December 7, 2012

పేదల జీవితాల్లో వెలుగు నింపుతా..చంద్రబాబు

ఆదిలాబాద్ : తనకు అధికారం ఇస్తే నీతివంతమైన పాలన అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపుతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ స్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి ముథోల్, తరోడ, దేగాం, బోకర్‌క్రాస్, బైంసాక్రాస్, బైంసా పట్టణం వరకు 15.9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో ప్ర జా వ్యతిరేక విధానాలను అవలంభి స్తూ అన్ని వర్గాల ప్రజలను అథోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఏ గ్రామంలో చూసినా, పట్టణంలో చూసినా పారిశుధ్యం లోపించిందన్నారు. కూడుకుపోయిన మురికి కాలువలు, గుంతలమయంగా మారిన రోడ్లే కనిపిస్తున్నాయాన్నరు. ఎడాపెడా విద్యుత్ చార్జీలను పెంచుతూ అన్ని వర్గాల ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందు ల ధరలు నింగినంటాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతుండడంతో అన్నదాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్య తరగతి ప్ర జలు అర్ధాకలితో అలమటించాల్సిన ప రిస్థితులు నెలకొన్నాయన్నారు. మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తాము దీపం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సి లిండర్లపై కోత విధిస్తూ కేవలం 6 మాత్రమే సరఫరా చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసుపత్రుల్లో, విద్యా సంస్థల్లో సిబ్బంది కొరత తీవ్రరూ పం దాల్చడంతో సమస్యలు పెరుగుతున్నాయన్నారు.

వీటన్నింటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మూలంగా ప్రజానీకం కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. వీటన్నింటి నుంచి విముక్తి పొంది స్వచ్ఛమైన, నీతివంతమైన, సమర్థవంతమైన పాలనను పొందేందుకు గాను తమ పార్టీకి పగ్గాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే ముథోల్ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నెలకొల్పుతామన్నారు. షాదీఖానాను నిర్మింపజేస్తామన్నారు. బెల్టు షాపులన్నింటిని రద్దు చేస్తామన్నారు.

గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికి ప్రతి సంవత్సరం 10 సిలెండర్లు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఒక మామూలు డాక్టర్‌ను ఎమ్మెల్యేను, రాష్ట్రమంత్రి, ఎంపీ, కేంద్రమంత్రిని చేస్తే ఆయన పార్టీని వీడి వెళ్లిపోయాడ నీ, ఆయనతో కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదన్నారు.

ఒక వ్యక్తిపోతె పార్టీకి ఎ లాంటి నష్టం లేదని, ఎంతో మంది నా యకులు తయారవుతారన్నారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేసి పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. రా బోయే ఎన్నికల్లో టీడీపీ అఖండ వి జయం సాధిస్తుందనీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ న్నారు.కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యేలు నగేశ్, సుమన్‌రాథోడ్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వర్‌రావు, టీడీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్, ముథోల్ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, టీడీపీ నేతలు లోలం శ్యాంసుందర్, యూనిస్ అక్బానీ, శ్రీనివాస్, అశోక్, రమణ పాల్గొన్నారు.