October 23, 2012


chandarababu naidu Pdayayatra vastunna meekosam potos 23.201.2012

22వ రోజు చంద్రబాబు నాయుడి వస్తున్నా మీకోసం పాదయత్ర పోటోలు (Part-3)

చంద్రబాబు పాదయాత్ర దసరా పండుగ రోజైన బుధవారం కూడా యథాతథంగా జరగనుంది. కాకపోతే, పార్టీ యంత్రాంగానికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా కొద్ది దూరం మాత్రమే ఆయన పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పాదయాత్రను పూర్తిగా నిలిపి వేయకుండా దసరా రోజున ఏడు లేదా ఎనిమిది కిలోమీటర్ల దూరం నడవాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం ఉదయం 10 గంటలకు పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటలకు నిలిపి వేయాలని నిర్ణయించారు. ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వీలున్న చోట చంద్రబాబు జమ్మి పూజ చేయనున్నారు.

పండుగ రోజూ చంద్రబాబు పాదయాత్ర ( 23వ రోజు) 24.10.2012

 విజయద శమి పర్వదినాన్ని పురస్కరించుకని రాష్ట్ర ప్రజలు, దేశ , విదేశాలలో ఉన్న తెలుగు వారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటడంతో పాటు... భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ప్రజల మధ్య స్నేహసంబంధాలను పెంపొందిస్తాయన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయదశమి, ఈ పర్వదినం ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలి. వారి జీవితాల్లో వెలుగులు నింపాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు.

విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: చంద్రబాబు

 కెసీఆర్‌కు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్‌లకు తెలంగాణ ఏర్పాటు కంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని, అందువల్లే వారు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్లు, రహదారుల బంగ్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు గులాంనబీ అజాద్, వాయిలార్ రవి తెలంగాణపై చేసిన ప్రకటనలపై ఉద్యమించకుండా తెలంగాణ విషయంలో కట్టుబడిఉన్నానని చెబుతూ, చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. ఈ పరిస్థితిని చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో జరిపిన చర్చలు బాబు పర్యటనను అడ్డుకోవడానికేనని భావిస్తున్నామన్నారు.

కంటిపాపలా బాబు యాత్రను కాపాడుతాం: మంద కృష్ణ

రాష్ట్రంలో మొండెద్దు ప్రభుత్వం సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా స్పందించడం లేదని, ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్సార్, టీఆర్ఎస్ పార్టీలు దోమల్లాంటివని, ఇవి కుడితే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తుందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రెండో శనివారం పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహించేవారమని, ఇప్పుడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు.

సమర్థ, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మంగళవారం రాత్రి అయిజ మండలం వెంకటాపురం స్టేజీ వద్ద ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా మంది రైతులు ఆర్డీఎస్ నీటి సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు గంటల కరెంటు కూడా ఉండడం లేదన్నారు. వీటిపై స్పందించిన చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని చూస్తే తనకూ కోపం వస్తుందని ఏం చేద్దామో చెప్పండంటూ వారినే కోరారు. ఇద్దరమూ కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని స్థానిక యువకులు చంద్రబాబుకు బదులివ్వడంతో ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, ఢీజిల్ ధరలతో పాటు మద్యం ధరలు కూడా పెంచిందని గుర్తు చేశారు. దొరికినదంతా దోచుకొని రాష్ట్రాన్ని స్మశానంలా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆధాయం పెరిగినా ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. త్వరలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు ఆరోపించారు.

కాంగ్రెస్, వైఎస్సార్, టీఆర్ఎస్ పార్టీలు దోమల్లాంటివని, ఇవి కుడితే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తుంది -చంద్రబాబు (22వ రోజు మంగళవారం రాత్రి )


[url=http://www.pics22.com/animated-happy-dussehra-graphic-hope-this-dussehra-lights-up-your-life/][img]Happy Dussehra Puja Thali[/img][/url]


అభిమానులందరికి దసరా శుభాకాంక్షలు...

