October 23, 2012

మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజక వర్గంలో సాగుతున్న చంద్రబాబునాయుడి 22వ రోజు పాదయాత్ర

ఉపాధ్యాయ నియామకాలు ఏటా నిర్వహించాం
అంటువ్యాధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
బాబు యాత్రలో పాల్గొననున్న ఎన్నారైలు
అధికారంలోకి వస్తే అన్నిసమస్యలు పరిష్కారం 

  తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయ నియామకాలు ప్రతి ఏటా నిర్వహించామని, టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. బీఈడీ అభ్యర్ధులకు పాత పద్ధతిలోనే ఎస్‌జీటీ అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజక వర్గంలో సాగుతున్న చంద్రబాబునాయుడి పాదయాత్ర వడ్డేపల్లి మండలం, 26వ కాలువవద్ద చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నాశనయమైన వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందని ఆయన అన్నారు. గ్రామాల్లో వ్యాధులు, విషజ్వరాలు సంక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో గ్యాస్ ధర పెంచకుండా అందరికీ సరఫరా చేశామని చెప్పారు.

యాత్రలో చంద్రబాబు ప్రజలతో మమేకమవుతూ, ముందుకుసాగుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉల్లిగడ్డ రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. పంటలు ఎండిపోవడం, పండిన పంటకు కిట్టుబాటు ధరలేక రైతులు బాగా చితికిపోయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. బాబు పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

యాత్రలో ఎన్నారైలు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఎన్నారైలు పాల్గొననున్నారు. యుకె, యూరప్ దేశాలలో ఉంటున్న పలువురు ఎన్నారైలు లండన్ నుండి రాష్ట్రానికి వస్తున్నారు. వారు సోమవారం లండన్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బాబు యాత్రకు సంఘీభావం తెలిపారు. వీరు గురువారం నుండి 30 రోజులపాటు పాదయాత్రలో పాల్గొననున్నారు.

Chandrababu naidu_vastunna meekosam_padayatra_mahabubnagar_23.10.2012
No comments :

No comments :