February 26, 2013

పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కులవృత్తులు కునారిల్లుతున్నాయి. నూలుతాళ్లు నేతన్నల పాలిట ఉరితాళ్లవుతున్నాయి. గీత కార్మికుల కష్టాలు ఆ తాడిచెట్టంత ఎత్తున తిష్టవేసి ఏడిపిస్తున్నాయి. మంగళగిరిలో చేనేతల నుంచి రేపల్లెలో కల్లు గీత కార్మికుల దాకా, గుంటూరు పట్టణంలో వస్త్ర వ్యాపారుల నుంచి తెనాలిలో ముస్లిం యువకుల దాకా.. అందరూ ఏదోరకంగా ఈ చేతగాని సర్కారుకు బాధితులేననిపించింది.

గుంటూరు జిల్లా ఆ కొస నుంచి ఈ కొసకు రావడానికి ఇరవై రోజులుపైనే పట్టింది. ఈ మధ్యకాలంలో కలిసిన ఏ సామాజికవర్గంగానీ, ఏ చేతివృత్తిదారుగానీ ఏకరువు పెట్టిన సమస్యల సారాంశం ఒక్కటే. ప్రభుత్వం పనిచేయడం లేదనే కసిని, కన్నీటిని వాళ్లలో ఏకకాలంలో చూశాను. అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నా కేవలం రాజకీయ కారణాలతో కావాలని దూరం పెడుతున్న ఊళ్లనెన్నింటినో ఊరడించాను. ఇందిరమ్మ ఇళ్ల నుంచి రక్షిత జల పథకాలదాకా, ఏదీ అందని గ్రామాలెన్నింటినో పలకరించాను.సమస్త వర్గాల, జనుల బాధలకు ఈ జిల్లాయే ఖిల్లా!

వనరులున్నాయి. వాటిని ఉత్పత్తులుగా మలచగల మందిబలం ఉంది. ఇక్కడ లేనిదల్లా మంచి సంకల్పం కొరవడిన పాలకులే! జిల్లాలో వెయ్యికి పైగా జౌళి మిల్లులున్నాయి. అందులో 80 శాతం మూతబడ్డాయి. పెట్టుబడి లేకనో, శ్రమశక్తులు లేవనో కాదు..సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో ఊపిరి ఆగింది. ఒక పరిశ్రమ పోతే.. ఎన్ని చేతులు ఖాళీ అవుతాయో, ఎన్ని కడుపులు మాడతాయో, ఎంతమంది కుటుంబాలకు దూరమై వలసబాట పడతారో..ఎంత చెప్పినా ఎందుకు అర్ధం కాదో! పల్లెలను ముంచితే ఆ పాపం పది జన్మలెత్తినా పోదు!

నూలు తాళ్లే ఉరితాళ్లవుతున్నాయి!

ఇంటికొకరొస్తే నీళ్లిప్పిస్తా!

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం పా ర్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. డెల్టా పరిధిలో ఇంటికొకరు తన వెంట వస్తే, గుంటూరు కలెక్టరేట్ ఎదు ట మహాధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. "ముందు రై తులకు నీరు విడుదల చేయండి. మొక్కజొన్న, మిను ము, పెసర పంటలను కాపాడండి. ఆ తర్వాత నాపై కేసులు పెట్టుకోండి'' అని ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం విశ్వేశ్వరపురంవద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్తో ట, మైనేనివారిపాలెం, నల్లూరు, రుద్రవరం మీదుగా పెనుమూడి-పులిగడ్డ వారధి వరకు 13.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో సాగునీరు లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆయన వద్ద వాపోయారు. "డెల్టాకు సాగునీరు విడుదల చేయాల్సిందిగా పదేపదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాను. సీఎంకు అనేక లేఖలు రాసినా కదలిక లేదు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసులు, రెవెన్యూ, ఎమ్మెల్యేలను కాలువలపై పెట్టి చివరి భూములకు కూడా సాగర్ నీళ్లిచ్చిన ఘనత తమదని గుర్తుచేశారు. అనంతరం తనను కలిసిన కల్లుగీత కార్మికుల వెతలు ఆలకించారు. "పట్టణ ప్రాంతాల్లో చుట్టూ 60 కిలోమీటర్ల వరకు కల్లు విక్రయించరాదన్న జీవో దుర్మార్గం. గీత కార్మికుల కడుపు కొట్టారు'' అని మండిపడ్డారు.

జిల్లాలో నేటితో యాత్ర ముగింపు: గుంటూరు జిల్లా లో బుధవారం మధ్యాహ్నం పాదయాత్ర ముగియనుం ది. ఈనెల 6న విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఆయన గుంటూరులో ప్రవేశించారు.

మహాధర్నాతో సర్కారును కదిలిద్దాం: బాబు

32 మంది ఎంపీలుండీ దండగ
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి రైల్వే బడ్జెట్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులు, 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండీ ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యే ఎదురవుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో చార్జీలు పెంచబోమని చెబుతూనే.. రిజర్వేషన్, తత్కాల్, టిక్కెట్ రద్దు చార్జీల రూపంలో ప్రయాణికులపై దొడ్డిదారిన భారం మోపారని విరుచుకుపడ్డారు.

రైల్వే శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి చెందిన ఎంపీ ఉన్నా.. ప్రయోజనం చేకూర్చలేకపోయారని విమర్శించారు. ఇంకా.. ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమనాయుడు, దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు, రాజేంద్ర ప్రసాద్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, రమేశ్ రాథోడ్, సుధారాణి, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప కూడా రైల్వే బడ్జెట్‌పై నిప్పులు చెరిగారు. కాగా.. హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని పార్టీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో కోరారు.

