రాస్, చౌక్‌పల్లిలలో పర్యటించిన అనంతరం కుంటాల క్రాస్ వద్ద రాత్రి బస.

మూడో రోజు 15.5 కిలో మీటర్ల పాదయాత్ర.

9-12-2012:

కుంటాల క్రాస్, నందన క్రాస్, న ర్సాపూర్, నసీరాబాద్, రాంపూర్, గుం డంపల్లి, దిలార్‌పూర్ టెంపుల్‌క్రాస్ దా టిన తర్వాత చర్చి పక్కన రాత్రి బస.

నాలుగో రోజు 12.3 కిలో మీటర్ల పాదయాత్ర.

10-12-2012:

దిలావర్‌పూర్ టెంపుల్ క్రాస్ దాటిన తర్వాత లోలం, కాల్వతండా క్రాస్,సిరాపూర్ క్రాస్, చిట్యాల క్రాస్, తల్వేదక్రాస్ వద్ద మధ్యాహ్న భోజనం. మంజూలాపూర్, ఈద్గా చౌరస్తా (నిర్మల్), రూరల్ పోలీస్ స్టేషన్ (నిర్మల్) వద్ద బహిరంగ సభ, మంచిర్యాల క్రాస్ రోడ్ (నిర్మల్), శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్ రాత్రి బస.

ఐదో రోజు 16.2 కిలో మీటర్ల పాదయాత్ర.

11-12-2012:

వెంకటాపూర్, అక్కాపూర్, మార్జాపూర్, కొత్త వెల్మల్, వెల్మల్ బొప్పారం వద్ద మధ్యాహ్న భోజనం. పీచర, ధర్మారం, మల్లాపూర్ వద్ద రాత్రి బస.

6వ రోజు 15.4 కిలో మీటర్ల పాదయాత్ర.

12-12-2012:

మల్లాపూర్, లక్ష్మణ్‌చందా, తెరిపెల్లి గాంధీచౌక్, కోరిటికల్ వద్ద మధ్యాహ్న భోజనం. కోరిటికల్, మామడ, పోనిక ల్‌క్రాస్,డాంబర్‌ప్లాంట్ వద్ద రాత్రి బస.

7వ రోజు 16.9 కిలో మీటర్ల పాదయాత్ర.

13-12-2012:

డాంబర్‌ప్లాంట్, దిమ్మదుర్తి,ఎక్బాల్‌పూర్, ఖానాపూర్ క్రాస్‌రోడ్, ఖానాపూర్ వద్ద మధ్యాహ్న భోజనం. తర్వాత ఖానాపూర్‌లో బహిరంగ సభ, సుల్జాపూర్, బాదనకుర్తిలో బహిరంగ సభ.

8వ రోజుకు 15.7 కిలో మీటర్ల పాదయాత్ర. కరీంనగర్‌లోని ఓబులాపూరం వద్ద రాత్రి బస.

ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర వివరాలు..

ఆదిలాబాద్ :టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర గురువారం ఉదయం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఎంచ గ్రామం మీదుగా చం ద్రబాబునాయుడు పాదయాత్ర బుధవారం రాత్రి బాసరకు చేరుకుంది. చం ద్రబాబునాయుడు పాదయాత్రకు జి ల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో గురువా రం నుంచి ప్రారంభమయ్యే పాదయా త్ర ఈ నెల 13 వరకు కొనసాగుతుం ది. 8 రోజుల్లో మూడు నియోజకవర్గా ల మీదుగా 124 కిలోమీటర్లు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తారు.

ప్రతి రోజు 13 నుంచి 17 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చే శారు. చంద్రబాబునాయుడు తన పా దయాత్ర సాగే ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలను, చేన్లలో, పొలాల్లో పని చేసే రైతులను, కూలీలను పలకరి స్తూ వారి సమస్యలను తెలుసుకోనున్నారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా బాసర, నిర్మల్, ఖానాపూర్‌లో బహిరంగ సభలను ని ర్వహించేందుకు టీడీపీ నేతలు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభల కు భారీ జన సమీకరణ చేయడంతోపా టు చంద్రబాబునాయుడు పాదయాత్ర లో ప్రతి రోజు 5 వేల మంది పా ల్గొనే లా జిల్లా నేతలు చర్యలు చేపడుతున్నారు.

వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర గురువారం ఉదయం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం

భైంసా: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పేరిట జిల్లాలో గురువారం నుంచి నిర్వహించబోయే యాత్ర ఏ ర్పాట్ల పై బుధవారం ఎంపీ రాథోడ్ రమేష్ ఆ పార్టీ ప్రతినిధులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జీ నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శులు లోలం శ్యాంసుందర్, అబ్దుల్ కలాం, రాష్ట్ర ప్రతినిధి రమాదేవి, జిల్లా ప్రతినిధులు బోయిడి విఠల్, బాశెట్టి రాజన్న, వి మోహన్, ఎస్సీ సెల్ జిల్లా ప్రతినిధి దేవిదాస్‌తోపాటు పలువురితో కలిసి సమీక్షించారు. గురువారం ఉదయం బాసర నుంచి ప్రారంభమయ్యే యాత్ర ముథోల్ వరకు కొనసాగనుంది.

ఇం దులో బాగంగా మధ్యాహ్న భోజన స్థ లం, రాత్రి బస చేసే స్థలలు,ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. యాత్రలో పా ల్గొనే వారి, బస చేసే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ ప్రతినిధులు బాద్యతాయుతంగా వ్యవహరించి యాత్రను విజ యవంతం చేయాలని సూచించారు.

బాబు యాత్ర ఏర్పాట్లపై ఎంపీయ సమీక్ష

ఆదిలాబాద్: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ స్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలోని బాసర, మై లాపూర్, బాసర ట్రిపుల్ ఐటీ, బిద్రెల్లి, టాక్లీ క్రాస్ వరకు గురువారం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిం చారు.

ఈ సందర్భంగా బాసరలో, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. దేశంలో రెండే సరస్వ తీ దేవలయాలు ఉన్నాయనీ, ఒకటి కాశ్మీర్‌లో ఉంటే మరొకటి బాసరలో ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాం లో బాసర సరస్వతీ ఆలయంతోపాటు భద్రాచలం, కీసరగుట్ట ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బాసరలో మరిన్ని కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరూ అక్ష రభ్యాసానికి బాసరకు వచ్చేలా అ భివృద్ధి చేసి, ప్రపంచ పటంలో బాసర కు స్థానం కల్పిస్తామన్నారు. బాసరలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయించ డంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

బాసరలో ఐఐటీ ఏ ర్పాటు చేయాలని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య కోరారనీ, తాను సీఎంగా ఉన్నపుడే బాసరలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేశాన న్నారు. వైఎస్ సీఎం అయిన తరువాత ఐఐటీని రంగారెడ్డి జిల్లాకు తరలించి, బాసరలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయించారని చెప్పారు. బాసరలో ఏ ర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీలో సౌ కర్యాలు లేక విద్యార్థులు అనేక ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. టీ డీపీ హయంలోనే జిల్లాలో ఎన్నో అ భివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చే శామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు 9 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు రైతుల తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు.

బీసీలకు రాజకీయ న్యాయం చేసేదుకు బీసీ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సామాజిక న్యా యం పేరిట చిరంజీవి తన మంత్రి ప దవి కోసం పార్టీని విలీనం చేశారని విమర్శించారు.

కిరణ్ సర్కార్ చేతకాని ప్రభుత్వమ నీ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్సాఆర్ సీపీ, టీఆర్ఎస్ పై ఆయన నిప్పులు చెరిగారు. స్వార్థం కోసం టీడీపీని వీడిన నా యకులకు భవిష్యత్ ఉండదన్నారు. కొంత మంది నాయకులు పార్టీని వీడారనీ, కార్యకర్తలు మాత్రమే పార్టీలోనే ఉన్నారన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి న్యాయం చేస్తామన్నా రు. చంద్రబాబునాయుడు పాదయా త్రలో టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యేలు నగేశ్, సుమన్‌రాథోడ్, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, టీడీపీ నేతలు పాయల శంకర్, యూనిస్ అక్బానీ, నారాయణ రెడ్డి, లోలం శ్యాంసుందర్, అరిగెల నాగేశ్వర్‌రావు, పాటి సుభద్ర, అందు గుల శ్రీనివాస్, జుట్టు అశోక్, జీవి రమణ, బుచ్చిలింగం, పి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు రూ. 6 వందల పింఛన్: తమ పార్టీకి అధికారం ఇస్తే అన్ని వ ర్గాల వారు సామాజిక న్యాయం చే స్తామని టీడీపీ అధినేత నారా చం ద్రబాబు నాయుడు వెల్లడించారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా బాసరలో, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు.