మామగారికి బండారు రాసిన లేఖలకు మళ్లే
కారాగారంలో ఉన్న పెనిమిటి కోసం
తనకు తానూ ఓదార్పు చెప్పుకోడానికా అన్నట్టు
ఆంధ్రా మధుకోడా పెళ్ళాం
లేఖల మీద లేఖలు రాస్తోంది
తమకు అచ్చేసుకోడానికి
మామగారు అవినీతి తో
పుట్టించిన పత్రికలో
పది కోట్ల మందితో పెనవేసుకొన్న బంధం
అని తాజా లేఖలో
పెనిమిటి కోసం ఆత్రంగా చూస్తున్నారనే
అంకెల్లో మనలను కూడా కలిపేసుకోంది
అమ్మా ఏ జన్మలో చేసిన పాపమో
ప్రభువుగా భరించాము
మళ్ళీనా, భరించలేము స్వామీ అన్నందుకో
లేక దేవుడిగా మారిపోతున్న మావయ్యను చూసి
దేవుడికే భయమేసో
ప్రజలు పండగ చేసుకొనేలా చేసాడు
తాజాగా మీ పెనిమిటిని
రుద్దాలని చూడకమ్మా
ఎదురుచూసే కుల గజ్జి
మత గజ్జి మా కాడ లేదమ్మా
మీ పెనిమిటి మీ మావయ్య వెనకవుండే అంత వెనకేసాడంటే
ఇక ఆయనే ముందుకు వస్తే
అంతిమ సంస్కారాల గోతులకు కూడా గొడవపడతారు జనం
మీ ఆయన కోసం జనం అనే
భ్రమల్లో వున్న నిన్ను చూస్తుంటే
తెలిసీ తెలియని ప్రాయంలో
ప్రేమించే పిల్లలు కూడా
నీ ముందు దిగ దుడిపే అనిపించక మానదు
మీ ఆయన మీద మీకున్న ప్రేమ ముందు
మీ మావయ్య బాబు
మీ ఆయన
మీ అత్తా
మీ ఆడపడుచు
మీ ఆడపడుచు భర్త
పేర్లతో పాటు
ఊహలమ్మగా మీకు మీరు
పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి
చేస్తున్న కృషి
ఫలిస్తుందని ఆశిస్తున్నాం 

సేకరణ : www.chaakirevu.wordpress.com

కారాగారంలో ఉన్న పెనిమిటి కోసం లేఖల మీద లేఖలు రాస్తోంది,పెనిమిటి కోసం ఆత్రంగా చూస్తున్నారనే అంకెల్లో మనలను కూడా కలిపేసుకోంది


Sri N.Chandrababu Naidu Padayatra at Vaddepally on 23-10-12





TV9 - Revanth Reddy speaks on Mahabubnagar padayatra



USA - NRIs support Chandrababu's Padayatra - Tv9



Chandrababu padayatra in Telangana - Tv9






Chandrababu becomes sheperd- Tv9




chandrababunaidu-vastunna_meekosam_padayatra_videos_23.10.2012

22వ రోజు చంద్రబాబు నాయుడి వస్తున్నా మీకోసం పాదయత్ర టి.వీ కవరేజ్

chandrababunaidu_vastunna meekosam_padayatra_photos_part2_23-10-2012

22వ రోజు మహబుబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర పోటోలు...(Part-2) 23.10.2012

ఉపాధ్యాయ నియామకాలు ఏటా నిర్వహించాం
అంటువ్యాధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
బాబు యాత్రలో పాల్గొననున్న ఎన్నారైలు
అధికారంలోకి వస్తే అన్నిసమస్యలు పరిష్కారం 

  తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయ నియామకాలు ప్రతి ఏటా నిర్వహించామని, టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. బీఈడీ అభ్యర్ధులకు పాత పద్ధతిలోనే ఎస్‌జీటీ అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజక వర్గంలో సాగుతున్న చంద్రబాబునాయుడి పాదయాత్ర వడ్డేపల్లి మండలం, 26వ కాలువవద్ద చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నాశనయమైన వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందని ఆయన అన్నారు. గ్రామాల్లో వ్యాధులు, విషజ్వరాలు సంక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో గ్యాస్ ధర పెంచకుండా అందరికీ సరఫరా చేశామని చెప్పారు.

యాత్రలో చంద్రబాబు ప్రజలతో మమేకమవుతూ, ముందుకుసాగుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉల్లిగడ్డ రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. పంటలు ఎండిపోవడం, పండిన పంటకు కిట్టుబాటు ధరలేక రైతులు బాగా చితికిపోయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. బాబు పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

యాత్రలో ఎన్నారైలు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఎన్నారైలు పాల్గొననున్నారు. యుకె, యూరప్ దేశాలలో ఉంటున్న పలువురు ఎన్నారైలు లండన్ నుండి రాష్ట్రానికి వస్తున్నారు. వారు సోమవారం లండన్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బాబు యాత్రకు సంఘీభావం తెలిపారు. వీరు గురువారం నుండి 30 రోజులపాటు పాదయాత్రలో పాల్గొననున్నారు.

Chandrababu naidu_vastunna meekosam_padayatra_mahabubnagar_23.10.2012

మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజక వర్గంలో సాగుతున్న చంద్రబాబునాయుడి 22వ రోజు పాదయాత్ర

Chandrabau naidu_vastunnameekosam_padayatra_photos_23.10.2012

22వ రోజు మహబుబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర పోటోలు... 23.10.2012

తెలంగాణను వ్యతిరేకించలేదు

అఖిలపక్షం ఏర్పాటుకు లేఖ రాశా

అయినా కాంగ్రెస్ నాటకాలాడుతోంది

తెలంగాణలో ఎవరెక్కువ అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా?

