December 7, 2012

ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా..

ఆదిలాబాద్: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ స్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలోని బాసర, మై లాపూర్, బాసర ట్రిపుల్ ఐటీ, బిద్రెల్లి, టాక్లీ క్రాస్ వరకు గురువారం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిం చారు.

ఈ సందర్భంగా బాసరలో, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. దేశంలో రెండే సరస్వ తీ దేవలయాలు ఉన్నాయనీ, ఒకటి కాశ్మీర్‌లో ఉంటే మరొకటి బాసరలో ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాం లో బాసర సరస్వతీ ఆలయంతోపాటు భద్రాచలం, కీసరగుట్ట ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బాసరలో మరిన్ని కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరూ అక్ష రభ్యాసానికి బాసరకు వచ్చేలా అ భివృద్ధి చేసి, ప్రపంచ పటంలో బాసర కు స్థానం కల్పిస్తామన్నారు. బాసరలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయించ డంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

బాసరలో ఐఐటీ ఏ ర్పాటు చేయాలని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య కోరారనీ, తాను సీఎంగా ఉన్నపుడే బాసరలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేశాన న్నారు. వైఎస్ సీఎం అయిన తరువాత ఐఐటీని రంగారెడ్డి జిల్లాకు తరలించి, బాసరలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయించారని చెప్పారు. బాసరలో ఏ ర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీలో సౌ కర్యాలు లేక విద్యార్థులు అనేక ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. టీ డీపీ హయంలోనే జిల్లాలో ఎన్నో అ భివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చే శామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు 9 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు రైతుల తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు.

బీసీలకు రాజకీయ న్యాయం చేసేదుకు బీసీ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సామాజిక న్యా యం పేరిట చిరంజీవి తన మంత్రి ప దవి కోసం పార్టీని విలీనం చేశారని విమర్శించారు.

కిరణ్ సర్కార్ చేతకాని ప్రభుత్వమ నీ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్సాఆర్ సీపీ, టీఆర్ఎస్ పై ఆయన నిప్పులు చెరిగారు. స్వార్థం కోసం టీడీపీని వీడిన నా యకులకు భవిష్యత్ ఉండదన్నారు. కొంత మంది నాయకులు పార్టీని వీడారనీ, కార్యకర్తలు మాత్రమే పార్టీలోనే ఉన్నారన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి న్యాయం చేస్తామన్నా రు. చంద్రబాబునాయుడు పాదయా త్రలో టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యేలు నగేశ్, సుమన్‌రాథోడ్, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, టీడీపీ నేతలు పాయల శంకర్, యూనిస్ అక్బానీ, నారాయణ రెడ్డి, లోలం శ్యాంసుందర్, అరిగెల నాగేశ్వర్‌రావు, పాటి సుభద్ర, అందు గుల శ్రీనివాస్, జుట్టు అశోక్, జీవి రమణ, బుచ్చిలింగం, పి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు రూ. 6 వందల పింఛన్: తమ పార్టీకి అధికారం ఇస్తే అన్ని వ ర్గాల వారు సామాజిక న్యాయం చే స్తామని టీడీపీ అధినేత నారా చం ద్రబాబు నాయుడు వెల్లడించారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా బాసరలో, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు.

అర్హులైన వారందరికి రూ. 600 పింఛన్లుగా అందిస్తామన్నారు. కేంద్రం సహకరిస్తే ఈ నిధులను మరింతగా పెంచుతామన్నారు. రూ. లక్షతో నిరుపేదలందరికి ఇళ్లు నిర్మింపజేస్తామన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో తాము ఏమి చెప్పాలో.. అదే చెబుతామన్నా రు. తమ పార్టీ తెలంగాణ వ్యతిరేకం కాదన్నారు. రెండు ప్రాంతాల్లో ఉన్న త మ పార్టీన రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం పరిష్కరించకుండా దురుద్దేశ్యంతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో అభివృ ద్ధి చేసింది తమ పార్టీయేనన్నారు. గతంలో చెన్నారెడ్డి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా సామాజిక తెలంగాణ అన్న చిరంజీవికూడా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారనీ, టీఆర్ఎస్‌ను కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెబుతున్నారన్నారు. దాంతో రాష్ట్రంలో తమ పార్టీ మాత్రమే ఉంటుందన్నారు.