అర్హులైన వారందరికి రూ. 600 పింఛన్లుగా అందిస్తామన్నారు. కేంద్రం సహకరిస్తే ఈ నిధులను మరింతగా పెంచుతామన్నారు. రూ. లక్షతో నిరుపేదలందరికి ఇళ్లు నిర్మింపజేస్తామన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో తాము ఏమి చెప్పాలో.. అదే చెబుతామన్నా రు. తమ పార్టీ తెలంగాణ వ్యతిరేకం కాదన్నారు. రెండు ప్రాంతాల్లో ఉన్న త మ పార్టీన రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం పరిష్కరించకుండా దురుద్దేశ్యంతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో అభివృ ద్ధి చేసింది తమ పార్టీయేనన్నారు. గతంలో చెన్నారెడ్డి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా సామాజిక తెలంగాణ అన్న చిరంజీవికూడా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారనీ, టీఆర్ఎస్‌ను కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెబుతున్నారన్నారు. దాంతో రాష్ట్రంలో తమ పార్టీ మాత్రమే ఉంటుందన్నారు.

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా..

(ముథోల్/భైంసా/ లోకేశ్వరం/కుంటాల)ముథోల్ నుంచి శుక్రవారం ప్రా రంభమైన బాబుపాదయాత్రలో ప్రజలు అడుగడుగనా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలను తీర్చడానికి నేను మీకు అండ గా ఉంటానని చంద్రబాబు నా యుడు పునర్ఘటించారు. ముథోల్ నుంచి ప్రారంభమైన యాత్రకు మొదట బీడీ కార్మికులు పెద్ద ఎ త్తున కలిసి సమస్యలను వివరించా రు. తమకు బీడీ చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో పాటు త గింతన కూలీ లభించడం లేదని, ఫించన్ సైతం అందడం లేదన్నా రు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే డ్వాక్రా సంఘాలను నె లకొల్పి ర్వీలింగ్‌ఫండ్ ఇచ్చి మహిళలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

వెయ్యి బీడీలకు రూ.150, కనీ సం పింఛన్ రూ.1500 అందిస్తామన్నారు. రహదారిలో పాదయాత్ర చేస్తున్న బాబుకు తాండూర్ మం డల వాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మాజీ మండల అధ్యక్షులు బాశెట్టి రాజన్న ఆధ్వర్యంలో సమస్యల గురించి వివరించారు. సుద్దవాగు ద్వారా సాగు నీ రు, వర్షాధార భూములకు ప్రాణహిత చేవేళ్ల ద్వారా నీటిని అందించాలని, తానూర్‌లో జూనియర్ క ళాశాల ఏర్పాటు, పత్తి ధర క్వింటాలకు రూ.6వేలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముథోల్ గురుకుల విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి అమ్మనాన్న కళలను నెరవేర్చాలన్నారు.

తెలంగాణకు వ్యతిరేకం కాను..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ పార్టీ ఎన్నుడు వ్యతిరేకం కా దని చంద్రబాబు నాయకుడు అ న్నారు.

తరోడలో జరిగిన బహిరం గ సభలో ఆయన మాట్లాడారు. అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేస్తే తమ వైఖరిని వెల్లండించేందు కు సిద్ధంగా ఉన్నామన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రూ.25కోట్లతో ఉప ప్రణాళిక తయారు చేస్తామని, ఇస్లామిక్ బ్యాం క్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాల మాఫీకి తొలి సంతకం చే స్తామన్నారు. మార్గమధ్యంలో కు భీర్ మండలం గొడిసారకు చెందిన వెంకటి అనే అంధుడికి రూ.2వేలు, వాయిలింగికి చెందిన కిషన్ అనే వికలాంగునికి రూ. 2వేలు నగదును అందజేశారు.