 తెలంగాణ ఏర్పాటును తాను గానీ, టీడీపీ గానీ ఎన్నడూ వ్యతిరేకించ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినా కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెస్సేనని, అందరం కలిసి ఆ పార్టీపై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్ర 21వ రోజైన సోమవారం ఆయన కర్నూలు జిల్లా సి.బెళగల్ నియోజకవర్గంలోని కొత్తకోట నుంచి ప్రారంభించారు. కొత్తకోటలో మునెప్ప, మల్లమ్మ సాగు చేసిన వరి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కర్నూలు జిల్లాలో తొమ్మిది రోజుల పాదయాత్రను ముగించుకుని, సోమవారం సాయంత్రం 5.40 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో అడుగు పెట్టారు. జిల్లా సరిహద్దులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్‌పీఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వివిధ సందర్భాల్లోనూ, రాజోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమేనా అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరినా స్పందించలేదని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చే శక్తి టీడీపీకి లేదని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు అందరూ ఆమోదం తెలుపాలని చంద్రబాబు కోరగా సభకు వచ్చిన వారు తమ ఆమోదాన్ని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరద ముంపునకు గురై మూడేళ్లు గడిచినా, రాజోలిలో ఇప్పటికీ ఇళ్లు పూర్తి కాలేదని విమర్శించారు. కేంద్రం నగదు బదిలీ పథకాన్ని తెరపైకి తెచ్చి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని, దీన్ని అందరం వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు.

వైఎస్ చనిపోయినా చేనేత కార్మికులకు ఆయన ప్రకటించిన రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌ల హయాంలో ప్రజల సమస్యలు పెరిగాయి తప్ప తగ్గలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీం కోర్టు కొట్టివేస్తే.. దాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పాలకులు ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. పేద విద్యార్థులను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒకవేళ అది చేయలేకపోతే నిరుద్యోగ భృతి అందజేస్తానన్నారు. బీసీలు అభివృద్ధిలో వెనకబడ్డారని, అందుకే తాను బీసీ డిక్లరేషన్ ప్రకటించానని చెప్పారు. పెత్తందారులను ఎదిరించినప్పుడే బడుగు వర్గాలకు అధికారం వస్తుందని, పరిపాలనలో భాగ్యస్వామ్యం వస్తుందని అన్నారు. పాదయాత్రలో భాగంగా సుంకేసుల గ్రామం, రిజర్వాయర్‌ను సందర్శించారు. వరదలతో నేలమట్టమైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సుంకేసుల వరద బాధితులకు ఆసరా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, వరద, కరువుతో కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసమస్యలపై కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. సాయంత్రం 5.40కు మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి గ్రామంలోకి అడుగుపెట్టారు. గ్రామం వెనక వరదలో కూలిపోయిన ఇళ్ల మీదుగా వస్తూ.. మార్గమధ్యలో బాధితుల వద్దకు వెళ్లి పలకరించారు. మద్దిలేటి అనే వికలాంగుడు చంద్రబాబును కలిసేందుకు కూలిపోయిన ఇంటివద్ద వేచి ఉండగా, అతడికి చేయి ఊపుతూ నవ్వుతూ వెళ్లిపోయారు.

ఆ తర్వాత మరో బాధితుడు టీచర్ రమేష్, సావిత్రమ్మ ఇంటి లోపలికి వెళ్లి పలకరించారు. అంతకుముందు మసీదులో మైనార్టీలతో మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే మీకు రూ.2500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని, 8 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, రాజకీయాల్లో 15% సీట్లను కేటాయిస్తామని, పెళ్లి చేసుకొనే నిరుపేద మహిళలకు రూ.50 వేలు, మసీదులకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

తెలంగాణను వ్యతిరేకించలేదు, అఖిలపక్షం ఏర్పాటుకు లేఖ రాశా...21వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

చంద్రబాబు మీ కోసం పాదయాత్ర 22వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమవుతుంది. 26వ కాలువ, జోలపల్లు, కొంకల్‌క్రాక్, వెంకటాపురం స్టేజీ, ఐజ మండలం పడిగాపులం మీదుగా ఇప్పల క్రాస్ రోడ్ వరకు సాగుతుంది.

నేటి పాదయాత్ర షెడ్యూల్ 23.10.2012

vastunna meekosam audio songs part-2


1.  Kastala Kadalilonaa.. Kaneeti sudulalonaa.... 


Download 

2.  Polalanni Halaladhunni.. Ilalatalamlo...


Download

3.  Vastunaa... Vastunaa.. Meekosam...


Download
  4.   Vastunaa Meekosam... Chitikinabatukula...



