November 6, 2012

అన్నింటా అనర్హుడీ సీఎం!
ఆ పదవికే కాదు.. ప్రజా జీవనానికీ పనికిరాడు
అహంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు
ఇంత వరదొచ్చినా కంట్రోల్ రూమే లేదు
బిచ్చం వేసినట్టు బియ్యం పంపిణీ
ఏమైనా అందామంటే సభ్యత అడ్డొస్తుంది
కిరణ్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి అంటూ నిప్పులు
కేంద్రంలో పదిమంది మంత్రులుండి ఏమి చేస్తున్నారని ప్రశ్న


రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా పర్యటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. ఓ వైపు తుఫాను ప్రభావంతో 14 జిల్లాలు అతలాకుతలం అయితే, ఈశాన్య ఋతుపవనాలతోనే వర్షాలు పడ్డాయంటూ రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నారని, వారి అజ్ఞానానికి ఇది పరాకాష్ట అన్నారు. రైతుల రుణమాఫీపై సాకులు చెబుతున్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తనపేరును కిరికిరిరెడ్డిగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రను మంగళవారం చంద్రబాబు పునఃప్రారంభించారు. ధన్వాడ మండలం రాంకిష్టాయిపల్లి వద్ద మీడియాతోనూ కొండాపూర్, కిష్టాపూర్‌ల్లో జరిగిన సభల్లోనూ వరద సహాయ చర్యలపై ప్రభుత్వ నిర్లిప్తతను తూర్పారబట్టారు. తుఫాను కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా ప్రభుత్వానికి కన్పించడం లేదని విమర్శించారు. వరద ప్రాంతాల్లో పర్యటించే తీరిక సీఎంకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గంట కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇంత నష్టం జరిగినా సచివాలయంలో కనీసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రధాని, సోనియా పర్యటించి సమీక్షించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు పది కిలోల బియ్యం ఇవ్వడమేమిటని నిలదీశారు. 'భిక్షం వేస్తున్నారా?' అని మండిపడ్డారు. కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ అహంతో వ్యవహరిస్తున్నారని, మొత్తం వ్యవస్థను ఆయన నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక్క సీఎం పదవికే కాదని, ప్రజాజీవితానికే ఆయన అనర్హుడని పేర్కొన్నారు. ఇంకా విమర్శలు చేయాలని ఉన్నా సభ్యత అడ్డువస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రం నుంచి పది మంది కేంద్ర మంత్రులు ఉన్నా వారంతా ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. 14 జిల్లాల్లో వరదలతో ఆస్తి, పంట నష్టం భారీగా జరిగినా, ప్రధానిని ఎందుకు తీసుకురాలేక పోతున్నారని నిలదీశారు. సొంత పనుల కోసమే మంత్రి పదవులు పొందారా అని నిలదీశారు. వరదలపై ఒక్క కేంద్ర మంత్రీ స్పందించకపోవడం దారుణమన్నారు. అంతకుముందు.. ఉదయం 10.30 గంటలకు పున ఃప్రారంభించిన పాదయాత్ర ధన్వాడ, కోయిల్‌కొండ మండలాల్లో 15 కిలోమీటర్ల మేర కొనసాగింది.

కిష్టాపూర్, కొండాపూర్ గిరిజన తండాల్లో జరిగిన సభల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. "నేను అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాను. మైదాన ప్రాంత లంబాడాలకు ఐటీడీఏ తరహాలో ప్రత్యేక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తా''మని తెలిపారు.

ఆ పదవికే కాదు.. ప్రజా జీవనానికీ పనికిరాడు,అహంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు

దేవుడి’ పాలనలో
‘రామదాసు’ ను మించి
కారాగారం లో రామ కోటి రాయడం మొదలెట్టి
అడ్డొచ్చాడని మొద్దు సీనును చంపేసిన
ఓం ప్రకాష్ అనే భక్తుడు
ప్రస్తుతం ‘కడప’ కారాగారం లో
కాలం వెళ్ళదీస్తూ
రెండు మొబైల్ ఫోన్ లు
స్వయంగా జైలు అధికారులకు
స్వాధీనం చేసాడంట
మరో రెండు తనిఖీల్లో దొరికాయంట

అట్టాంటిది అప్పటి ‘దేవుడి’ భక్తులే
నేడు ఏలుతుంటే
‘దేవుడి’ కొడికి దగ్గర
ఏమీ లేవంటే
ఎవరు నమ్ముతారో

ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను
దేవుడి బిడ్డ నిధులతో
ఒక ప్రక్క కొనుగోలు చేస్తూ
మరో ప్రక్క ప్రతిపక్షాన్ని
అవిశ్వాసం పెట్టండంటూ
విమర్శిస్తూ వుంటే
వింతగా
నమ్మినట్టు నటిస్తున్నారు పాలకులు


www.chaakirevu.wordpress.com

‘దేవుడి’ పాలనలో ‘రామదాసు’ ను మించి కారాగారం లో రామ కోటి రాయడం మొదలెట్టి...


Sri N.Chandrababu Naidu Padayatra at Mahaboobnagar district on 06-11-12 



Sri N.Chandrababu Naidu Padayatra at Kondapur on 06-17-12


 

 

TV9 - Chandrababu Naidu speaks at Mahabubnagar in his padyatra

 

 

Sri N.Chandrababu Naidu Padayatra at Kistapur on 06-11-12




Padayatra Plans Change




36వ రోజు పాదయాత్ర లైవ్ కవరేజ్..తెలుగు TV చానల్స్ లో..6.11.2012

chandrababunaidu_vastunnameekosam_padayatra_photos_narayanpet_6.11.2012

37వ రోజు పాదయాత్ర పోటోలు....మహబుబ్ నగర్ జిల్లా నారయణపేట్ సెగ్మెంట్ లో..6.11.2012


37వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర ..పత్రికా ప్రకటన...6.11.2012

chandrababunaidu vastunnameekosam padaytra at narayanapet segment_.6.11.2012

36వ రోజు నారయణపేట సెగ్మెంట్ లో "వస్తున్నా మీకోసం" పాదయాత్ర చిత్రాలు...06.11.2012



తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు మహబుబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఈ రోజు నారాయణపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు పెళ్లి ,ఢీల్లికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. నీలం తుపానును ఎదుర్కోవడంతో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం కంట్రోల్‌ రూమ్‌లు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని. తెదేపా హయాంలో సచివాలయాన్ని రాజమండ్రికి తరలించినట్లు గుర్తు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రదాని, సోనియా పర్యటించాలని డిమాండ్‌చేశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రదానికి లేఖరాయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

నీలం తుపానును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం, తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి- 36వ రోజు పాదయాత్రలో చంద్రబాబు