మీకు అండగా ఉంటా..

ఆదిలాబాద్ : తనకు అధికారం ఇస్తే నీతివంతమైన పాలన అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపుతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ స్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి ముథోల్, తరోడ, దేగాం, బోకర్‌క్రాస్, బైంసాక్రాస్, బైంసా పట్టణం వరకు 15.9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో ప్ర జా వ్యతిరేక విధానాలను అవలంభి స్తూ అన్ని వర్గాల ప్రజలను అథోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఏ గ్రామంలో చూసినా, పట్టణంలో చూసినా పారిశుధ్యం లోపించిందన్నారు. కూడుకుపోయిన మురికి కాలువలు, గుంతలమయంగా మారిన రోడ్లే కనిపిస్తున్నాయాన్నరు. ఎడాపెడా విద్యుత్ చార్జీలను పెంచుతూ అన్ని వర్గాల ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందు ల ధరలు నింగినంటాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతుండడంతో అన్నదాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్య తరగతి ప్ర జలు అర్ధాకలితో అలమటించాల్సిన ప రిస్థితులు నెలకొన్నాయన్నారు. మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తాము దీపం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సి లిండర్లపై కోత విధిస్తూ కేవలం 6 మాత్రమే సరఫరా చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసుపత్రుల్లో, విద్యా సంస్థల్లో సిబ్బంది కొరత తీవ్రరూ పం దాల్చడంతో సమస్యలు పెరుగుతున్నాయన్నారు.

వీటన్నింటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మూలంగా ప్రజానీకం కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. వీటన్నింటి నుంచి విముక్తి పొంది స్వచ్ఛమైన, నీతివంతమైన, సమర్థవంతమైన పాలనను పొందేందుకు గాను తమ పార్టీకి పగ్గాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే ముథోల్ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నెలకొల్పుతామన్నారు. షాదీఖానాను నిర్మింపజేస్తామన్నారు. బెల్టు షాపులన్నింటిని రద్దు చేస్తామన్నారు.

గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికి ప్రతి సంవత్సరం 10 సిలెండర్లు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఒక మామూలు డాక్టర్‌ను ఎమ్మెల్యేను, రాష్ట్రమంత్రి, ఎంపీ, కేంద్రమంత్రిని చేస్తే ఆయన పార్టీని వీడి వెళ్లిపోయాడ నీ, ఆయనతో కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదన్నారు.

ఒక వ్యక్తిపోతె పార్టీకి ఎ లాంటి నష్టం లేదని, ఎంతో మంది నా యకులు తయారవుతారన్నారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేసి పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. రా బోయే ఎన్నికల్లో టీడీపీ అఖండ వి జయం సాధిస్తుందనీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ న్నారు.కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యేలు నగేశ్, సుమన్‌రాథోడ్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వర్‌రావు, టీడీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్, ముథోల్ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, టీడీపీ నేతలు లోలం శ్యాంసుందర్, యూనిస్ అక్బానీ, శ్రీనివాస్, అశోక్, రమణ పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో వెలుగు నింపుతా..చంద్రబాబు

కేంద్రంలో జగన్ పార్టీ బేరసారాలు
ప్రజావిశ్వాసం లేని వైసీపీ, టీఆర్ఎస్
నిలిచేది... పోరాడేది మేమే
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
ఈ రాక్షస పాలనను అంతం చేద్దాం
గజదొంగల్లా దోస్తున్న కాంగ్రెస్ నేతలు
చిల్లర పద్ధతుల్లో ఎఫ్‌డీఐపై నెగ్గిన యూపీఏ
కట్టని ఇల్లుకూ బిల్లులా..?: టీడీపీ అధినేత ప్రశ్న
యాత్రను అడ్డుకునేందుకు మాల మహానాడు యత్నం