కాంగ్రెస్‌కు ఇదే చివరి రైల్వే బడ్జెట్


పేద ప్రజలకు కూడు, గూడు, నీడ తన ఎజెండాలోని ప్రధాన అంశాలుగా చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వీధిలైట్లు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడతానని తన విజన్‌ను చెబుతున్నారు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తానని, రైతులకు వ్యవసాయం లాభసాటి చేస్తానంటూ హామీలు ఇస్తూ చంద్రబాబు తన పాదయాత్రను జిల్లా లో ముగింపు గడియలకు తీసుకొస్తున్నారు.

రేపల్లె నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలైన అరవపల్లి, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపా లెం, బొబ్బర్లంక తదితర గ్రామాల్లో పాదయాత్రను కొనసాగించిన చం ద్రబాబు మంగళవారం మరి కొన్నింటి లో కొనసాగించి బుధవారం కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టే దిశగా ముం దుకు సాగుతున్నారు. చంద్రబాబు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలకు ఇప్పటివరకు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి గురించి చెబుతూ తాను అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, వ్యక్తిగత మ రుగుదొడ్ల సమస్యలను ప్రస్తావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తా ను కూడు, గుడ్డ, నీడ ప్రాధాన్యాంశాలుగా అమలు చేస్తానని హామి ఇస్తున్నారు.

కాంగ్రెస్, వైసీపీలపై చంద్రబాబు తన ఆరోపణల పరంపరను కొనసాగించారు.

కాంగ్రెస్ నాయకులు దు ర్మార్గులని, సేవాభావం లేకుండా ప్రజలను దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నీతిని ప్రభోదించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొన్ని సంఘటనలను ఉదహరిస్తున్నారు. రేపల్లెలో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ సేవాభావంతో ముందుకెళుతూ ప్రజల మధ్యన ఉంటే గెలిచిన మోపిదేవి జైలు పాలయ్యాడని చెబు తూ ఎవరు నీతిమంతులో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్ ఖా తా నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో ఓబుళాపురం గనుల అవినీతి పారింది. అలాంటి గాలితో స్నేహం చేసిన వీళ్లు అధికారంలోకి వస్తే ఇంటి పైకప్పు కూడా ఉండకుండా చేస్తారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

రైతుల కడుపుమంట చూసి నేను ప్రభుత్వంపై తిరుబాటు చేయాలని చెప్పాను. కృష్ణా పశ్చిమ డెల్టాకు రెండో తడి ఇవ్వమని 20 రోజులుగా గొంతెత్తి డిమాండ్ చేస్తున్నాను. అయినా స్పందించకపోవడంతో రైతు లు పొలం పనికి ఉపయోగించే కత్తి, కొడవలితో రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిస్తే నాపై కేసులు పెడతానికి సిద్ధమయ్యారు. వాళ్ల బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు నేను భయపడేది లేదు. ముందు సాగునీరు ఇచ్చి ఆ తర్వాత కేసులు పెట్టుకోండి. రైతుల కోసం నేను ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉ న్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

వైఎస్ ఒక పులిలాంటి వాడు అడవిలో ఉన్న ఒక పులి మనుషులను తినడం మరిగింది. ఆ పులి మ నుషులను తేలిగ్గా తినేయాలని తన కాలికి ఒక బంగారు కంకణం కట్టుకొంటుంది. తన వద్దకు వస్తే అది ఇస్తానని చెప్పి మనిషి రాగానే అతన్ని చంపేసి తినేస్తుంది. వైఎస్ కూడా అదే పని చేశాడు. కేజీ రూ.2 బియ్యం, ఆరోగ్యశ్రీ ఆశ చూపించి రాష్ట్ర ప్రజలను మింగేశాడు. శుష్క వాగ్దానాలు చేసి రూ. లక్ష కోట్లు వెనకేసుకొన్నాడు. ఈ విషయంలో ప్రజలకు ఒక స్పష్టత రావాల్సి ఉందని చంద్రబాబు పొడు పు కథ ద్వారా రేపల్లె శివారు గ్రామా ల ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

ప్రధాని మీనమేషాలు లెక్కిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదు లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్‌లో మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీపార్కు, దిల్‌షుక్‌నగర్‌లో బాంబులను పేల్చి వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకొన్న ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చి కూడా మరలా బాంబు పేలుళ్లు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని చెప్పలేకపోతున్నారంటే ప్రజల రక్షణకు ఈ ప్రభుత్వం ఏపాటి ప్రాధాన్యం ఇస్తుం దో గమనించాలని చంద్రబాబు చెబుతున్నారు.

మహిళల నీరాజనాలు చంద్రబాబు పాదయాత్ర సాగిన అరవపల్లి, ఊరుపాలెం, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపాలెం, బొబ్బర్లంక, కనగాలవారిపాలెంలో మహిళలు నీరాజనాలు పలికారు. ది ష్టి గుమ్మడికాయతో ఎదురొచ్చి చంద్రబాబుకు దిష్టి తీసి కర్పూరంతో హారతిచ్చి నుదుటిన తిలకం అద్ది దీవించారు. చంటిపాపలను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చి నామకరణం చే యించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, తెలుగు మహిళలు ము లకా సత్యవాణి, కేసనశెట్టి రామశాంతాదేవి తదితరులు చంద్రబాబు పాదయాత్ర జరిగే గ్రామాలకు ముందుగానే వెళ్లి మహిళల్లో చైతన్యం నింపుతున్నారు. ఇదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నగర నేతలు ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ యువతను చైతన్యవంతం చేస్తున్నారు.

పేదలకు కూడు.. గూడు..