October 23, 2012

తెలంగాణలో పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలు,పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదే 21వ రోజు పాదయాత్రలో బాబు

"నాకు సంపాదించాలన్న ఆశ లేదు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. ఏనాడూ సంపాదించుకోవాలని ఆలోచించలేదు. రాష్ట్రం బాగు కోసమే కృషి చేశా''

"ప్రజల డబ్బు దోచుకున్నారు. హైదరాబాద్, బెంగళూరుల్లో 80 గదుల ఇళ్లు నిర్మించుకున్నారు. టీవీ, న్యూస్ పేపర్ పెట్టారు. ఆ పేపర్‌లో నా గురించి మూడు పేజీలు వ్యతిరేకంగా రాయడమే వారి పని''

"బడుగులకు రాజ్యాధికారం రావాలి. ఎప్పుడూ పల్లకీలు మోయవద్దు. పల్లకీలో కూర్చునే చైతన్యం రావాలి''

"మీరందరూ కష్టాల్లో ఉన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. నన్ను ఆదరించండి''

"తొమ్మిదేళ్లపాటు సీఎంగా అభివృద్ధిలో ప్రపంచ దేశాలను ఆకర్షించాను. ఎంతోమంది నా దగ్గర పరిపాలన నేర్చుకున్నారు. ప్రపంచంలో చాలామంది సలహాలు అడిగారు. అలాంటిది, చేతకాని కాంగ్రెస్ నేతలు నాకు పరిపాలన నేర్పుతారా!? ముందు మీరు తినేది ఆపండి. ప్రజల కష్టాలు తీరతాయి''

"వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్ నీకది.. నాకిది అంటూ దోచుకున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఎలా సంపాదించారంటూ సుప్రీం కోర్టు వేసిన ప్రశ్నకు జైల్లో ఉన్న నిందితుల తరఫున న్యాయవాది నీళ్లు నమిలారు. వీళ్లా.. నాకు పాలన నేర్పేది!?''

"కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని అవినీతి కాంగ్రెస్ పాలకులను ఉతికి ఆరేయాలనిపిస్తోంది. కానీ, సభ్యత అడ్డం వచ్చి ఆ పని చేయలేకపోతున్నా''

"తెలంగాణలో ఒకప్పుడు పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థలు ఉండేవి. వాటితోపాటు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదే''

"హైటెక్ సిటీని నేను కేవలం 15 నెలల్లో పూర్తి చేశాను. రాజోళిలో వరద ముంపునకు గురైన ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం''
No comments :

No comments :