ఆదిలాబాద్, నవంబర్ 7  : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాక్షస పాలన చేస్తున్నారని, దానికి చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇల్లు కట్టుకున్నపేదలకు బిల్లులు ఇవ్వడం లేదనీ, ఇల్లు కట్టకుండానే కాంగ్రెస్ నేతలు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అధికారం అప్పగిస్తే ఇంటికి పెద్దకొడుకులా రాష్ట్ర ప్రజల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రం ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి తరోడ, దేగాం, బోకర్‌క్రాస్, బైంసాక్రాస్, బైంసా పట్టణం వరకు శుక్రవారం యాత్ర సాగింది. మొత్తం 15.9 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు కూడా పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. రోడ్ల పక్కన ఉన్న వారిని, పాఠశాల, కళాశాల విద్యార్థులను, పంట చేన్లలోని రైతులను పలకరించారు. విద్యార్థులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.

ముథోల్‌లోని ఒక హెటల్‌లో చాయ్ తాగి యజమాని చాంద్‌మియాను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మార్గమధ్యలో ఎదురైన ఒక వృద్ధురాలు, మరో వికలాంగుడిని పలకరించారు. నాలుగు వేలరూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ముథోల్ సమీపంలోని ఓ పత్తి చేనులోకి వెళ్లి రైతును పలకరించారు. కూలీలను పలకరించగా వారు మరాఠీలో మాట్లాడారు. వారి మాటలను చంద్రబాబుకు ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ అనువదించి చెప్పారు.

ఈ సందర్భంగా ముథోల్ పాతబస్టాండ్, ముథోల్, తరోడ, సరస్వతీనగర్, బైంసాలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలకులు గజదొంగల్లా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలందరికీ రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వ్యయంతో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వృద్ధులకు రూ. 600, వికలాంగులకు రూ. 15 వందలు పింఛన్ ఇస్తామని చెప్పారు.

ఎంతో మంది పేదలు కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారనీ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామనీ, ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనే బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టారనీ, తాము ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయడంతో దాన్ని తొలగించారని గుర్తుచేశారు. వెయ్యి బీడీలు చేస్తే రూ. 110 చెల్లిస్తున్నారనీ, దాన్ని 150 రూపాయలు ఇచ్చేలా చూస్తామని, నెలకు 26 రోజులు పని కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు.

గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, తన ప్రభుత్వ హయాంలో నాలుగు వందలకు డీఏపీ బస్తా లభించగా, క్వింటాలు పత్తికి రూ. 5 వేల ధర లభించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డీఏపీ 13 వందలు ఉండగా క్వింటాలు పత్తికి రూ. 3500 కూడా రావడం లేదని చెప్పారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగగా, రైతు పండించిన పంటలకు ధర తగ్గుతుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానన్నారు. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి చిరు వ్యాపారుల భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

తమ పార్టీ విదేశీ పెట్టుబడుల బిల్లును వ్యతిరేకించినప్పటికీ యూపీఏ సర్కార్ చిల్లర పద్ధతులతో ఆ బిల్లును పాస్ చేయించుకుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరుగా నిలిచిందని దుయ్యబట్టారు. కేసులను ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు ఆ పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై బేరసారాలు సాగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారానికి ఏనాడూ కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు.

ఆరు నెలల పాటు కుంభకర్ణుడిలాగా నిద్రపోయి కొంతకాలం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మంత్రి పదవితో చిరు పార్టీ (పీఆర్పీ) సామాజిక న్యాయాన్ని పక్కన బెట్టి సొంత లాభానికి పరిమితమైందన్నారు.తాము మాత్రం ప్రజాసంక్షేమం కోసం, సమన్యాయం కోసం స్వచ్ఛమైన పాలన అందించేందుకు ద్రుఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

అవాంతరాలు, అడ్డంకులు ఎన్ని కలిగినా వాటిని అధిగమించి రాష్ట్ర సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చతికిలపడిపోయిందని, టీఆర్ఎస్, వైసీపీ ప్రజా నమ్మకాన్ని కోల్పోయాయని ధ్వజమెత్తారు. కాగా, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సమస్యను పక్కదోవ పట్టించి తమ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. అఖిలపక్షంలో పార్టీ వైఖరి చెబుతామని పునరుద్ఘాటించారు.