Download

5.  Yellamma Malamma.. Podam padavee...


    
Download 

6.  Yelana Omallana Manavoorikoche Chandranna...


Download

"వస్తున్నా మీకోసం" పాటలు Part-2

21వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు (Part-2) 22.10.2012

"నాకు సంపాదించాలన్న ఆశ లేదు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. ఏనాడూ సంపాదించుకోవాలని ఆలోచించలేదు. రాష్ట్రం బాగు కోసమే కృషి చేశా''

"ప్రజల డబ్బు దోచుకున్నారు. హైదరాబాద్, బెంగళూరుల్లో 80 గదుల ఇళ్లు నిర్మించుకున్నారు. టీవీ, న్యూస్ పేపర్ పెట్టారు. ఆ పేపర్‌లో నా గురించి మూడు పేజీలు వ్యతిరేకంగా రాయడమే వారి పని''

"బడుగులకు రాజ్యాధికారం రావాలి. ఎప్పుడూ పల్లకీలు మోయవద్దు. పల్లకీలో కూర్చునే చైతన్యం రావాలి''

"మీరందరూ కష్టాల్లో ఉన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. నన్ను ఆదరించండి''

"తొమ్మిదేళ్లపాటు సీఎంగా అభివృద్ధిలో ప్రపంచ దేశాలను ఆకర్షించాను. ఎంతోమంది నా దగ్గర పరిపాలన నేర్చుకున్నారు. ప్రపంచంలో చాలామంది సలహాలు అడిగారు. అలాంటిది, చేతకాని కాంగ్రెస్ నేతలు నాకు పరిపాలన నేర్పుతారా!? ముందు మీరు తినేది ఆపండి. ప్రజల కష్టాలు తీరతాయి''

"వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్ నీకది.. నాకిది అంటూ దోచుకున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఎలా సంపాదించారంటూ సుప్రీం కోర్టు వేసిన ప్రశ్నకు జైల్లో ఉన్న నిందితుల తరఫున న్యాయవాది నీళ్లు నమిలారు. వీళ్లా.. నాకు పాలన నేర్పేది!?''

"కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని అవినీతి కాంగ్రెస్ పాలకులను ఉతికి ఆరేయాలనిపిస్తోంది. కానీ, సభ్యత అడ్డం వచ్చి ఆ పని చేయలేకపోతున్నా''

"తెలంగాణలో ఒకప్పుడు పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలు ఉండేవి. వాటితోపాటు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదే''

"హైటెక్ సిటీని నేను కేవలం 15 నెలల్లో పూర్తి చేశాను. రాజోళిలో వరద ముంపునకు గురైన ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం''

తెలంగాణలో పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలు,పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదే 21వ రోజు పాదయాత్రలో బాబు

ప్రజా స్పందన బాగుంది 'ఆంధ్రజ్యోతి'తో చంద్రబాబు

  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజోలి నుంచి పాదయాత్రగా వస్తున్న ఆయనను ఆంధ్రజ్యోతి పలకరించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా అనూహ్య స్పందన కనిపించిందని చెప్పారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్రగా వచ్చానని చెప్పారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరిని అవలంభిస్తోందని మండిపడ్డారు.

వరదలు ముంచెత్తినప్పుడు మొట్టమొదట వచ్చింది తానేనని, మూడేళ్లు అయినా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని విమర్శించారు. ఆరున్నరకు రాజోలిలో బహిరంగ సభ ముగించుకుని రాజోలి గుడారాల మీదుగా రాత్రి 10 గంటలకు వడ్డెపల్లికి చేరుకున్నారు. 10.30కు శాంతినగర్ వచ్చారు. అప్పటికీ శాంతినగర్ చౌరస్తాలో ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ కన్పించారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ ముందుకు నడిచారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన

చంద్రబాబు పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరిం చేందుకు టీడీపీ కార్యాలయంలో గ్రివెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశామని ఆ పార్టీ నేత రావులపాటి సీతారాంరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రకు సంబంధించిన రెండో పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. బాబు యాత్రకు మహబూబ్‌నగర్ జిల్లాలోనూ అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. బాబు యాత్రలో అందిన ప్రజా వినతుల్లో ఇప్పటి వరకు 300 వినతులను పరిష్కరించామని సీతారాంరావు తెలిపారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్: చంద్రబాబు మీ కోసం పాదయాత్ర 22వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమవుతుంది. 26వ కాలువ, జోలపల్లు, కొంకల్‌క్రాక్, వెంకటాపురం స్టేజీ, ఐజ మండలం పడిగాపులం మీదుగా ఇప్పల క్రాస్ రోడ్ వరకు సాగుతుంది.

'వస్తున్నా... మీ కోసం' లో ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరిం చేందుకు గ్రివెన్స్ సెల్‌