మరోవైపు, మైనారిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతానని చంద్రబాబు అన్నారు. రూ. 2500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేని రుణం అందించి వారిని ఆర్థికపరంగా ముందుకు తీసుకెళ్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పేదలందరికి న్యాయం చేస్తామన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే వరకు పాటు పడతామని తెలిపారు. అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు.

ఏబీవీపీ కార్యకర్తల హల్‌చల్
పాదయాత్రకు శుక్రవారం ముథోల్‌లో తెలంగాణ సెగ తగిలింది. ఉదయం వేళలో చంద్రబాబు పాదయాత్ర స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణ నుంచి ప్రారంభం కాగానే ముథోల్ ఏబీవీపీ ప్రతినిధి రాహుల్ ఆధ్వర్యంలో పలువురు ఆందోళనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'చంద్రబాబు గోబ్యాక్', 'తెలంగాణ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి', 'జై తెలంగాణ జైజై తెలంగాణ' అని నినదిస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ముందుకు దూసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని ముందుకు పోకుండా అడ్డుకుని పక్కకు తోసుకెళ్లారు. ఏబీవీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

షెడ్యూల్ మార్చొద్దు
ముథోల్ నుంచి బైంసాకు వస్తుండగా ముథోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొద్దిసేపు ఆగాలని, అక్కడి విద్యార్థులతో మాట్లాడాలని స్థానిక నేతలు చంద్రబాబును కోరారు. అయితే, 'షెడ్యూల్ మార్చోద్దు'' అని వారికి సూచించి ఆయన ముందుకు వెళ్లిపోయారు. ఈ సమయంలో వారిపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఆపార్టీలన్నీ కాంగ్రెస్‌లో కలిసేవే

కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. ఆ కోటి తిప్పలూ పడుతున్నా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లనివారు ఎందరో!! రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా.. జానెడు పొట్ట కోసం వేల కిలోమీటర్లు వెళ్లి రక్తం ధారపోస్తున్నా పొట్ట నిండని వారెందరో!! ఈరోజు పాదయాత్రలో అటువంటి విషాద ఘటనలే నాకు ఎదురయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కుటుంబీకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

జీవనోపాధిని వెతుక్కుంటూ వెళ్లిన తమవారు అక్కడ ఎంతటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో కళ్లకు కట్టారు. ఒక్కొక్కసారి తమవారి కడసారి చూపు కూడా కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు కడప, తూర్పు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి వలస వెళ్లినవారు దుర్భర జీవితాలను అనుభవిస్తున్న అంశం నా దృష్టిలో ఉంది. అందుకే, వారి ఆవేదన విన్న తర్వాత ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

బీడీ కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉదయం నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ బీడీలు చుడుతూనే ఉంటారు. దాంతో నిరంతరం వారిని ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. అయినా, వారికి కనీస వేతనాలు లేవు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టలపై పుర్రె గుర్తు వేయించారు. కార్మికుల ఉపాధికి ముప్పని తెలిసినా ఆయన నిరోధించలేదు.

అదే వారి పాలిట శాపమైంది. బీడీ కార్మికులకు కూడా పెద్ద పెద్ద కోరికల్లేవు. నా దగ్గర ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మూడే మూడు చిన్న కోరికలు కోరారు. తమకు కనీస వేతనంగా రూ.150 ఇప్పించాలని, నెల మొత్తం పని ఉండేలా చూడాలని; పింఛనుగా కనీసం రూ.500 ఇప్పించాలని కోరారు. వారి డిమాండ్లన్నీ సమంజసమే. హేతుబద్ధమే. బీడీ కార్మికుల్లో కొందరు డ్వాక్రా మహిళలు ఉన్నారు.

ఒక వయసు దాటిన తర్వాత వారు బీడీలు చుట్టలేరు. అప్పుడు వారికి ఉపాధి కూడా ఉండదు. అందుకే, వారికి పింఛను ఇవ్వడం తప్పనిసరి అనిపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా ప్రయత్నం చేయాలని సంకల్పం చెప్పుకొన్నాను.

గల్ఫ్‌కు ప్రత్యేక శాఖ

07.12.2012 "vastunna meekosam" padayatra photos (eenadu)